మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ

న్యూఢిల్లీలోని ఎన్ఐపిపిసిసిడిలో జరిగిన 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి

Posted On: 21 JUN 2024 7:57PM by PIB Hyderabad

మహిళా, శిశు అభివృద్ధి శాఖ (ఎండబ్ల్యుసిడి) జూన్ 21వ తేదీన న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ కోఆపరేషన్ అండ్ చైల్డ్ డెవలప్ మెంట్ లో (ఎన్ఐపిసిసిడి) జరిగిన 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొంది.  కార్యక్రమంలో పాల్గొన్న వారి శారీరక, మానసిక సంక్షేమాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ కార్యక్రమంలో ఎంతో ఉత్సాహం, ఆసక్తి కనిపించింది.   

ఎండబ్ల్యుసిడి శాఖ సహాయమంత్రి శ్రీమతి సావిత్రి ఠాకూర్ ఈ కార్యక్రమానికి హాజరు కావడమే కాకుండా అందరితో కలిసి యోగా చేశారు. ఆమె ఈ కార్యక్రమంలో పాల్గొనడం సమతూకమైన, ఆరోగ్యవంతమైన జీవనశైలి ఆచరించడంలో యోగా ప్రాధాన్యతను చాటి చెప్పింది. ఎండబ్ల్యుసిడి కార్యదర్శి శ్రీ అనిల్ మాలిక్ తన శాఖ అధికారులు, సిబ్బందిలో కలిసి ఈ సెషన్ లో పాల్గొనడం ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనే విషయంలో ఉమ్మడి కట్టుబాటుకు నిదర్శనంగా నిలిచింది.

ఎన్ఐపిసిసిడి క్యాంపస్ లో నిర్వహించిన ఈ కార్యక్రమం ‘‘సొంతం కోసం, సమాజం కోసం యోగా’’ సందేశాన్ని వ్యాపింపచేసింది. వ్యక్తిగత సంక్షేమం ఏ విధంగా సామాజిక సంక్షేమానికి దోహదపడుతుంది అన్న అంశాన్ని ఈ థీమ్ చాటి చెప్పింది.

కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ యోగాను తమ నిత్య జీవితంలో భాగం చేసుకోవాలన్న స్ఫూర్తితో తిరిగి వెళ్లడం ద్వారా ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ప్రభావవంతమైన కార్యక్రమాల ద్వారా మహిళలు, బాలల సంక్షేమానికి మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉంది.

***



(Release ID: 2028150) Visitor Counter : 10


Read this release in: English , Urdu , Hindi , Tamil