రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

రక్షణ రంగంలో స్వయంసమృద్ధి లక్ష్య సాధనలో కీలకం కానున్న సాంకేతిక అభివృద్ధి నిధి - టీడీఫ్; అత్యాధునిక సాంకేతికత ద్వారా సామర్ధ్యాలను పెంపొందించుకునే దిశగా అంకుర పరిశ్రమలు, ‘సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమలు’ – ఎం.ఎస్.ఎం.ఈ. లకు ప్రోత్సాహం

Posted On: 03 JUL 2024 5:16PM by PIB Hyderabad

అత్యాధునిక సాంకేతికతలో సామర్ధ్యాల పెంపు జరిగే వాతావరణ కల్పన, రక్షణ రంగంలో స్వయంసమృద్ధి సాధన లక్ష్యాలుగా, ‘సాంకేతిక అభివృద్ధి నిధి’(టీడీఫ్) పథకం,  ప్రభుత్వ /ప్రైవేటు పరిశ్రమలు, ముఖ్యంగా అంకుర పరిశ్రమలు, ‘సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమలు’(ఎం.ఎస్.ఎం.ఈ.ల) భాగస్వామ్యాన్ని ప్రోత్సాహిస్తోంది. మేకిన్ ఇండియా పథకం కింద రక్షణ మంత్రిత్వ శాఖ చేపట్టిన ఈ ముఖ్య కార్యక్రమాన్ని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO నిర్వహిస్తోంది.

పథకం ద్వారా ఇప్పటివరకూ 300 కోట్ల రూపాయల ఖర్చు కాగల  77 ప్రాజెక్టులని వివిధ పరిశ్రమలకి కేటాయించారు, 27 రక్షణ సాంకేతికతలు ఫలవంతం అయ్యాయి.

టీడీఫ్ పథకం కింద విజయవంతమైన కొన్ని అంకుర పరిశ్రమల విజయగాథలు ఇలా ఉన్నాయి :

  1. కంబాట్ రోబోటిక్స్, పూణే 

పూణే అంకుర పరిశ్రమ కంబ్యాట్ రోబోటిక్స్ సంస్థ మానవరహిత వాహనాల (Unmanned Vehicles) వినియోగం కోసం ఇన్నొవేటివ్ సిమ్యులేటర్ అనే పరికరాన్ని రూపొందించింది. ఈ పరికరాలు మానవ ప్రమేయం లేకుండా నేల పై, నీటిలో, ఉపరితల, ఆకాశ మార్గాల్లో నడిచే వాహనాలు - UGVs, UUVs, USVs, UAVs లలో ఉపయోగించే వీలున్న మల్టీ డొమెయిన్ సిమ్యులేటర్లు. స్వయంప్రతిపత్తి కల వ్యవస్థలను రూపొందించే సంస్థలకు ఈ సిమ్యులేటర్ ఒక వరం వంటిది.  

ఈ సిమ్యులేటర్ సమగ్ర పర్యావరణ నమూనాలు, ఊహాచిత్రాలు, వాహన నమూనాలు, సులభమైన వాహన అదుపు పద్ధతులు, సమగ్ర సమాచార పత్రాలను అందిస్తుంది. పలు రంగాల్లో, సందర్భాలలో మానవ ప్రమేయం లేని  వాహనాల పరీక్ష, వాటి స్వతంత్ర పనితీరుని తెలుసుకునేందుకు సిమ్యులేటర్ సాంకేతికత పనికి వస్తుంది. బెంగుళూరులోని డీ.ఆర్.డీ.ఓ.  సంస్థ ప్రయోగశాల CAIR (కృత్రిమ మేధ, రోబోటిక్స్ సంస్థ) ఆధ్వర్యంలో ఈ సాంకేతికతను అభివృద్ధి చేశారు. 

 

  1.  చై స్టాట్స్  ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్, పూణే
  • ఎయిరో గాస్ టర్బైన్ల ఇంజన్ సామర్ధ్యాన్ని పరిశీలించేందుకు వర్చువల్ సెన్సర్ల ఏర్పాటు..

