పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ

రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్ కింద రాష్ట్ర నోడల్ ఆఫీసర్లు, రాష్ట్ర ప్రోగ్రామ్ మేనేజర్లకు ఐదు రోజుల రిఫ్రెషర్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని నేడు దిల్లీలో ప్రారంభించిన కార్యదర్శి శ్రీ వివేక్ భరద్వాజ్


అంకితభావం, నాణ్యమైన పని ద్వారా గ్రామీణ జీవితాల్లో సానుకూల మార్పును తీసుకురావాల్సిన అవసరాన్నినొక్కి చెప్పిన శ్రీ వివేక్ భరద్వాజ్



ఐదు రోజుల రిఫ్రెషర్ ట్రైనింగ్ కార్యక్రమానికి హాజరైనవారికి అభివృద్ధి, సమస్యల నిర్ధారణ విధానాల ద్వారా నాయకత్వ సామర్థ్యాలను పెంపొందించడం, మెరుగుదల కోసం ప్రాంతాలను గుర్తించడం, అవసరమైన పాలనా నైపుణ్యాలను మెరుగుపరచడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది

Posted On: 01 JUL 2024 5:59PM by PIB Hyderabad

 రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్ (ఆర్జీఎస్ఏ) కింద రాష్ట్ర నోడల్ అధికారులు (ఎస్ఎన్ఓలు)రాష్ట్ర ప్రోగ్రామ్ మేనేజర్లకు (ఎస్పీఎం) ఐదు రోజుల రిఫ్రెషర్ శిక్షణ కార్యక్రమాన్ని పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ వివేక్ భరద్వాజ్  నేడు న్యూఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ (ఐఐపీఏ)లో ప్రారంభించారు.

 

కార్యదర్శిశ్రీ వివేక్ భరద్వాజ్ తన తన ప్రసంగంలోఅంకితభావం నాణ్యమైన పని ద్వారా గ్రామీణ జీవితాల్లో సానుకూల మార్పును తీసుకురావాల్సిన అవసరాన్ని ప్రధానంగా పేర్కొన్నారు. సమావేశంలో పాల్గొన్న వారు తమ తమ సామర్థ్యాలను గుర్తించాలనిప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకోవాలనిపనితీరులో రాణించడానికి కృషి చేయాలని కోరారు. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో సానుకూల మార్పు తీసుకురావడానికి అవసరమైన అపారమైన మానవ సామర్థ్యంసంకల్పంఉద్వేగభరిత ఆకాంక్షను ఆయన ఎత్తిచూపారు.

 

 'పంచాయతీలకు వనరులునిధుల కొరత లేదు. సామర్థ్య పెంపుశిక్షణ (సిబిటి) కార్యక్రమాలలో గణనీయమైన పెట్టుబడులు పెడుతున్నాం. క్షేత్రస్థాయిలో ఈ ప్రయత్నాల సానుకూల ఫలితాలను చూడటమే నిజమైన అవసరం'' అని భరద్వాజ్ ఉద్ఘాటించారు. మనస్తత్వంలో సానుకూల మార్పు ద్వారా నాణ్యమైన స్పష్టమైన ఫలితాలను పొందేందుకు సమగ్ర విధానాన్ని ఆయన సూచించారు. సానుకూల మనస్తత్వంతో కూడిన పరివర్తన పద్ధతులుస్వయం సమృద్ధి కలిగిన బలమైన అర్థవంతమైన సంస్థలను ఎలా స్థాపించవచ్చో ఆయన వివరించారు.

 

కేంద్ర ఆర్థిక సంఘ నిధులతో ప్రాజెక్టులను ప్రారంభించడం లేదా ఆవిష్కరించడం విస్తృత గుర్తింపును తీసుకురావడమే కాకుండా ఇతర పంచాయతీలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని శ్రీ వివేక్ భరద్వాజ్ తెలిపారు. స్వామిత్వ పథకాన్ని అమలు చేయడంఆస్తిపన్ను వసూలు ప్రక్రియను ఓన్ సోర్స్ రెవెన్యూ (ఓఎస్ఆర్)తో అనుసంధానం చేయడం ద్వారా పంచాయతీల ఆదాయాన్ని పెంచేందుకు మార్గం సుగమం చేయవచ్చన్నారు. ఇతర పంచాయితీలకు స్ఫూర్తినిచ్చేలా తమ అభ్యసనఅనుభవాలను పంచుకోవాలని శ్రీ భరద్వాజ్ పాల్గొనేవారికి సూచించారు.

