ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

i)  ‘న్యూ జిఎస్ 2029’, (ii) ‘న్యూ జిఒఐ ఎస్‌జిఆర్‌బి 2034’ మరియు (iii)  ‘7.34 శాతం జిఎస్ 2064’ ల విక్రయానికై (ఇశ్యూ/రీ ఇశ్యూ) వేలము ప్రకటన

Posted On: 27 MAY 2024 8:35PM by PIB Hyderabad

భారత ప్రభుత్వం (జిఒఐ) (i) 12,000 కోట్ల రూపాయల (నామమాత్రపు) సూచిత రాశి కోసం బహుళ ధర ల పద్ధతి ని ఉపయోగించుకొంటూ ప్రతిఫలం ఆధారిత వేలం మాధ్యం ద్వారా ‘‘న్యూ గవర్నమెంట్ సెక్యూరిటీ 2029’’, (ii) 6,000 కోట్ల రూపాయల (నామమాత్రపు) సూచిత రాశి కోసం బహుళ ధర ల పద్ధతి ని ఉపయోగించుకొంటూ ప్రతిఫలం ఆధారిత వేలం మాధ్యం ద్వారా ‘‘న్యూ జిఒఐ ఎస్‌జిఆర్ బి 2034’’ తో పాటు, (iii) 11,000 కోట్ల రూపాయల (నామమాత్రపు) సూచిత రాశి కోసం బహుళ ధర ల పద్ధతి ని ఉపయోగించుకొంటూ ధర ఆధారిత వేలం మాధ్యం ద్వారా ‘‘7.34 శాతం గవర్నమెంటు సెక్యూరిటీ 2064’’ ల విక్రయం (ఇశ్యూ/రీ-ఇశ్యూ) ప్రక్రియ ను ప్రకటించింది. భారత ప్రభుత్వాని కి పైన ప్రస్తావించిన ప్రతి ఒక్క సెక్యూరిటీ (హామీపత్రం) విషయం లో 2,000 కోట్ల రూపాయల వరకు అదనపు సబ్‌స్క్రిప్శను ను అట్టిపెట్టుకొనే ఐచ్చికం ఉంటుంది. ఈ వేలం పాటల ను 2024 మే 31 వ తేదీ న (శుక్రవారం) భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బిఐ) ముంబయి లోని ఫోర్ట్ ప్రాంతం లో గల ఆర్‌బిఐ ముంబయి కార్యాలయం లో నిర్వహించడం జరుగుతుంది.

 

సెక్యూరిటీ ల విక్రయానికి సంబంధి సూచించిన రాశి లో 5 శాతం వరకు రాశి ని ప్రభుత్వ సెక్యూరిటీ ల యొక్క వేలంపాట లో పోటీ రహిత వేలం సదుపాయం కోసం నిర్దేశించిన స్కీము కు అనుగుణం గా అర్హులైన వ్యక్తుల కు మరియు సంస్థల కు కేటాయించడం జరుగుతుంది.

 

 

వేలం కోసం పోటీ ప్రధానమైన బిడ్ లను మరియు పోటీ ఉండనటువంటి తరహా బిడ్ లను రెండిటిని 2024 మే 31 వ తేదీ నాడు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కోర్ బేంకింగ్ సాల్యూశన్ (ఇ-కుబేర్) వ్యవస్థ లో ఎలక్ట్రానిక్ పార్మేట్ మాధ్యం ద్వారా దాఖలు చేయవలసి ఉంటుంది. పోటీ రహిత బిడ్ లను ఉదయం పూట 10:30 గంటల నుండి 11:00 గంటల మధ్య కాలం లో, అలాగే పోటీ ఉండేటటువంటి బిడ్ లను ఉదయం పూట 10:30 గంటలు మొదలుకొని 11:30 గంటల మధ్య సమర్పించవలసి ఉంటుంది.

 

వేలంపాట ల ఫలితాన్ని 2024 మే 31 వ తేదీ న (శుక్రవారం) ప్రకటించడం జరుగుతుంది; విజేతలు గా నిలచిన బిడ్డరు లు చెల్లింపుల ను 2024 జూన్ 3 వ తేదీ న (సోమవారం) జరపవలసి ఉంటుంది.

 

 

ఈ సెక్యూరిటీ లు భారతీయ రిజర్వు బ్యాంకు ద్వారా 2018 జులై 24 వ తేదీ న జారీ చేసిన మరియు ఎప్పటికప్పుడు సవరణల ను చేస్తూ వస్తున్న సర్క్యులర్ సంఖ్య ఆర్‌బిఐ/2018-19/25 లో పేర్కొన్నవెన్ ఇశ్యూడ్ ట్రాన్‌సాక్శన్స్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ సెక్యూరిటీస్సంబంధి మార్గదర్శక సూత్రాల ప్రకారం ‘‘వెన్ ఇశ్యూడ్ట్రేడింగు కు అర్హం అవుతాయి.

 

 

***


(Release ID: 2021966) Visitor Counter : 113