మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
‘సమర్ ఫియస్టా 2024’ ను న్యూ ఢిల్లీ లోని జాతీయ బాల్ భవన్ లో ప్రారంభించిన శ్రీ సంజయ్ కుమార్
Posted On:
29 MAY 2024 3:02PM by PIB Hyderabad
నెల రోజుల పాటు కొనసాగే ‘‘సమర్ ఫియస్టా 2024’’ ను విద్య మంత్రిత్వ శాఖ లోని పాఠశాల విద్య, ఇంకా అక్షరాస్యత ల విభాగం కార్యదర్శి శ్రీ సంజయ్ కుమార్ న్యూ ఢిల్లీ లోని జాతీయ బాల భవన్ లో ఈ రోజు న ప్రారంభించారు. అయిదేళ్ళ మొదలుకొని పదహారేళ్ళ వయస్సు కలిగిన బాలల కోసం 30 విధాలైన విభిన్న కార్యకలాపాలు ఈ సమర్ ఫియస్టా ఉత్సవం లో భాగం గా ఉంటాయి. ఈ సందర్భం లో విద్య మంత్రిత్వ శాఖ లోని పాఠశాల విద్య, ఇంకా అక్షరాస్యత ల విభాగం (ఎస్ఎస్-2) అడిశనల్ సెక్రట్రి మరియు జాతీయ బాల్ భవన్ యొక్క చెయర్ మన్ శ్రీ విపిన్ కుమార్ సహా మంత్రిత్వ శాఖ లో ఇతర సీనియర్ అధికారులు హాజరయ్యారు.
ఉత్సాహవంతులైన బాలల తో మరియు వారి తల్లితండ్రుల తో కూడిన సభ ను ఉద్దేశించి శ్రీ సంజయ్ కుమార్ ప్రసంగిస్తూ, యువ మస్తిష్కాల ను తీర్చిదిద్దడం లో ఈ తరహా సంభాషణాత్మకమైనటువంటి మరియు సరిక్రొత్తవైనటువంటి కార్యక్రమాల కు ఉన్నటువంటి ప్రాముఖ్యాన్ని గురించి నొక్కి చెప్పారు. బాలల భవిష్యత్తు సఫలం కావడం కోసం చదువు తో పాటు గా ఇటువంటి పాఠ్యేతర కార్యకలాపాలు కూడా అంతే ముఖ్యమైనవి అని ఆయన అన్నారు. చిన్నారులు వారి చుట్టు ప్రక్కల విషయాల ను తెలుసుకోవడం కోసం కుతూహలాన్ని కలిగి ఉండాలి; అప్పుడు, వారి బుద్ధి వికసించడం లో సహాయం లభిస్తుంది అని ఆయన అన్నారు.
‘సమర్ ఫియస్టా 2024’ ను 2024 వ సంవత్సరం మే 29 వ తేదీ మొదలుకొని జూన్ 28 వ తేదీ వరకు ఉంటుంది. పెద్ద సంఖ్య లో సృజనాత్మకమైన మరియు ప్రదర్శ ప్రధానమైన కళలు, విజ్ఞాన శాస్త్రం తో పాటు మరిన్ని వినూత్నమైన మరియు భాగస్వామ్యం ప్రధానమైన కార్యకలాపాలు అనేకం ఇక్కడ అందుబాటు లో ఉంటాయి. వీటి ఉద్దేశ్యం ఏమిటి అంటే అది ప్రతి ఒక్క బాలుడు, లేదా బాలిక ఏదైనా ఆసక్తికరమైనటువంటి విషయాన్ని కనుగొనడం మరియు నేర్చుకోవడం కోసం వారిలో తపన ను రేకెత్తించడానికి పూచీ పడాలి అనేదే. సమర్ ఫియస్టా కాలం లో ఒడిసి నృత్యం, యోగ, చక్కని చేతివ్రాత, సంగీతం, ఆటలు వంటి వాటిని గురించిన సమావేశాలు సహా ప్రత్యేకమైన వర్క్ శాపు లు మరియు కార్యక్రమాల ను ప్రతి వారం నిర్వహించనున్నారు. పిల్లల కు వారి లోని ప్రతిభ ను మరియు ప్రావిణ్యాన్ని వికసింపచేసుకోవడానికి మరియు వాటిని ప్రదర్శించడానికి అవకాశాల ను ఇచ్చేందుకు గాను ఈ వర్క్ శాపు లు ఏర్పాటు అయ్యాయి.
ప్రఖ్యాత కళాకారులు మరియు అతిథులు కూడ ఈ కార్యక్రమం లో పాలుపంచుకోనున్నారు, వారు ఈ ప్రత్యేక ఉత్సవం లో వారి యొక్క అనుభవాల ను గురించి వెల్లడించనున్నారు. బాలల్లో ప్రేరణ ను కలిగించే విధం గా ఆకర్షణీయమైనటువంటి ప్రదర్శనల ను వారు సమర్పించనున్నారు. ఈ కార్యక్రమాని కి లభించిన స్పందన అంతా ఇంతా కాదు. 2,500 మంది కి పైగా బాలలు ఇప్పటికే విభిన్న వర్క్ శాపులు మరియు కార్యక్రమాల కోసం వారి వారి పేరుల ను నమోదు చేసుకొన్నారు. ఈ ఉత్సవాని కి తరలివచ్చే వారు సులభం గా ఉత్సవ స్థలి కి చేరుకోవడం కోసం జాతీయ బాల భవన్ తరఫున యావత్తు దిల్లీ లో రవాణా సదుపాయాల ను అందుబాటు లోకి తీసుకు రావడమైంది.
విద్య మంత్రిత్వ శాఖ యొక్క పాఠశాల విద్య మరియు అక్షరాస్యత ల విభాగం ఆధ్వర్యం లో పని చేస్తున్న స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ యే జాతీయ బాల భవన్. జాతీయ బాల భవన్ 1956 వ సంవత్సరం లో ఏర్పాటయింది. ఈ సంస్థ ను బాలల్లో ఆలోచించడం, కల్పన, సృజనాత్మకత మరియు మనోరంజక కార్యకలాపాల మాధ్యం ద్వారా శిక్షణ ను పెంపొందింపచేయాలన్న ఉద్దేశ్యం తో స్థాపించడమైంది.
***
(Release ID: 2022104)
Visitor Counter : 164