జౌళి మంత్రిత్వ శాఖ

ఇన్నోవేషన్ ను ప్రోత్సహించడం లక్ష్యంగా టెక్నికల్ టెక్స్ టైల్స్ విభాగంలో స్టార్టప్ లకు టెక్స్ టైల్స్ మంత్రిత్వ శాఖ అనుమతి


అధిక సామర్థ్యం గల టెక్స్ టైల్ సొల్యూషన్స్ ను ప్రోత్సహించేందుకు ఎన్ టిటిఎం కింద వ్యూహాత్మక నిధి
ఎన్ టిటిఎం మద్దతుతో సివిల్ ఇంజనీరింగ్ పాఠ్యాంశాల్లో జియో టెక్స్ టైల్స్ ను ప్రవేశపెడుతున్న ఐఐటి గౌహతి

Posted On: 13 JUN 2024 4:58PM by PIB Hyderabad

టెక్స్ టైల్స్ విభాగంలో ఇన్నోవేషన్ ను పరిశ్రమ భవిష్యత్తును తీర్చి దిద్దగల పరివర్తిత చర్యలను ప్రోత్సహించడం లక్ష్యంగా టెక్స్ టైల్స్ మంత్రిత్వ శాఖ టెక్నికల్ టెక్స్ టైల్స్ విభాగంలో స్టార్టప్ లకు అనుమతి మంజూరు చేసింది. నేషనల్ టెక్నికల్  టెక్స్ టైల్స్ మిషన్ (ఎన్ టిటిఎం) అనుబంధ సాధికారిక కార్యక్రమాల కమిటీ (ఇపిసి) 7వ సమావేశానికి అధ్యక్షత వహిస్తూ టెక్స్ టైల్స్  మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీమతి రచనా షా ఈ విషయం వెల్లడించారు.   

ఎన్ టిటిఎం నిర్వహణలోని టెక్నికల్ టెక్స్ టైల్స్  విభాగంలో ఆకాంక్షాపూరిత ఇన్నోవేటర్లను ప్రోత్సహించేందుకు ఏర్పాటైన పరిశోధన, ఎంటర్ ప్రెన్యూర్ షిప్ గ్రాంట్  (గ్రాంట్ ఫర్ రిసెర్చ్ అండ్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ ఎక్రాస్ యాస్పైరింగ్ ఇన్నోవేటర్స్ ఇన్ టెక్నికల్ టెక్స్ టైల్స్-గ్రేట్) ఈ రంగంలోని యువ ఇన్నోవేటర్లు, సైంటిస్ట్ లు/ టెక్నాలజిస్టులు, స్టార్టప్ వెంచర్లు  టెక్నికల్ టెక్స్ టైల్స్ విభాగంలో తమ ఆలోచనలు వాణిజ్యపరమైన టెక్నాలజీలు, ఉత్పత్తులుగా అభివృద్ధి చేయడానికి, ఆ రంగంలో దేశం  స్వయం-సమృద్ధం కావడానికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. టెక్నికల్ టెక్స్ టైల్స్ విభాగంలోని వ్యక్తిగత ఎంటర్ ప్రెన్యూర్లు, స్టార్టప్ లు ఫంక్షనల్ ప్రోటోటైప్ లు లేదా వాణిజ్యపరమైన ఉత్పత్తులు తయారుచేయడానికి గ్రేట్ మద్దతు అందిస్తుందని ఆమె చెప్పారు.

గ్రేట్ పథకం కింద 7 స్టార్టప్ ప్రతిపాదనలను ఎంపవర్డ్ ప్రోగ్రామ్ కమిటీ (ఇపిసి) ఆమోదించింది. ఒక్కో స్టార్టప్ కు భారత ప్రభుత్వం రూ.50 లక్షల మేరకు గరిష్ఠంగా నిధిని అందిస్తుంది. నేటి వరకు ఎన్ టిటిఎం కింద సుస్థిరత, కాంపోజిట్లు, అధిక సామర్థ్యం గల టెక్స్ టైల్స్, మెడిటెక్, స్మార్ట్ టెక్స్ టైల్స్ విభాగాల్లో 8 స్టార్టప్ ప్రతిపాదనలను ఆమోదించారు. ఇవి కీలక రంగాల్లో పురోగతిని ప్రోత్సహిస్తాయి.

ఇపిసి ఆమోదించిన కొన్ని స్టార్టప్ లు మిలిటరీ అప్లికేషన్ల కోసం బ్రెయిడెడ్ కాంపోజిట్లు, రాడ్ మోన్ ఇంటిగ్రేటెడ్ ఐఎఫ్ఎఫ్ యాంటెనా, వైద్యుల శిక్షణ కోసం సర్జికల్ స్టిమ్యులేషన్ నమూనాలు; ఇంధన ఉత్పత్తి, సెన్సింగ్ లో నాన్ ఫైబర్ టెక్స్ టైల్స్ ‘‘అభివృద్ధి, తయారీ’’కి కృషి చేస్తాయి.  

టెక్నికల్  టెక్స్ టైల్స్ విభాగంలో వార్తా పత్రికలు/పాఠ్యాంశాలు ప్రవేశపెట్టడానికి, సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో లేబరేటరీ మౌలిక వసతులు అప్ గ్రేడ్ చేయడానికి ఐఐటి గౌహతికి రూ.6.4 కోట్ల గ్రాంట్ ను ఇపిసి ఆమోదించింది. ప్రయివేటు, ప్రభుత్వ సంస్థలు టెక్నికల్ టెక్స్ టైల్స్ లో విద్యాసంస్థలను సాధికారం చేయడానికి ఎన్ టిటిఎం సార్వత్రిక మార్గదర్శకాల కింద ఈ గ్రాంట్ అందచేశారు.

ఈశాన్య ప్రాంతంలోని ప్రధాన విద్యా సంస్థ అయిన ఐఐటి, గౌహతి ప్రాంతీయ భౌగోళిక, పర్యావరణ పరిస్థితులకు అనుగుణంగా టెక్నికల్ టెక్స్ టైల్స్ విభాగంలో ప్రత్యేకించి జియో టెక్స్ టైల్స్ విభాగంలో సామర్థ్యాలను, లేబరేటరీ మౌలిక వసతులను విస్తరించగల సామర్థ్యాలు కలిగి ఉంది. ఈశాన్య ప్రాంతంలో టెక్నికల్ కన్సల్టెన్సీ సేవలందించి అవసరమైన మద్దతు ఇచ్చేందుకు ఈ గ్రాంట్ సహాయకారిగా ఉంటుంది.  

***



(Release ID: 2025272) Visitor Counter : 32


Read this release in: English , Urdu , Hindi , Hindi_MP