రక్షణ మంత్రిత్వ శాఖ
జపాన్ లోని యొకోసుకాలో జపాన్-భారత నౌకాదళ విన్యాసాలు-24 (జైమెక్స్-24) ప్రారంభం
Posted On:
11 JUN 2024 5:49PM by PIB Hyderabad
భారత నౌకాదళానికి చెందిన గస్తీ యుద్ధనౌక ఐఎన్ఎస్ శివాలిక్ జపాన్-భారత ద్వైపాక్షిక నౌకాదళ విన్యాసాలు-2024లో (జైమెక్స్-24) పాల్గొనేందుకు జపాన్ లోని యొకోసుకా చేరింది. 2012 సంవత్సరంలో ప్రారంభమైన జైమెక్స్ ఎనిమిదో విన్యాసాలు ఇవి.
యొకోసుకా జిల్లా జెఎంఎస్ డిఎఫ్ కమాండర్, ఐటిఓ విఏడిఎం హిరోషి; జపాన్ లో భారత రాయబారి సిబి జార్జి నౌకకు ఘన స్వాగతం పలికారు.
హార్బర్ లోను, సముద్రంలోను కూడా ఈ విన్యాసాలు జరుగుతాయి. హార్బర్ విన్యాసాల్లో వృత్తిపరమైన, క్రీడా, సామాజిక విన్యాసాలుంటాయి. అనంతరం రెండు నౌకాదళాలు భూ ఉపరితలం మీద, పాక్షిక ఉపరితలం మీద, గగనతలంలోను చేసే సంక్లిష్టమైన విన్యాసాలను; సముద్రంపై యుద్ధ విన్యాస నైపుణ్యాలను ప్రదర్శిస్తాయి.
ఐఎన్ఎస్ శివాలిక్ ఐఎన్ గాను, గైడెడ్ మిసైల్ డిస్ర్టాయర్ జెఎస్ యుగిరి జెఎంఎస్ డిఎఫ్ గాను ప్రాతినిథ్యం వహిస్తాయి. రెండు నౌకాదళాలకు చెందిన హెలీకాప్టర్లు కూడా ఉమ్మడి విన్యాసాల్లో పాల్గొంటాయి.
కొన్ని సంవత్సరాలుగా పరిధిని, సంక్లిష్టతను విస్తరించుకున్న జైమెక్స్-24 ఉభయ దేశాలకు చెందిన నౌకాదళాలు ఐఎన్, జెఎంఎస్ డిఎఫ్ ఉత్తమ విధానాలను, నిర్వహణాపరమైన విధానాలను పరస్పరం నేర్చుకుంటాయి. పరస్పర సహకారం పెంపొందించుకుంటాయి. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సాగర జలాల భద్రతకు భాగస్వామ్య కట్టుబాటును ప్రకటిస్తాయి.
(Release ID: 2024651)