 

ప్రారంభ సమావేశంలో ఐఐపీఏ డైరెక్టర్ జనరల్శ్రీ ఎస్ ఎన్ త్రిపాఠిఎంవోపీఆర్ అదనపు కార్యదర్శి డా. చంద్రశేఖర్ కుమార్ఎంవోపీఆర్ జాయింట్ సెక్రటరీ శ్రీ వికాస్ ఆనంద్ఐఐపీఏ ప్రొఫెసర్ డాక్టర్ వీఎన్ అలోక్ పాల్గొన్నారు. జూలై 1 నుంచి 5 వరకు ఐదు రోజుల పాటు జరిగే ఈ రెసిడెన్షియల్ రిఫ్రెషర్ ట్రైనింగ్ కార్యక్రమంలో 27 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 50 మందికి పైగా రాష్ట్ర నోడల్ అధికారులు(ఎస్ఎన్ఓలు)రాష్ట్ర ప్రోగ్రామ్ మేనేజర్లు (ఎస్పీఎంలు) పాల్గొన్నారు.

 

 శ్రీ ఎస్.ఎన్. త్రిపాఠి సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూసామర్థ్య పెంపుశిక్షణ (సిబిటి) దిశలో పంచాయితీ రాజ్ మంత్రిత్వ శాఖ చేపట్టిన వినూత్న కార్యక్రమాలను ప్రశంసించారు. స్థానీకరణ భావన ద్వారా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను (ఎల్ఎస్‌డీజీ) గ్రామాల్లో సమ్మిళితసమగ్రసుస్థిర అభివృద్ధి పనులను ప్రపంచ లక్ష్యాలకు అనుగుణంగా తీర్చిదిద్దడంలో ఎంవోపీఆర్ దార్శనిక ప్రయత్నాలను ప్రశంసించారు. పంచాయితీరాజ్ మంత్రిత్వ శాఖ పంచాయితీలలో చేపడుతున్న నిరంతర ప్రయత్నాలు జాతీయంగాఅంతర్జాతీయంగా గుర్తింపును పొందడానికి దోహదపడ్డాయని శ్రీ త్రిపాఠి నొక్కి చెప్పారు. ఐఐఎం అహ్మదాబాద్ లో పంచాయితీ ప్రతినిధులకు శిక్షణ ఇచ్చేందుకు పంచాయితీ రాజ్ మంత్రిత్వ శాఖ చొరవ వినూత్నంగామార్గదర్శకంగా ఉందని ఆయన ప్రశంసించారు.

 

పంచాయితీరాజ్ మంత్రిత్వ శాఖ చేపడుతున్న ఈ రిఫ్రెషర్ కోర్సులు నిరంతర సంవాదంప్రచార సాధనంగా ఉపయోగపడతాయనికోర్సుల ప్రాముఖ్యతను డా. చంద్ర శేఖర్ కుమార్ నొక్కి చెప్పారు. పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్ మెంట్ సిస్టం (పీఎఫ్ ఎంఎస్) ద్వారా సర్వీస్ డెలివరీపంచాయతీ డెవలప్‌మెంట్ ప్లాన్స్ (పీడీపీ) నాణ్యతడిజిటల్ గవర్నెన్స్ ద్వారా ఆర్థిక నిర్వహణ సానుకూల ప్రభావాలను ఆయన ప్రస్తావించారు.

 

ట్రైనింగ్ లో పాల్గొనేవారి సామర్థ్యంనైపుణ్యాభివృద్ధినాయకత్వ సామర్ధ్యంపనితీరును పెంపొందించడానికి ఉద్దేశించిన ఈ రిఫ్రెషర్ శిక్షణ ప్రాముఖ్యతను శ్రీ వికాస్ ఆనంద్ వివరించారు. ప్ర ధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కలలు కంటున్న సాధికారఅభివృద్ధి చెందినస్వావలంబన గ్రామీణ భారతావని దార్శనికతను సాధించేందుకు సమన్వయ కృషినిరంతర సహకార అవసరాన్ని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు.

 

నాయకత్వ నైపుణ్యాలుసంఘటిత శ్రమసంఘర్షణ నిర్వహణభావప్రసార నైపుణ్యంమీడియా సంబంధాలుకమ్యూనిటీ ఎంగేజ్మెంట్సంక్షోభ సందేశాలు ఈ-గ్రామస్వరాజ్పీఎఫ్ఎంఎస్టీఎంపీఓఎస్ఆర్ వంటి వివిధ కార్యక్రమాలపై ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇచ్చారు. వార్షిక కార్యాచరణ ప్రణాళికల తయారీఆర్జీఎస్ఏ కింద పురోగతిని నివేదించడంఆడిట్ ఆన్‌లైన్మేరీ పంచాయత్పంచాయత్ నిర్ణయ్ వంటి పోర్టల్స్ వినియోగంపై శిక్షణ ఇస్తున్నారు.

