గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ

స్వయంసహాయక బృందాల మహిళల వ్యాపార వృద్ధి కోసం కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ మరియు సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల శాఖ చేతులు కలిపాయి

Posted On: 03 JUL 2024 7:47PM by PIB Hyderabad

కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ పథకాల స్వయం సహాయక బృందాల (ఎస్.హెచ్.జి) మహిళలు నిర్వహిస్తున్న గ్రామీణ పరిశ్రమలకు ఊతమివ్వడానికి అలాగే వాటిని బలోపేతం చేయడానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ (ఎమ్.ఓ.ఆర్.డి), కేంద్ర సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఈరోజు స్టేట్మెంట్ ఆఫ్ ఇంటెంట్ (ఎస్.ఓ.ఐ)పై సంతకాలు చేశాయి.  

 

కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి శ్రీ శైలేష్ కుమార్, ఎం.వో.ఎమ్.ఎస్.ఎమ్.ఇ. కార్యదర్శి శ్రీ ఎస్.సి.ఎల్. దాస్, అలాగే గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కార్యదర్శి శ్రీ చరణ్‌జిత్ సింగ్‌లతో పాటు రెండు మంత్రిత్వ శాఖలకు చెందిన ఇతర సీనియర్ అధికారుల సమక్షంలో న్యూఢిల్లీలోని కృషి భవన్‌లో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీమతి స్వాతి శర్మ, సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీమతి మెర్సీ ఎపావోలు ఈ ఎస్.ఓ.ఐ.పై సంతకాలు చేశారు.

 

ఈ సందర్భంగా శ్రీమతి స్వాతి శర్మ మాట్లాడుతూ, ఎం.వో.ఎమ్.ఎస్.ఎమ్.ఇ. అలాగే గ్రామీణాభివృద్ధి శాఖల మధ్య జరిగిన ఈ ఎస్.ఓ.ఐ. స్వయం సహాయక సంఘాల మహిళల అభివృద్ధి పట్ల ప్రభుత్వ విధానాన్ని ప్రతిబింబిస్తుందని అన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఆకాంక్షలకు అనుగుణంగా లక్పతీ దీదీల సాధికారతను ఈ ఒప్పందం సులభతరం చేస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా శ్రీమతి మెర్సీ ఎపావో మాట్లాడుతూ, స్వయం సహాయక బృందాల మహిళలు ఎం.వో.ఎమ్.ఎస్.ఎమ్.ఇ. ద్వారా అందించబడుతున్న యశస్విని – అప్నా ఉద్యమ్, అప్నీ పెహచాన్, ఉద్యమ్ అసిస్ట్ వంటి ప్రధాన పథకాలను ఉపయోగించుకోవడంలో వారికి మద్దతునిస్తూ వారిని అభివృద్ధి పథంలో నడిపించడంలో ఈ ఎస్.ఓ.ఐ. రెండు మంత్రిత్వ శాఖల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఆకాంక్షించారు.    

 గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి, ఎమ్.ఎస్.ఎమ్.ఇ. మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఇరువురూ ఈ ఒప్పందాన్ని అభినందించారు అలాగే ఈ ఒప్పందానికి అనుగుణంగా పరస్పర సహకారంతో చర్యలు చేపట్టేందుకు కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు.

 

***



(Release ID: 2030771) Visitor Counter : 12