శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
ఉక్కు అవశేషాలతో నిర్మించిన రహదారిపై అంతర్జాతీయ సమావేశం
రహదారుల నిర్మాణంలో ఉక్కు అవశేషాల వినియోగంపై మార్గదర్శకాలను విడుదల చేసిన నీతి అయోగ్ (సైన్స్) సభ్యుడు డాక్టర్ వి.కె.సారస్వత్
Posted On:
01 JUL 2024 4:46PM by PIB Hyderabad
ఉక్కు అవవేశషాలతో రహదారి నిర్మాణంపై నిర్వహించిన మొదటి అంతర్జతీయ సమావేశాన్ని ఐ ఆర్- సిఆర్ ఆర్ ఐ , పిహెచ్ డి సిసిఐ కలిసి ఉమ్మడిగా న్యూఢిల్లీలో నిర్వహించాయి. ఈ సందర్భంగా రహదారుల నిర్మాణంలో ఉక్కు అవశేషాల వినియోగం ఎలా చేయాలనేదానిపూ మార్గదర్శకాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన డాక్టర్ సారస్వత్ సుస్థిర అభివృద్ధి ప్రాధాన్యతను వివరించారు. ఉక్కు అవశేషాల్లాంటి పారిశ్రామిక వ్యర్థాలనుమౌలిక సదుపాయాల ఏర్పాటులో సమర్థవంతంగా ఉపయోగించడంపైనా ఆయన మాట్లాడారు. ఉక్కు అవశేషాలను ఉపయోగించి రహదారులను నిర్మించడం, నిర్వహించడంలో మార్గదర్శకాలను ఉపయోగించడం వల్ల అనేక లాభాలు వస్తాయని డాక్టర్ సారస్వత్ తెలిపారు. రోడ్డ నిర్మాణ వ్యయం తగ్గుతుందని, పర్యావరణ నష్టాలు తగ్గుతాయని, ఆయా రహదారుల సామర్థ్యం పెరుగుతుందని ఆయనవివరించారు. వర్థాలనుంచి సంపద సృష్టించాలనే ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ దార్శనికత సఫలం కావడానికి సిఎస్ ఐ ఆర్- సిఆర్ ఆర్ ఐ ఉక్కు అవశేష రహదారి సాంకేతికత దోహదం చేస్తుందని ఆయన అన్నారు. సిఆర్ ఆర్ ఐ డైరెక్టర్ డాక్టర్ మనోరంజన్ పరీడాను, ఉక్కు అవశేష రహదారి సాంకేతికత సృష్టికర్తయిన ప్రధాన శాస్త్రవేత్త శ్రీ సతీష్ పాండేను ఆయన అభినందించారు. ఈ వినూత్నమైన సాంకేతికత దేశవ్యాప్తంగా వినియోగిచండంలోను, అభివృద్ధిలోను వారు చేసిన విశిష్ట కృషిని ప్రశంసించారు.
కేంద్ర ఉక్కు శాఖ కార్యదర్శి శ్రీ నాగేంద్ర నాథ్ సిన్హా మాట్లాడుతూ తమకు లభ్యమైన ఉత్తమ వస్తువలన్నిటినీ ఉపయోగించుకోవడంద్వారా ఉక్కు పరిశ్రమలు మనుగడ సాగిస్తున్నాయని అన్నారు. ఈ స్ఫూర్తితోనే సిఎస్ ఐ ఆర్ - కేంద్ర రహదారుల పరిశోధనా సంస్థకు ప్రధానమైన ఆర్ అండ్ అడి ప్రాజెక్ట్ ను అప్పగించడం జరిగిందని రహదారుల నిర్మాణంలో ప్రత్యామ్నాయంగా భారీగా ఉక్కు అవశేషాలను ఉపయోగించడం జరుగుతోందని అన్నారు. ఉక్కు అవశేషాలను వినియోగించుకునే విషయంలో సిఆర్ ఆర్ ఐ తయారు చేసిన మార్గదర్శకాలకారణంగా వివిధ రకాల ఉక్కు అవశేషాలను సమర్థవంతంగా, భద్రంగా ఉపయోగించుకోవడం జరుగుతుందని అన్నారు. అలాగే ఆయా ఉక్కు అవశేషాల నిర్వహణ, పర్యావరణపరమైన సమస్యలు రాకుండా భద్రపరచడం తెలుస్తుందని అన్నారు. నిర్మాణాలకు, నిర్వహణ పనులకుగాను దేశంలో ప్రతి సంవత్సరం 1.8 బిలియన్ సహజ ముడి పదార్థాలు అవసరమని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో ఉక్కు తయారీ తర్వాత మిగిలిపోయిన అవశేషాలను రహదారుల్లో ఉపయోగించడంవల్ల సహజ ముడి పదార్థాలను కాపాడినట్టవుతుందని పర్యావరణ సంరక్షణ జరుగుతుందని అన్నారు.
