మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ

కల్లకురిచ్చి ని సందర్శించిన మహిళల జాతీయ సంఘం (ఎన్సిడబ్ల్యు) బృందం

Posted On: 27 JUN 2024 8:31PM by PIB Hyderabad

నకిలీ సారా ను సేవించడం తో తమిళ నాడు లో కల్లకురిచ్చి లో అనేక మంది చనిపోయినట్లు మీడియా లో వచ్చిన వార్తకథనాల ను మహిళ ల జాతీయ సంఘం (ఎన్‌సిడబ్ల్యు) తనంతట తాను పరిగణన లోకి తీసుకొంది. ఎన్‌సిడబ్ల్యు సభ్యురాలు శ్రీమతి ఖుశ్బూ సుందర్ నాయకత్వం లో ముగ్గురు సభ్యుల తో ఓ విచారణ సంఘాన్ని ఎన్‌సిడబ్ల్యు ఏర్పాటు చేసింది. ఆ బృందం 2024 జూన్ 26 వ తేదీ న తమిళ నాడు లోని కల్లాకురిచ్చి ని సందర్శించింది.

ఈ ఘటన లో ఆప్తుల ను కోల్పోయిన వితంతు మహిళల తోపాటు తల్లి ని గాని, లేదా తండ్రి ని గాని, లేదా తల్లితండ్రుల ను ఇరువురినీ కోల్పోయిన పిల్లల ను కలుసుకోవడం కోసమని పన్నెండు మంది బాధితుల ఇళ్ళ కు బృందం వెళ్ళింది. బాధితుల ను కలుసుకోవడం కోసం ఆసుపత్రి ని కూడా బృందం సందర్శించింది. బాధిత కుటుంబాల కు ప్రకటించిన నష్టపరిహారం స్థితి ని గురించి మరియు ప్రభావిత కుటుంబాల కు అందిస్తున్న సలహా సంబంధి సేవల ను గురించి న వివరాల ను బృందం అడిగి తెలుసుకుంది.

తల్లితండ్రుల ను ఇరువురినీ కోల్పోయినటువంటి బాలల కు తగిన ఆశ్రయం తో పాటు గా ఉచిత విద్య ను కూడా అందించాలి అంటూ జిల్లా అధికారుల తో జరిపిన ఒక సమావేశం లో బృందం సిఫారసు చేసింది. తల్లితండ్రుల ను ఇరువురినీ కోల్పోయిన పిల్లల కు 5 లక్షల రూపాయల వంతున మరియు తల్లితండ్రుల లో ఏ ఒక్కరినో కోల్పోయినటువంటి పిల్లల కు 3 లక్షల రూపాయల వంతున ఇవ్వడమైంది అని బృందం దృష్టికి తీసుకు రావడమైంది. 44 కుటుంబాల వారు నష్టపరిహారాన్ని ఇప్పటికే అందుకొన్నారు.

ఈ అంశం లో అవసరమైన పోలీసు చర్యల ను కూడా తీసుకోవడమైంది. ఈ కేసు ను మహిళల జాతీయ సంఘం నిశితం గా పర్యవేక్షిస్తున్నది.

 

***



(Release ID: 2029426) Visitor Counter : 10