 

ఐదు రోజుల రిఫ్రెషర్ ట్రైనింగ్ కార్యక్రమంలో పాల్గొన్నవారికిపాలనా నైపుణ్యాలను మెరుగుపరచడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. వారిలో నాయకత్వ సామర్థ్యాలను పెంపుమెరుగవ్వాల్సిన ప్రాంతాల గుర్తింపు,  అభివృద్ధిసమస్యల గుర్తింపు విధానాలను నేర్పారు. ట్రైనింగ్ పూర్తయిన తరువాతపాల్గొనేవారు ఈ క్రింది వాటిని ఆశించనున్నారు: (i) తమ బృందాలను అధిక పనితీరుసమర్థత (ii) స్థానిక పాలనలో సమకాలీన నాయకత్వ భావనలపై సంపూర్ణ అవగాహన  (3) గొప్ప ప్రభుత్వోద్యోగుల మాదిరిగానే వారి స్వంత నాయకత్వ లక్షణాలను గుర్తించడం (4) వారి పంచాయితీలలో దృఢమైనచురుకైన పరిపాలనను ప్రోత్సహించడానికి వనరులను వ్యూహాత్మకంగా సమీకరించడం (v) మరింత సమర్థవంతంగా పనిచేయడానికి వారి నైపుణ్యాలను పెంపొందించడం.

 

నేపథ్యం:

 

 పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖగ్రామీణ ముఖచిత్రాన్ని మార్చడానికి వివిధ కార్యక్రమాలను చేపట్టింది. వీటిలో పిఆర్ఐల ద్వారా సుస్థిరాభివృద్ధి లక్ష్యాల (ఎల్ఎస్డిజి) స్థానికీకరణసాక్ష్యం ఆధారిత పంచాయతీ అభివృద్ధి ప్రణాళికల(పిడిపి) తయారీప్రాదేశిక ప్రణాళికపంచాయతీ అభివృద్ధి సూచిక (పిడిఐ) సంస్థాగతీకరణ ఉన్నాయి. ఈ కార్యక్రమాలకు ఇ-గ్రామ్ స్వరాజ్పిఎఫ్ఎంఎస్ఆడిట్ ఆన్‌లైన్శిక్షణ నిర్వహణ పోర్టల్ మరియు మరెన్నో అనువర్తనాలు మద్దతునిస్తున్నాయి.

 

 

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ (ఐఐపీఏ) సహకారంతో ఈ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడానికి నైపుణ్యాన్ని పెంపొందించడంశిక్షణ ఇవ్వడం ఈ శిక్షణా కార్యక్రమం లక్ష్యం. న్యూఢిల్లీలోని ఐఐపీఏ ద్వారా దశలవారీగా ఎస్ఎన్‌వోలుఎస్పీఎంలుడీపీఎంలను లక్ష్యంగా చేసుకుని 2024-25లో పన్నెండు రెసిడెన్షియల్ శిక్షణా కార్యశాలను నిర్వహించనున్నారు. ఐఐపీఏ తన విస్తృతమైన అనుభవంనైపుణ్యంతో 2024 జూలై 1 నుంచి 5 వరకు మొదటి బ్యాచ్ శిక్షణను నిర్వహిస్తోంది.

 

లక్ష్యాలు: రాష్ట్ర నోడల్ ఆఫీసర్లు (ఎస్ఎన్ఓలు)రాష్ట్ర ప్రోగ్రామ్ మేనేజర్ల (ఎస్పీఎం) నాయకత్వ సామర్థ్యాలను పెంపొందించడంఇ-గ్రామస్వరాజ్పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలుపంచాయతీ అభివృద్ధి సూచిక (పిడిఐ)ట్రైనింగ్ మేనేజ్ మెంట్ పోర్టల్ (టిఎంపి)మేరీ పంచాయితీ ఇంకా మరెన్నో ఎంఒపిఆర్ కార్యక్రమాలపై తాజా నవీకరణలతో ట్రైనింగ్ లో పాల్గొనేవారిని సన్నద్ధం చేస్తుందిఈ కార్యక్రమాలను ఆచరణాత్మకంగా అన్వయించడం కోసం శిక్షణలో సెషన్ లను నిర్వహిస్తారుఆర్జీఎస్ఏ కింద పీఆర్ఐలను బలోపేతం చేయడానికి వినూత్న కార్యక్రమాలను మేధోమథనం చేస్తారు.

 

కార్యక్రమ రూపకల్పన: ఈ ట్రైనింగ్ కార్యక్రమం వయోజన అభ్యాస సూత్రాలను అనుసరిస్తుంది. ఇందులోని అంశాలు ప్రాసంగితనుసంబంధాన్నిఅనువర్తనాన్ని నిర్ధారిస్తాయి. కొత్త కార్యక్రమాలను మరింత మెరుగ్గా అర్థం చేసుకోవడానికి ఇది ప్రత్యక్ష సంబంధాలను కలిగి ఉంటాయి. నాయకత్వ నైపుణ్యాలుసంఘటిత శ్రమసంఘర్షణ నిర్వహణకమ్యూనికేషన్ నైపుణ్యాలపై సెషన్లతో కార్యక్రమం ప్రారంభమవుతుంది.

 

***



(Release ID: 2030198) Visitor Counter : 13