ఎయిరో గాస్ టర్బైన్ల ఇంజన్ ( AGTE) ల విడిభాగాల పనితీరుని పరిశీలించేందుకు సమగ్ర వ్యవస్థ రూపకల్పన, తద్వారా ఇంజన్ పనితీరు, జీవితకాలంపై పెరిగే భరోసా ఈ ప్రాజెక్టు లక్ష్యాలు. కృత్రిమ మేధ, మెషీన్ లెర్నింగ్ వంటి నవీన సాంకేతికల బలమైన పునాదులపై ఈ వ్యవస్థ తయారైంది. పెద్ద మొత్తంలో డేటా నిర్వహణ, వాహన పనితీరుని గురించి కచ్చితమైన అంచనాలనూ చేయగలుగుతుంది. వర్చువల్ సెన్సర్ల వ్యవస్థ దేశీయంగా తయారౌతోంది.

డీ.ఆర్.డీ.ఓ. బెంగళూరు ప్రయోగశాల – ‘గ్యాస్ టర్బైన్ రీసర్చ్ ఎస్టాబ్లిష్మెంట్’ సంస్థ సాంకేతిక పర్యవేక్షణలో ఈ నూతన సాంకేతికత తయారైంది.  డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ రంగాల్లో  చై స్టాట్స్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అంకుర పరిశ్రమ, అంతేకాక, డీ.ఆర్.డీ.ఓ. నిర్వహించిన డేర్ టు డ్రీమ్ 2.0 సృజనాత్మక పోటీలో గెలుపొందిన సంస్థ.

  • డేటా మదింపులో పనికివచ్చే ఉపకరణాలు/పద్ధతులు, క్రియాశీల విద్య, విశ్వసనీయత   

ఈ అద్భుత ప్రాజెక్టు ఏఐ నమూనా క్రమబద్ధీకరణ, రక్షణ వ్యవస్థలో సక్రమ సమర్థవంతమైన వినియోగం కోసం తయారైంది. ఈ ప్రాజెక్టు ద్వారా శాస్త్రవేత్తలు తాము పునరావృతం చేయగల ప్రయోగాల గురించి,  ఇతరత్రా సమాచారాన్ని సులభంగా ఒకరితో ఒకరు పంచుకోగలుగుతారు.  ప్రాజెక్టులో ఉపయోగించే ఉపకరణాలన్నీ  సులభంగా అర్థమయ్యే వెబ్ ఆధారిత ఇంటర్ఫేస్ ద్వారా లభ్యమవుతాయి.

రక్షణ వ్యవస్థలో భాగంగా ఉత్పన్నమయ్యే అత్యధిక మొత్తంలోని డేటా నిర్వహణ, ఆ క్రమంలో ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించే ప్రయత్నం ఈ ప్రాజెక్టు చేస్తుంది.  ఇందులో 4 కీలక భాగాలు ఉన్నాయి, అవి :   డేటా ఫీచర్ అసెస్మెంట్,  యాక్టివ్ లెర్నింగ్,  ఏఐ బిలీవబిలిటీ, మరియు వెబ్ అప్లికేషన్.  మెరుగైన ఖచ్చితమైన సమర్థవంతమైన కృత్రిమ మేధ నమూనాల తయారీలో ఈ ప్రాజెక్టు భద్రత సంస్థలకు బాసటగా నిలుస్తుంది.  దీనితో నిర్ణయాలు తీసుకోవడంలో సౌలభ్యం ఏర్పడుతుంది, అంతేకాక, పలు కీలక అంశాలలో సామర్థ్యం పెరుగుతుంది. బెంగళూరు కెయిర్(CAIR)సంస్థ,  ఈ ప్రాజెక్టు పరిశీలన అభివృద్ధిలో కీలక భూమిక పోషించింది.

 

 

  1. న్యూ స్పేస్ రీసర్చ్ అండ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, బెంగళూరు

 

బయటికి కనపడని ప్రాంతాలు/ప్రదేశాలలో అన్వేషణ జరిపి నివేదికలను సత్వరమే అందించగల స్వయంచాలిత డ్రోన్(‘Autonomous Drone as First Responder for Search and Report Operations in Enclosed/Indoor Environments’)ను బెంగుళూరుకి చెందిన అంకుర సంస్థ రూపొందించినది. అత్యాధునిక సాంకేతికత సహాయంతో తయారైన ఈ మానవరహిత స్వయంచాలిత డ్రోన్(యూ.ఏ.వీ), చిమ్మచీకటి సహా ఎటువంటి పరిస్థితుల్లోనైనా మరుగున ఉన్న ప్రదేశాలలో సోదాలు జరపగలదు.

