శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

‘హైడ్రోజన్ ఆలంబనగా నిలచేటటువంటి ఆర్థిక వ్యవస్థ’ దిశ లో ముందంజ వేసేందుకు మెథనాల్ మరియు ఫార్మల్ డిహైడ్ ల యొక్క మిశ్రణం నుండిహైడ్రోజన్ ఉత్పాదన కు ప్రభావవంతమైన పద్ధతి ని అభివృద్ధి పరచిన ఐఐఎస్ఇఆర్ తిరుపతిలోని పరిశోధకులు

Posted On: 26 JUN 2024 3:04PM by PIB Hyderabad

మైల్డ్ కండిషన్స్ లో మెథనాల్ మరియు పారాఫార్మల్ డిహైడ్ ల మిశ్రణం నుండి హైడ్రోజన్ గేస్ ఉత్పాదన కై ఒక వినూత్నమైన కృత్రిమ పద్ధతి ని పరిశోధకులు అభివృద్ధి పరిచారు. ఈ పద్ధతి ఆల్ కైన్స్ యొక్క ఉదజనీకరణ ద్వారా వాటిని ఎల్కేన్స్ గా మార్పు చేయడం లో ఎంతో ప్రభావవంతం అయినటువంటిది గా నిరూపణ అయింది. అంతేకాకుండా, ఈ కలయిక ఒక ఆశాజనకమైన హైడ్రోజన్ వాహకం గా రూపొందేందుకు వీలు ఉన్నది. తత్ఫలితం గా ఈ పరిశోధన రాసాయనిక సమన్వయం మరియు మన్నిక కలిగివుండే శక్తి సంబంధి పరిష్కారాల బాట లో మునుముందుకు సాగిపోవడం కోసం మార్గాన్ని సుగమం చేస్తుంది.

ఇంధనాలు శరవేగం గా హరించుకు పోతూ ఉన్న పరిణామం ప్రత్యామ్నాయ శక్తి వనరుల కై వెతుకులాట ను వేగిర పరచింది. దీర్ఘ కాలం మనుగడ లో ఉండటటువంటి మరియు నవీకరణయోగ్యమైనటువవంటి వనరుల ను గుర్తించవలసిన అవసరాన్ని ఈ పరిణామం నొక్కి చెప్తున్నది. హైడ్రోజన్ వాయువు ఉత్పాదన మరీ ముఖ్యం గా ఉంది, ఎందుకంటే దీనిలో శక్తి నిలవ, రవాణా, ఇంకా ఇతరేతర రాసాయనిక ప్రక్రియల వల్ల శిలాజ ఇంధనాల స్థానాన్ని హైడ్రోజన్ తాను భర్తీ చేసే సామర్థ్యాన్ని కలిగివున్నది. పెద్ద ఎత్తున మెథనాల్ మరియు పారాఫార్మల్ డిహైడ్ ను ఉత్పత్తి చేసినప్పుడు అవి ఉదజని వాహకాలు గా పనికి వచ్చాయి. అవి సమృద్ధి గా లభిస్తూ ఉండడం తో పాటు వాటిని విస్తారం గా తయారు చేయగలగడం అనే అంశాలు హైడ్రోజన్ యొక్క నిలవ మరియు రవాణా కై వాటిని విలువైనవి గా నిరూపించాయి. ఇది ఫ్రీ హైడ్రోజన్ కంటే ప్రముఖ ప్రయోజనాలను అందిస్తున్నది.

ఇండియన్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ ఎండ్ రిసర్చ్ (ఐఐఎస్ఇఆర్) తిరుపతి లో ఆచార్యుడైన శ్రీ ఏకాంబరమ్ బాలరామన్ నాయకత్వం లో చేపట్టిన పరిశోధన లో క్షారాల ను లేదా ఏక్టివేటర్ యొక్క ఆవశ్యకత లేకుండా మెథనాల్, ఇంకా పేరాఫార్మల్ డిహైడ్ నుండి హైడ్రోజన్ ను తయారు చేయడం కోసం వాణిజ్య సరళి లో లభించే నికెల్ ఉత్ప్రేరకాల ను ఉపయోగించుకోవడమైంది. ఈ కుశలమైనటువంటి ఉత్ప్రేరక వ్యవస్థ మైల్డ్ కండిషన్స్ లో గొప్ప దక్షత ను చాటిచెప్పి మరి ఉత్పన్నమైన హైడ్రోజన్ కు ఎల్కైన్స్ యొక్క కీమో-మరియు స్టీరియో –సెలెక్టివ్ తరహా పాక్షిక హైడ్రోజనీకరణ లో ఫలప్రదం గా ఉపయోగించడమైంది. ఈ ప్రక్రియ మెరుగైన సింథెటిక్ వేల్యూ తో పాటు బయోఏక్టివ్ మాలిక్యూల్స్ వరకు చేరుకోవడానికి దారి తీసింది. ఈ పరిశోధన కు ఎఎన్ఆర్ఎఫ్ (ఇదివరకటి ఎస్ఇఆ‌ర్‌బి.. ఇది విజ్ఞానశాస్త్ర మరియు సాంకేతిక విజ్ఞాన విభాగం (డిఎస్‌టి) పరిధి లో ఏర్పాటైన ఒక చట్టబద్ధ సంస్థ) సమర్థన ను అందించడమైంది.

ఈ పరిశోధన ను కేటెలిసిస్ సైన్స్ ఎండ్ టెక్నాలజి పత్రిక లో ప్రచురించడం కోసం స్వీకరించడమైంది. ఈ పరిశోధన సిఒఎక్స్-ఫ్రీ హైడ్రోజన్ (COx-free hydrogen) ఉత్పాదన కు ఒక క్రొత్త దారిని తెరుస్తుంది. ఈ పరిణామం హైడ్రోజన్ ప్రధానమైన ఆర్థిక వ్యవస్థముందంజ కు దోహదపడుతుంది. హైడ్రోజన్ వాహకాల రూపం లో మెథనాల్ ను మరియు పారాఫార్మల్ డిహైడ్ ను వినియోగించుకొనేందుకు సామర్థ్యం ప్రాప్తించడం అనేది నానాటికీ పెరుగుతున్న ప్రపంచ శక్తి సంబంధి డిమాండుల కారణం గా ఎదురవుతున్న సవాళ్ళ ను పరిష్కరించడం లో మహత్తరమైన సామర్థ్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ వికాసం సుస్థిర శక్తి సంబంధి పరిష్కార మార్గాల అన్వేషణ లో ఒక కీలకమైన ముందడుగు ను సూచిస్తున్నది.

ప్రచురణ యొక్క లింకు : https://pubs.rsc.org/en/content/articlelanding/2024/cy/d3cy01699d

 

***



(Release ID: 2028944) Visitor Counter : 46