భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయం
చెన్నైలోని ఎలక్ట్రానిక్ లావాదేవీల సంఘం 23వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కేంద్ర ముఖ్య శాస్త్ర సలహాదారుని చేతుల మీదుగా క్వాంటమ్ సెక్యూరిటీ రీసెర్చ్ ల్యాబ్ ( క్వాంటమ్ భద్రతా పరిశోధనా ప్రయోగశాల) ప్రారంభం
Posted On:
25 JUN 2024 9:10PM by PIB Hyderabad
చెన్నైలో నిర్వహించిన ఎలక్ట్రానిక్ లావాదేవీలు, భద్రతా సంఘం (సెట్స్) 23వ వ్యవస్థాపక దినోత్సవంలో కేంద్ర ముఖ్య శాస్త్ర సలహాదారులైన ప్రొఫెసర్ అజయ్ కుమార్ సూద్ పాల్గొన్నారు. ఆయనతో పాటు శాస్త్ర విభాగ కార్యదర్శి డాక్టర్ పర్వీందర్ మయాని కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా క్వాంటమ్ భద్రతా పరిశోధనా ప్రయోగశాలను ప్రొఫెసర్ సూద్ ప్రారంభించారు.
డాక్టర్ ఏపిజె అబ్దుల కలాం ఆలోచనల ప్రకారం 2002లో సెట్స్ సంస్థ రూపొందింది. కేంద్ర ప్రభుత్వ ముఖ్య శాస్త్ర సలహాదారుని కార్యాలయం ఈ సంస్థను ప్రారంభించింది. ఈ సంస్థ సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన ఆర్ అండ్ డి సంస్థ. సైబర్ భద్రత, క్రిప్టాలజీ, హార్డ్ వేర్ సెక్యూరిటీ, క్వాంటమ్ సెక్యూరిటీ, నెట్ వర్క సెక్యూరిటీ లాంటి కీలక రంగాల్లో పరిశోధనలు చేస్తుంది.
(సెట్స్ 23వ వ్యవస్థాపక దినోత్సవాలు)
సెట్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుబ్రహ్మణ్యం స్వాగతం పలుకుతూ, సెట్స్ కు సంబంధించిన పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలపై సంక్షిప్త ప్రసంగాన్ని చేశారు. దాంతో సంబరాలు మొదలయ్యాయి. భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలను దృష్టిలో పెట్టుకొని సెట్స్ రూపొందించిన పరిష్కారాలను ఆయన తన ప్రసంగంలో ప్రస్తావించారు. సెట్స్ దేశవ్యాప్తంగా ఏ ఏ సంస్థలతో కలిసి పని చేస్తున్నదీ వివరంగా తెలియజేశారు.
ప్రొఫెసర్ సూద్ తన అధ్యక్ష ఉపన్యాసం ఇస్తూ సెట్స్ సాధించిన విజయాలను ప్రశంసించారు. క్రిప్టోగ్రఫీ, భద్రమైన క్వాంటమ్ కమ్యూనికేషన్, హార్డ్ వేర్ భద్రత, నెట్ వర్క్ భద్రత అంశాలలో దేశీయ సైబర్ సెక్యూరిటీ పరిష్కారాలను అభివృద్ధి చేయడం,అ మలు చేయడంపై ఆయన అభినందనలు తెలిపారు. ప్రయోగశాలలో జరిగిన పరిశోధనను క్షేత్రీయంగా అనువర్తించడంలో సెట్స్ సాధించిన విజయాలను మెచ్చుకున్నారు.
(పిఎస్ ఏ అధ్యక్షోపన్యాసం ఇస్తున్న ప్రొఫెసర్ సూద్)
క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ తదనంతర పరిస్థితుల్లో జాతీయంగా చేసే కృషికి సారథ్యంవహించాలని అందుకోసం తన అనుభవాన్ని సెట్స్ ఉపయోగించాలని ప్రొఫెసర్ సూద్ ప్రోత్సాహకరంగా మాట్లాడారు. ఆయా పరిశ్రమలు, ఆర్ అండ్ డి ప్రయోగశాలలు, విద్యారంగ సంస్థలతో కలిసి చేస్తున్న పనిని బలోపేతం చేయాలని దేశానికి సంబంధించిన కంప్యూటింగ్ కమ్యూనికేషన్ మౌలిక సదుపాయాలలు క్వాంటమ్ సేఫ్‌గా వండేలా చూడాలని సూచించారు. హార్డ్ వేర్ భద్రతా పరీక్ష, పోస్ట్ క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ లాంటి విజయవంతమైన ప్రాజెక్టులను పెంచాలని ఆయన ప్రత్యేకంగా నొక్కి చెప్పారు.
