శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
సిఎస్ ఐ ఆర్- ఏఎస్ పి ఐ ఆర్ ఇ పథకం కింద మూడు సంవత్సరాల పాటు పరిశోధనా గ్రాంటులను పొందనున్న 300 మంది మహిళా శాస్త్రవేత్తలు: కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా దేశంలో సులభతర జీవనాన్ని సాధించడంకోసం , దేశ పౌరులను సాధికారులను చేయడానికి శాస్త్ర సాంకేతిక రంగాల ఆవిష్కరణలు దోహదం చేయాలి: డాక్టర్ సింగ్
జీవ తయారీ, జీవ లోహ కర్మాగారాలనేవి భవిష్యత్తులో భారతదేశ జీవ ఆర్థికరంగాన్ని ముందుకు తీసుకుపోతాయి. అంతే కాదు హరిత అభివృద్ధికి దోహదం చేస్తాయి: కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
Posted On:
14 JUN 2024 6:13PM by PIB Hyderabad
సిఎస్ ఐ ఆర్- ఏఎస్ పి ఐ ఆర్ ఇ పథకం కింద మూడు సంవత్సరాల పాటు 300 మంది మహిళా శాస్త్రవేత్తలు పరిశోధనా గ్రాంటులను పొందనున్నారని కేంద్ర శాస్త్ర సాంకేతిక రంగాల సహాయ మంత్రి (స్వతంత్ర) డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.
ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా దేశంలో సులభతర జీవనాన్ని సాధించడంకోసం దేశ పౌరులను సాధికారులను చేయడానికి శాస్త్ర సాంకేతిక రంగాల ఆవిష్కరణలు దోహదం చేయాలి అని ఆయన స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధన విభాగం ( డిఎస్ ఐఆర్) సమీక్ష సమావేశానికి ఆయన అధ్యక్షతవహించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. డిఎస్ ఐఆర్, సిఎస్ ఐఆర్ విభాగాల పనిని సమీక్షించిన ఆయన సిఎస్ ఐ ఆర్- ఏ ఎస్ పి ఐ ఆర్ ఇ పథకాన్ని ప్రశంసించారు. అది ప్రభుత్వ కృషికి సాక్షీభూతంగా నిలుస్తోందని అన్నారు. గత ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా శాస్త్రవేత్తలకు పరిశోధనా గ్రాంటులను అందించే నిమిత్తం అస్పైర్ కార్యక్రమాన్ని ప్రకటించారు. ఈ పథకం కింద గ్రాంట్లను కోరుకుంటూ 3వేలవరకూ దరఖాస్తులు వచ్చాయి. వాటినన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత వాటిలోనుంచి 301 పరిశోధనా ప్రతిపాదనలను ఎంపిక చేయడం జరిగింది.
...
కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఆధ్వర్యంలో శాస్త్ర, పారిశ్రామిక పరిశోధన విభాగం ( డిఎస్ ఐఆర్) సమీక్షా సమావేశం
వన్ వీక్ వన్ ల్యాబ్ (ఒక వారం- ఒక ప్రయోగశాల) కార్యక్రమ విజయంపట్ల డాక్టర్ సింగ్ సంతృప్తి వ్యక్తం చేశారు. దాన్ని మరింత బలోపేతం చేయాలని అదే పద్ధతిలో వన్ వీక్- వన్ థీమ్ కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు. దేశవ్యాప్తంగా పని చేస్తున్న 37 సిఎస్ ఐ ఆర్ ప్రయోగశాలల వైవిధ్యాన్ని వాటి పరిశోధనలను, సాంకేతిక విజయాలను వన్ వీక్-వన్ ల్యాబ్ కార్యక్రమం ఎత్తి చూపిందని అన్నారు. వివిధ పరిశ్రమలతోను, ఎంఎస్ ఎం ఇలతోనూ, స్టార్టప్ లతోనూ, ఇతర భాగస్వాములతోనూ బలమైన బంధాలను నిర్మించుకోవడమే మన లక్ష్యం కావాలని దిశానిర్దేశం చేశారు. అంతేగానీ ప్రయోగశాలల నాలుగుగోడలకు పరిమితం కాకూడదని అన్నారు.
