రక్షణ మంత్రిత్వ శాఖ
బ్రునేయీ నుండిబయలుదేరిన భారతీయ నౌకా దళాని కి చెందిన ‘క్లింటన్’ నౌక
భారతీయ నౌకా దళం (ఐఎన్) మరియు రాయల్ బ్రునేయీ నేవీ (ఆర్‌బిఎన్) ల మధ్య సముద్రసంబంధి భాగస్వామ్యం ప్రధానమైన విన్యాసం లో పాలుపంచుకొన్న ‘క్లింటన్’
Posted On:
29 MAY 2024 6:05PM by PIB Hyderabad
భారతీయ నౌకా దళాని కి చెందిన నౌక అయిన ‘క్లింటన్’ సౌథ్ చైనా సీ లో భారతీయ నౌకా దళ ఈస్టర్న్ ఫ్లీట్యొక్క నిర్వహణ పరమైన మోహరింపు లో భాగం గా బ్రునేయీ లోని మువారా ను సందర్శించింది. ఈ యాత్ర ఉభయదేశాల మధ్య ఇప్పటికే ఉన్న సముద్ర పరమైన సంబంధాల ను మరింత గా విస్తరించడం కోసం భారతదేశంనిబద్ధత ను చాటిచెప్పింది. పోర్ట్ కాల్ లో భాగం గా వృత్తినిపుణుల మధ్య సంభాషణలు, క్రాస్ డెక్ యాత్ర లు మరియు సాంస్కృతిక ఆదాన ప్రదానం తాలూకు కార్యక్రమాల ను చేపట్టడమైంది. ఈ నౌక లోకి సందర్శకుల ను అనుమతించడమైంది. దీనిలో భాగం గా, భారతీయ ప్రవాసీ సభ్యులు మరియు రాయల్ బ్రునేయీ నౌకా దళం యొక్కసిబ్బంది ఈ నౌక ను సందర్శించారు. వారికి నౌకనుగురించి, దేశాని కి గల స్వదేశీ నౌక నిర్మాణ సామర్థ్యాల ను గురించి, సంపన్నమైనటువంటి సముద్ర వారసత్వాన్ని గురించి వివరించడం జరిగింది. జట్టు స్ఫూర్తి ని పెంపొందింప చేయాలనే ఉద్దేశ్యం తోభారతీయ నౌకాదళం మరియు రాయల్ బ్రునేయీ నౌకా దళం ల సిబ్బంది మధ్య వాలీబాల్ మ్యాచ్ నుకూడా నిర్వహించడమైంది. ఈ నౌక భారతీయ నౌకాదళానికి మరియురాయల్ బ్రునేయీ నేవీ కి మధ్య సముద్ర భాగస్వామ్యం ప్రధానమైనటువంటి అభ్యాసాల లోనూపాలుపంచుకొంది. ఇది పరస్పర భాగస్వామ్యాన్ని మరింత గా బలపరచుకోవడం కోసం ఒక పక్షంయొక్క వ్యూహాలను, మెలకువలను మరియుప్రక్రియల ను గురించి అవగాహన చేసుకోవడం లో సహాయం అందింది. ఈ పోర్ట్ కాల్ ఫలప్రదం గా ముగియడం అనేది ‘యాక్ట్ ఈస్ట్’ పాలిసీ మరియు సాగర్ (SAGAR) విధానాల కు అనుగుణం గా ఆ ప్రాంతం లో శాంతి ని మరియు స్థిరత్వాన్ని పరిరక్షించడం కోసం భారతదేశం యొక్క నిబద్ధత ను సూచిస్తున్నది.
***
(Release ID: 2022234)
Visitor Counter : 132