స్వయంచాలిత అన్వేషక సంగ్రహము(autonomous navigation stack), వస్తు నిర్ధారణ వ్యవస్థ(on-board object detection module), స్థానిక రక్షణ సహాయక సాంకేతికతతో కూడిన  ఫ్లైట్ నియంత్రణ వ్యవస్థలు(localisation fall back mechanism integrated with flight control firmware) వంటి సాంకేతికతలను కలిగిన ఇండోర్ యూ.ఏ.వీ లను అభివృద్ధి పరచడంపై ప్రాజెక్టు దృష్టి సారిస్తోంది. స్వయంచాలిత అన్వేషక సంగ్రహం 3 D మ్యాపింగ్ ను, శోధన పరిష్కారాలను, కృత్రిమ మేధ, మెషీన్ లర్నింగ్ కలిగి ఉంటుంది. 

ప్రాజెక్టు విజయం ఈ నూతన సాంకేతికతను అనేక రంగాల్లో విరివిగా వినియోగించే వీలు  కల్పిస్తుంది. సోదా, సహాయక చర్యలు, పర్యవేక్షణ, పారిశ్రామిక తనిఖీలు, పర్యావరణ పరిశీలన, ప్రమాదకర పర్యావరణ పరిశోధనలు వంటి వివిధ సందర్భాలలో వినియోగానికి యూ.ఏ.వీ లలో సాంకేతిక అభివృద్ధికి దోహదపడుతుంది. బెంగుళూరు CAIR సంస్థ సాంకేతిక శిక్షణ, సహాయం వల్ల  ప్రాజెక్టును అభివృద్ధి చేశారు.  .

ఈ ప్రాజెక్టులతో సంబంధం ఉన్న అంకుర పరిశ్రమలకు, డీ.ఆర్.డీ.ఓ. ప్రయోగశాలలకు  డీ.ఆర్.డీ.ఓ. ఆర్ అండ్ డీ విభాగ కార్యదర్శి, చైర్మన్, డాక్టర్ సమీర్ వి కామత్ అభినందనలు తెలియజేశారు. ప్రధానమంత్రి ఆశయమైన ‘ఆత్మనిర్భర్ భారత్’ సాకారంలో భాగంగా పరిశ్రమలకు సహాయం అందించడంలో డీ.ఆర్.డీ.ఓ. భాగస్వామ్యాన్ని ఈ విజయాలు తెలియజేస్తున్నాయని అన్నారు.

టీడీఎఫ్ పథకం ముఖ్య ఉద్దేశాలు:

* ప్రస్తుతం భారత రక్షణరంగ పరిశ్రమలకు అందుబాటులో లేని రక్షణ వ్యవస్థలను అటు రక్షణ రంగంలోనూ, ఇటు సివిల్ రంగంలోనూ వినియోగానికి అనువుగా తయారుచేసి, అంకుర పరిశ్రమలు, ఎం.ఎస్.ఎం.ఈ. లు, విద్యాసంస్థలు, శాస్త్ర సాంకేతిక సంస్థలకు ‘గ్రాంట్ ఇన్ ఎయిడ్’ పద్ధతి ద్వారా అందించడం.

(‘గ్రాంట్ ఇన్ ఎయిడ్’ అనగా ఒక ప్రత్యేక ఉద్దేశం కోసం ఒక ప్రభుత్వ విభాగం నుంచి మరొక ప్రభుత్వ విభాగానికి అందే ధనరాశి).

ప్రైవేటు రంగం, మరీ ముఖ్యంగా చిన్న, సూక్ష్మ, మధ్యతరహా  పరిశ్రమలు, అంకుర పరిశ్రమలతో మమేకమై వాటిల్లో డిజైన్ అభివృద్ధిలో సైనిక దళాల సాంకేతికత సంస్కృతిని ప్రవేశపెట్టడం, వాటికి ‘గ్రాంట్ ఇన్ ఎయిడ్’ ద్వారా మద్దతు అందించడం.

* దేశంలో తొలిసారిగా తయారవుతున్న ప్రత్యేక, అత్యున్నత స్థాయి సాంకేతికతల అభివృద్ధి పరిశోధన డిజైన్లపై దృష్టి సారించడం.

* భద్రత దళాలు, పరిశోధన సంస్థలు, విద్యా సంస్థలు, సర్టిఫికేషన్ సంస్థలు ప్రైవేట్ రంగ సంస్థల మధ్య వారధి నిర్మించడం.

 

***



(Release ID: 2030671) Visitor Counter : 16