ప్రత్యేక ఉపన్యాసాన్ని ఇస్తున్న డాక్టర్ మైని, శాస్త్ర కార్యదర్శి)
సెట్స్ కు చెందిన శాస్త్రవేత్తలు, సిబ్బంది చేసిన ప్రభావవంతమైన కృషిని శాస్త్ర విషయాల కార్యదర్శి డాక్టర్ మైనీ తన ప్రత్యేక ప్రసంగంలో ప్రశంసించారు. ఈ మధ్యకాలంలో సంభవించిన సైబర్ ప్రమాద ఘటనలను ఉదహరిస్తూ సైబర్ భద్రతను ఎప్పటికప్పుడు నిరంతరం బలోపేతం చేసుకోవాలని ఆమె తన ప్రసంగంలో స్పష్టం చేశారు. సెట్స్ కు సంబంధించిన మౌలిక సదుపాయలను ఈ మధ్యనే పెంచడాన్ని ఆమె తన ప్రస్తంగంలో ప్రస్తావించారు. సైబర్ భద్రతా సవాళ్లను ప్రతిభావంతంగా ఎదుర్కోవడానికి ఇది చాలా ముఖ్యమని ఆమె అన్నారు. తద్వారా సరైన పరిష్కారాలను అభివృద్ధి చేయవచ్చని అన్నారు.
జాతీయ సూపర్ కంప్యూటింగ్ కార్యక్రమం కింద సైబర్ సెక్యూరిటీకోసం ఏఐ లాంటి ఆధునిక సాంకేతికతల వినియోగంలో సెట్స్ భాగస్వామ్యాన్ని డాక్టర్ మైని తన ప్రసంగంలో ప్రస్తావించారు. క్వాంటమ్ కమ్యూనికేషన్, 6జి రంగాలలో అంతర్జాతీయ సహకారాలకోసం ప్రమాణాలతో కూడిన అభివృద్ధి ప్రాధాన్యతను ఆమె గట్టిగా వివరించారు.
ఎలక్ట్రానిక్స్ , సమాచార సాంకేతికత మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సంజయ్ బహాల్ మాట్లాడుతూ ఏఐ నేపథ్యంలో సైబర్ సెక్యూరిటీ గురించి వివరించారు. సవాళ్లను ఎదుర్కొనేలా సెట్స్ ఒక రోడ్డుమ్యాప్ ను తయారు చేయాలని ఆయన కోరారు.
వక్తల ప్రసంగాల అనంతరం సెట్స్ కు చెందిన క్వాంటమ్ భద్రతా పరిశోధన ప్రయోగశాలను ప్రొఫెసర్ సూద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సెట్స్ బృందం ఆయా సాంకేతికతలపై ఇచ్చిన ప్రదర్శనలను ఆయన ప్రశంసించారు.
(పిఎస్ ఏ క్వాంటమ్ సెక్యూరిటీ పరిశోధనా ప్రయోగశాలను ప్రారంభిస్తున్న ప్రొఫెసర్ సూద్)
వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సెట్స్ శాస్త్రవేత్తలు టెక్నాలజీ సమావేశాలను నిర్వహించారు. పలు సాంకేతిక అంశాలపై లోతైన విశ్లేషణలు చేశారు.
( సెట్స్ 23వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా గ్రూప్ ఫోటో)
ఈ కార్యక్రమంలో నేషనల్ ఇన్ఫార్మాటిక్స్ సెంటర్, స్టాండరడైజేషన్ టెస్టింగ్ అండ్ క్వాలిటీ సర్టిఫికేషన్ (ఎస్ టి క్యూసీ) డైరెక్టరేట్, డిఆర్ డీవో, టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్ మిలిటరీ కాలేజ్, హోమ్ శాఖ, టెలికమ్యూనికేస్ విభాగం, తమిళనాడు ఇ గవర్నెన్స్ ఏజెన్సీ, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా, కంట్రోలర్ ఆఫ్ సర్టిఫైయింగ్ అథారిటీస్, మ్యాథమెటిక్ సైన్సెస్ ఇనిస్టిట్యూట్, చెన్నై మ్యాథమాటికల్ ఇనిస్టిట్యూట్, ఐఐటి మద్రాస్, ఐఐఎస్సీ బెంగళూరు, సిడాక్ సంస్థలతోపాటు పరిశ్రమలు, స్టార్టప్ లకు చెందిన పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.
***
(Release ID: 2028937)
Visitor Counter : 84