ప్రధాన మంత్రి కార్యాలయం
భారత రాజ్యాంగాన్ని లెక్కచేయకుండా ఉన్న సందర్భాన్ని సంవిధాన్ హత్యా దివస్ గుర్తు కు తీసుకు వస్తుంది: ప్రధాన మంత్రి
Posted On:
12 JUL 2024 5:06PM by PIB Hyderabad
జూన్ 25వ తేదీ ని సంవిధాన్ హత్యా దివస్ గా ప్రకటించడం వల్ల భారత రాజ్యాంగాన్ని లెక్క చేయకుండా ఉన్నప్పటి కాలాన్ని అది జ్ఞప్తి కి తెస్తుందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ‘ఎక్స్’ లో పొందుపరచిన ఒక పోస్ట్ ను ప్రధాన మంత్రి షేర్ చేస్తూ -
‘‘జూన్ 25వ తేదీ ని సంవిధాన్ హత్యా దివస్ గా జరుపుకోవడం భారత రాజ్యాంగాన్ని లెక్కచేయకుండా ఉంటే ఏమి జరుగుతుందనే దానిని గుర్తు కు తెచ్చే పనిని చేసిపెడుతుంది. ఆ రోజున భారతదేశ చరిత్ర లో కాంగ్రెస్ తెచ్చి పెట్టిన ఒక చీకటి అధ్యాయం అయిన ఎమర్జెన్సీ కాలంలో జరిగిన ఘోర కృత్యాల బారిన పడి యాతనల పాలైన వారందరికి శ్రద్ధాంజలిని సమర్పించే దినం కూడా’’ అని పేర్కొన్నారు.
(Release ID: 2032918)