కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

విద్యుత్ కేవైసి అప్‌డేట్‌ స్కాం పై చర్యలు చేపట్టిన డాట్


ఆర్థిక మోసాలకు, సైబర్ నేరానికి పాల్పడ్డ, దేశవ్యాప్తంగా ఐఎంఈఐ ఆధారిత 392 మొబైల్ హ్యాండ్ సెట్ లను బ్లాక్ చేయాల్సిందిగా డాట్ ఆదేశం

ఈ మొబైల్ సెట్లకు అనుసంధానం అయి ఉన్న 31,740 మొబైల్ కనెక్షన్ల రీ వెరిఫికేషన్

Posted On: 17 JUN 2024 8:15PM by PIB Hyderabad

విద్యుత్ కేవైసి అప్‌డేట్ స్కామ్‌లలో మొబైల్ నంబర్‌లతో కూడిన మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడుతున్న సంఘటనలకు  ప్రతిస్పందనగా టెలికమ్యూనికేషన్స్ విభాగం (డాట్) పౌరులను రక్షణ కల్పించే దిశగా చర్యలు ప్రారంభించింది.

 

 

వివరాలు ఇలా ఉన్నాయి... 

డాట్ కి చెందిన సంచార్ సాథీ పోర్టల్‌లోని 'చక్షు-రిపోర్ట్ సస్పెక్టెడ్ ఫ్రాడ్ కమ్యూనికేషన్స్' సౌకర్యం ద్వారా అనుమానిత మోసం కమ్యూనికేషన్‌లను నివేదించడంలో  అప్రమత్తమైన పౌరులు  చురుకుగా ఉన్నారు. ఇది సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలను ఎదుర్కోవడంలోను, నిరోధించడంలో డాట్ కి సహాయపడుతుంది.

విద్యుత్ కేవైసి అప్‌డేట్‌లు, హానికరమైన ఏపికే ఫైల్‌ల ద్వారా ఎస్ఎంఎస్, వాట్సాప్ సందేశాలను ఉపయోగించి బాధితుల పరికరాలపై నియంత్రణ సాధించిన మోసగాళ్లకు సంబంధించిన కొన్ని కేసులను పౌరులు నివేదించారు. 

మోసపూరిత కార్యకలాపాలను నివేదించడం, విశ్లేషించడం కోసం డాట్ చక్షు పోర్టల్‌ను ఉపయోగించుకుంది, ప్రారంభంలో ఐదు అనుమానిత సంఖ్యలను గుర్తించింది. పోర్టల్ ఏఐ విశ్లేషణ... 31,740 మొబైల్ నంబర్‌లకు అనుసంధానించబడిన 392 హ్యాండ్‌సెట్‌లు ఇటువంటి మోసపూరిత కార్యకలాపాలలో పాల్గొన్నట్లు వెల్లడించింది.

సైబర్ నేరాలకు, మోసాలకు పాల్పడుతున్న దేశవ్యాప్తంగా ఇలాంటి 392 మొబైల్ హ్యాండ్సెట్ లను ఐఎంఈఐ ఆధారంగా బ్లాక్ చేయాలనీ టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు (టిఎస్పి)ను డాట్ ఆదేశించింది. అలాగే ఈ మొబైల్ హ్యాండ్ సీట్లకు అనుసంధానం అయి ఉన్న 31,740 కనెక్షన్లను కూడా రీవెరిఫై చేయాల్సిందిగా సూచించింది. 

ఈ చొరవ టెలికమ్యూనికేషన్స్ నెట్‌వర్క్‌ల భద్రతను మెరుగుపరచడంలో, డిజిటల్ మోసాల నుండి పౌరులను రక్షించడంలో డాట్ నిబద్ధతను చాటుతుంది.

సంచార్ సాథీ పోర్టల్ లో చాక్షు సౌకర్యం గురించి:

డాట్ కి చెందిన సంచార్ సాథీ పోర్టల్ (www.Sancharsaathi.gov.in)లో ఇప్పటికే అందుబాటులో ఉన్న పౌర కేంద్రీకృత సౌకర్యాలకు చక్షు సరికొత్త జోడింపు. కేవైసి గడువు ముగియడం లేదా బ్యాంక్ ఖాతా/చెల్లింపు వాలెట్/సిమ్/గ్యాస్ కనెక్షన్/విద్యుత్ కనెక్షన్, సెక్స్‌టార్షన్, ప్రభుత్వ అధికారిగా నటించడం, అప్‌డేట్ వంటి మోసపూరిత ఉద్దేశ్యంతో కాల్, ఎస్ఎంఎస్ లేదా వాట్సాప్ ద్వారా స్వీకరించబడిన అనుమానిత మోసపూరిత కమ్యూనికేషన్‌ వంటి అంశాలలో పౌరులకు 'చక్షు' రక్షణగా  నిలుస్తుంది.  

***


(Release ID: 2026056) Visitor Counter : 116