డిఎస్ ఐఆర్ కార్యదర్శి డాక్టర్ ఎన్. కలైసెల్వి మాట్లాడుతూ ముంబాయినుంచి గోవావరకు ఉక్కు అవశేషాలతో రహదారి వేయడం జరిగిందని అన్నారు. వ్యర్థాలనుంచి సంపద సృష్టించాలనే కార్యక్రమం సిఎస్ ఐ ఆర్‌కు మంచి పేరు తెచ్చిందని, ప్రజాదరణ పొందిందని అన్నారు. సిఎస్ ఐ ఆర్ కు నీతి ఆయోగ్ నుంచి, శ్రీ సారస్వత్ నుంచి క్రమంతప్పకుండా లభిస్తున్న మద్దతును ఆమె ప్రశంసించారు. ఉక్కు అవశేషాల రహదారి సాంకేతికత అనేది కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖకు ఉపయోగకరంగా మారిందని అంతే కాదు రహదారుల మంత్రిత్వశాఖ ప్రగతికి దోహదం చేస్తోందని అన్నారు. ప్రభుత్వంలోని మడూఉ ముఖ్యమైన మంత్రిత్వశాఖలకు ఉమ్మడి అంశంగా మారిందని అన్నారు. ఉక్కుఅవశేషాల రహదారి సాంకేతికత అనేది అంతర్జాతీయంగా పేరు సంపాదించుకుంటోందని, ఈ మధ్యనే అమెరికా ప్రభుత్వం దీని గురించి మన దేశానికి లేఖ రాసినట్టు ఆమె వివరించారు.
సిఎస్ ఐ ఆర్- సిఆర్ ఆర్ ఐ డైరెక్టర్ డాక్టర్ మనోరంజన్ పరీదా మాట్లాడుతూ దేశంలో రహదారుల నెట్ వర్ ప్రగతిలో వివిధ రకాల సాంకేతిక కార్యక్రమాలు ఉపయోగపడ్డాయని వాటిని అభివృద్ధి చేయడంలో సిఆర్ ఆర్ ఐ కృషి ఎంతో వుందని వివరించారు.
ఈ కార్యక్రమంలో ప్రసిద్ధి చెందిన ఉక్కు తయారీ సంస్థల ప్రతినిధులు పాల్గొని రహదారుల నిర్మాణంలో ఉక్కు అవశేషాల ప్రాధాన్యతను వివరించారు. అది దేశంలో సుస్థిరమైన మౌలిక సదుపాయాల అభివృద్దికి దోహదం చేస్తుందని అన్నారు.
అర్సెలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా డైరెక్టర్ శ్రీ రంజన్ ధార్ మాట్లాడుతూ తమ సంస్థ హజిరా సూరత్ దగ్గర భారతదేశ మొట్ట మొదటి ఉక్కు అవశేషాల రహదారిని నిర్మించిందని అన్నారు. ఈ రోడ్డు దేశ విదేశాల ప్రశంసలు పొందిందని ఇండియాకు బుక్ ఆప్ రికార్డ్స్లోను, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోను తమ కృషిని నమోదు చేశారని ఆయన అన్నారు. వ్యర్థాలనుంచి సంపద సృష్టించడానికి ఇది ముక్యమైన ఉదాహరణగా నిలుస్తుందని, స్వచ్ఛ భారత కార్యక్రమానికి దోహదం చేస్తుందని, గ్రీన్ హౌస్ వాయువులను, కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తుందని వివరించారు.
****
(Release ID: 2030200)
Visitor Counter : 169