నీతి ఆయోగ్

మూడు సంవత్సరాల్లో రూ.3.85లక్షల కోట్ల ఆస్తులను విక్రయించిన నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్

Posted On: 19 JUN 2024 6:52PM by PIB Hyderabad

2021-22 కేంద్ర బడ్జెట్లో చేసిన ప్రకటనకు అనుగుణంగా 2021-22 నుంచి 2024-25 మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు/ప్రభుత్వ రంగ సంస్థల ప్రధాన ఆస్తుల మానిటైజేషన్ కోసం ఉద్దేశించిన నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్(ఎన్ఎంపీ)ను సంబంధింత మౌలిక సదుపాయల మంత్రిత్వ శాఖల సహకారంతో నీతీ ఆయోగ్ తయారు చేసింది.

నాలుగేళ్ల కాలంలో రూ.6 లక్షల కోట్ల మానిటైజేషన్ సామర్థ్యం ఉన్న ఆస్తులను ఎన్ఎంపీ చేర్చింది. మొదటి రెండు సంవత్సరాలైన 2021-22, 2022-23లలో ఎన్ఎంపీ కింద మొత్తం లక్ష్యం రూ.2.5 లక్షల కోట్లు కాగా, రూ.2.30 లక్షల కోట్లు సాధించారు. నాలుగేళ్లలో 2023-24లో నిర్దేశించుకున్న రూ.1.8 లక్షల కోట్ల లక్ష్యమే అత్యధికం. 2021-22తో పోల్చితే 2023-24లో సాధించిన మానిటైజేషన్ 159 శాతం.

2023-24లో మంత్రిత్వ శాఖల పరంగా చూసినట్లయితే.. రోడ్లు, రవాణా మంత్రిత్వ శాఖ, బొగ్గు మంత్రిత్వ శాఖలు ఉమ్మడిగా రూ. 97వేల కోట్లతో మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి.

పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను సమర్థవంతంగా ప్రణాళిక చేసుకోవటానికి, మానిటైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయడానికి, ఎన్‌హెచ్‌ఏఐ ఇప్పటికే 2024-25లో మానిటైజ్ చేసేందుకు 33 ఆస్తులను గుర్తించి జాబితాను ప్రచురించింది. ఇంకా, బిడ్డింగ్ ప్రక్రియ విజయం సాధించే రేటును పెంచడానికి, ఐఈసీవీ లెక్కింపు కోసం పరిగణనలోకి తీసుకున్న స్థూల ఆర్థిక అంచనాలను ఎన్‌హెచ్ఏఐ తన వెబ్‌సైట్‌లో ఉంచింది.

ఎన్ఎంపీ కింద బొగ్గు మంత్రిత్వ శాఖ సాధించిన పురోగతి ఫలితంగా బొగ్గు తవ్వకాల్లో పెట్టుబడులు పెరుగుతాయి. తద్వారా బొగ్గు ఉత్పత్తిని పెంచి, థర్మల్ పవర్ ప్లాంట్లకు సరఫరా చేయడం ద్వారా దేశ ఇంధన భద్రత మెరుగుపడుతుంది.

2023-24లో వ్యక్తిగత గణంకాలను చూసినట్లయితే… రూ. 40,314 కోట్లతో రోడ్లు, రవాణా మంత్రిత్వ శాఖ, రూ. 56,794 కోట్లతో బొగ్గు మంత్రిత్వ శాఖ, రూ. 14,690 కోట్లతో విద్యుత్ మంత్రిత్వ శాఖ, రూ. 4,090 కోట్లతో గనుల శాఖ.. రూ. 9,587 కోట్లతో పెట్రోలియం, సహజ వాయువు..రూ .6,480 కోట్లతో పట్టణ మంత్రిత్వ శాఖ, రూ. 7,627 షిప్పింగ్ మంత్రిత్వ శాఖ 70% కంటే ఎక్కువ లక్ష్యాన్ని సాధించాయి.

***



(Release ID: 2027267) Visitor Counter : 40


Read this release in: English , Urdu , Hindi_MP , Hindi