వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పూసా క్యాంపస్ లో ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్


సంతోషకరమైన, ఆరోగ్యకరమైన, సంతృప్తికరమైన జీవితాన్ని గడపడానికి యోగా ఒక శాస్త్రం, ఒక కళ - శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్

Posted On: 21 JUN 2024 1:44PM by PIB Hyderabad

10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర వ్యవసాయరైతు సంక్షేమంగ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ న్యూఢిల్లీలోని పూసా క్యాంపస్ లోని భారతరత్న సి.సుబ్రమణ్యం ఆడిటోరియం (ఎన్ఏఎస్‌సీ కాంప్లెక్స్)లో ఏర్పాటు చేసిన ఉమ్మడి యోగా సాధన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సహాయ మంత్రులు శ్రీ రామ్‌నాథ్ ఠాకూర్శ్రీ భగీరథ్ చౌదరివ్యవసాయ పరిశోధనరైతు సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీ మనోజ్ అహుజాభారత వ్యవసాయ పరిశోధన మండలి డైరెక్టర్ జనరల్ డాక్టర్ హిమాన్షు పాఠక్మంత్రిత్వ శాఖకు చెందిన ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, "యోగా ఆనందకరమైనఆరోగ్యకరమైనసంతృప్తికరమైన జీవితాన్ని గడిపే  ఒక శాస్త్రంగానూఒక కళగానూ పేర్కొన్నారు. భారతీయ సంస్కృతిలో యోగాకు ఉన్న ప్రాముఖ్యతను ఉద్ఘాటించిన మంత్రిప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధికారం చేపట్టినప్పటి నుండి యోగాను ప్రపంచ వేదికపై ప్రోత్సహించారని కొనియాడారు. దీని ఫలితంగానే జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని తెలిపారు.

 

ప్రపంచవ్యాప్తంగా యోగాను క్రియాశీలకంగా ప్రోత్సహిస్తున్న భారతదేశానికి చెందిన సాధువులురుషుల కృషిని శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రస్తావించారు. శారీరక శ్రేయస్సుమానసిక ప్రశాంతతఆధ్యాత్మిక అనుసంధానాన్ని పెంపొందించడంలో యోగా పాత్రను పేర్కొన్నారు. యోగాను వ్యక్తిగతంగా వారి జీవనశైలిలో అనుసంధానించాలని మంత్రి ప్రజలను కోరారు. ఆరోగ్యకరమైన శరీరంసమర్థవంతమైన పనితీరుకు పునాది అని తెలిపిన మంత్రిసామాజిక చైతన్యంవ్యక్తిగత సంక్షేమానికి శారీరక ఆరోగ్యంమానసిక సమతుల్యతను ప్రాధమిక అవసరాలుగా కాపాడుకోవడం యొక్క ప్రాముఖ్యతను పునరుద్ఘాటించారు.

 

 

 

యోగా కేవలం జూన్ 21వ తేదీకే పరిమితం కాకుండా..దైనందిన జీవితంలో అంతర్భాగం కావాలని సమావేశంలో  మంత్రి అన్నారు. "యోగా పునాది నియమాలైన 'యమ్', 'నియామ్'- క్రమశిక్షణతో కూడిన జీవనంమితాహారాన్ని భుజించడాన్ని తెలుపుతుంది" అని ఆయన వివరించారు. పురాతన ఆయుర్వేద జ్ఞానాన్ని ప్రస్తావిస్తూశరీరానికి ప్రయోజనకరమైనరుతువులకు అనుగుణంగా సమతుల ఆహారాన్ని తీసుకోవాలని ఆయన సూచించారు.

 

 

***


(Release ID: 2027799) Visitor Counter : 73