సముద్రనాచు కార్యక్రమాన్ని మరింతగా విస్తరింప చేసి వాణిజ్యపరంగా దాని సాగును బలోపేతం చేయాలని అధికారులకు సూచించారు. భారతదేశంలో ప్రతి రోజూ 774 టన్నుల బయోమెడికల్ వ్యర్థాలు తయారవుతున్నాయని వాటిని నేల సారం పెంచేవాటికి మార్చడంవెనక సిఎస్ ఐఆర్ చేసిన కృషిని ప్రస్తావిస్తూ కేంద్ర మంత్రి ప్రశంసించారు. వివిధ ప్రాజెక్టుల విషయంలో సిఎస్ ఐఆర్ శాస్త్రవేత్తలు ఏం చేయాలనేదానిపైన దిశానిర్దేశం చేశారు. రోగ పరీక్షల్లోనూ, ముందే చేసే రోగనిర్ధారణ సాంకేతికతల్లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ మోడల్స్ ను వాడాలని సూచించారు. తద్వారా చికిత్సల విషయంలో ఖచ్చితత్వం వస్తుందని అన్నారు. భారతదేశ మహిళలకు వచ్చే కొన్ని రకాల రోగాలు,వాటి నివారణపైన ఏం చేయాలనేది తెలుసుకోవడానికి ఆవిష్కరణలు దోహదం చేయాలన్నారు.
జీవ తయారీ, జీవ లోహ కర్మాగారాలనేవి భవిష్యత్తులో భారతదేశ జీవ ఆర్థికరంగాన్ని ముందుకు తీసుకుపోతాయి. అంతే కాదు హరిత అభివృద్ధికి దోహదం చేస్తాయని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. జీవి సాంకేతిక శాఖ విభాగ సమావేశానికి అధ్యక్షతవహించిన ఆయన జీవ ఆర్థికరంగం దేశంలో ఎంతమేరకు బలోపేతమైంది వివరించారు. గత పది సంవత్సరాల్లో దేశంలో జీవ ఆర్థికరంగం 13 రెట్లు పెరిగిందని 2014లో పది బిలియన్ డాలర్లున్న ఈ ఆర్థికరంగం 2024నాటికి 130 బిలియన్ డాలర్లకు చేరుకుందని స్పష్టం చేశారు. ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రస్తుతం దేశంలో సమర్థవంతమైన పారిశ్రామిక అభివృద్ధి, ఔత్సాహికపారిశ్రామిక వాతావరణం వుందని అన్నారు. అంతర్జాతీయస్థాయిలో దేశం ముందడుగు వేయడంకోసం మొన్నటి తాత్కాలిక బడ్జెట్లో జీవతయారీ, జీవ లోహ కర్మాగారాలను ప్రోత్సహించడంకోసం ఉత్తమమైన పథకాన్ని రూపొందించడం జరిగిందని అన్నారు..
....
కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ (మధ్యలో), డాక్టర్ రాజేష్ గోఖలే, కార్యదర్శి, డిబిటి (ఎడమవైపున)
.....
ఈ పథకం కారణంగా ప్రస్తుతం అమల్లో వున్న నష్టదాయక తయారీ విధానమనేది లాభదాయక సూత్రాల మీద ఆధారపడిన విధానంగా మారుతుంది. ఈ పథకం అనేది పర్యావరణ హిత ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది. అంటే బయోడీగ్రేడబుల్ పాలిమరస్, బయోప్లాస్టిక్స్, బయో ఫార్మాస్యూటికల్స్, బయో అగ్రి ఇన్ పుట్స్ లాంటి ప్రత్యామ్నాయాలు లభిస్తాయి. అవి బయో స్టార్టప్స్ ప్రారంభానికి, జీవార్థిక రంగ ప్రగతికి దోహదం చేస్తాయని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు.
ప్రస్తుతం నెలకొనివునన ఇదే వూపును కొనసాగించాలని రైతులను, వ్యవసాయ ఔత్సాహిక వ్యాపారవేత్తలను ప్రోత్సహించాలని శాస్త్రవేత్తలకు, అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు.
బయో ఇ3 అనే మంత్రాన్ని అనుసరించాలని డాక్టర్ జితేంద్ర సింగ్ అధికారులను, శాస్త్రవేత్తలను కోరారు. బయో ఇ3 అంటే బయో ఎకానమీ, బయో ఎన్విరాన్ మెంట్, బయో ఎంప్లాయ్ మెంట్. దేశీయ సాంకేతికతలను అభివృద్ధి చేసుకోవాలని, దేశీయ ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన దిశానిర్దేశం చేశారు. పరిశోధనా కేంద్రాలు, పారిశ్రామిక ఆర్ అండ్ డికి, స్టార్టప్ ల ఎకోసిస్టమ్ కు మధ్యన సఖ్యత వుండేలా జీవసాంకేతిక విభాగం కృషి చేయాలని కోరారు.
జీవ సాంకేతికత విభాగం కార్యదర్శి డాక్టర్ రాజేష్ గోఖలే, సిఎస్ ఐ ఆర్ డీజీ డాక్టర్ ఎన్ కళైసెల్వి, ఇతర ముఖ్య అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
***
(Release ID: 2025795)
Visitor Counter : 105