విద్యుత్తు మంత్రిత్వ శాఖ

2023-24 కు గానుఆర్థిక ఫలితాల ను ప్రకటించిన పవర్ ఫైనాన్స్ కార్పొరేశన్; అత్యధిక వార్షికలాభాన్ని నమోదు చేసింది

Posted On: 15 MAY 2024 5:23PM by PIB Hyderabad

పవర్ ఫైనాన్స్ కార్పొరేశన్ ఆర్థిక సంవత్సరం 2023-24 కు గాను తన ఆర్థిక ఫలితాల ను ఈ రోజు న , 2024 మే 15 వ తేదీ నాడు ముంబయి లో నిర్వహించిన ఒక కార్యక్రమం లో ప్రకటించింది.

 

ముఖ్యాంశాలు ఈ క్రింది విధం గా ఉన్నాయి.

ఏకీకృత ఆర్థిక ముఖ్యాంశాలు

 

· పిఎఫ్‌సి గ్రూపు 25 శాతం వృద్ధి తో పన్నుచెల్లింపు అనంతర వార్షిక లాభాన్ని (పిఎటి) అత్యధికం గా నమోదు చేసింది. పిఎటి ఆర్థిక సంవత్సరం 2024 లో 26,461 కోట్లు గా ఉంది. ఆర్థిక సంవత్సరం 2023 లో 21,179 కోట్ల రూపాయలు గా ఉంది.

  • ఆర్థిక సంవత్సరం 2024 లో 10 లక్షల కోట్ల రూపాయల కు పైగా మొత్తం బేలన్స్ శీట్ (ఆస్తి అప్పుల పట్టీ) తో పిఎఫ్‌సి గ్రూపు భారతదేశం లో అతి పెద్ద బేంకింగేతర ఆర్థిక సహాయ వ్యాపార సంస్థ (ఎన్‌బిఎఫ్‌సి) గ్రూపు గా కొనసాగుతున్నది. ప్రస్తుత ఆస్తి అప్పుల పట్టీ 10.39 లక్షల కోట్ల రూపాయలు గా ఉంది.
  • రుణ రూపేణా ఏకీకృత ఆస్తులు 31.03.2023 నాటి 8,57,500 కోట్ల రూపాయల నుండి 31.03.2024 నాటికి 9,90,824 కోట్ల రూపాయల కు వృద్ధి చెంది, 16 శాతం పెరుగుదల ను నమోదు చేశాయి.
  • ఏకీకృత నికర విలువ 31.03.2023 నాడు 1,11,981 కోట్ల రూపాయల నుండి 31.03.2024 నాటికి 1,34,289 కోట్ల రూపాయల కు పెరిగింది. దీనిలో వృద్ధి 20 శాతం గా ఉంది.
  • ఏకీకృత స్థూల నిరర్థక ఆస్తులు (జిఎన్ పిఎ) ఆర్థిక సంవత్సరం 2023 లో 3.66 శాతం గా ఉండగా, ఆర్థిక సంవత్సరం 2024 లో 3.02 శాతం గా ఉన్నాయి.

· రుణ పరిష్కార ప్రయాసల ను చురుకు గా చేపట్టిన కారణం గా, ఏకీకృత నికర నిరర్థక ఆస్తులు (ఎన్ఎన్ పిఎ) ఆర్థిక సంవత్సరం 2023 లో 1.03 శాతం గా ఉన్నవి కాస్తా ఆర్థిక సంవత్సరం 2024 లో 0.85 శాతాని కి పరిమితమై, వాటి అతి తక్కువ స్థాయి కి చేరుకొన్నాయి.

స్టాండ్ అలోన్ ఫినాన్శల్ హైలెట్స్

· పిఎఫ్‌సి ప్రస్తుతం భారతదేశం లో అత్యధిక లాభాన్ని ఆర్జిస్తున్న ఎన్‌బిఎఫ్‌సి గా ఉంది. స్టాండ్ అలోన్ ప్రాఫిట్ యాఫ్టర్ టాక్స్ ఆర్థిక సంవత్సరం 2023 లో 11,605 కోట్ల రూపాయలు గా ఉండగా, ఆర్థిక సంవత్సరం 2024 లో 24 శాతం మేరకు చెప్పుకోదగ్గ వృద్ధి తో 14,367 కోట్ల రూపాయల కు చేరుకొంది.

· మూడు నెలల కాలాని కి పన్ను చెల్లించిన అనంతరం లాభం 2023 వ సంవత్సరం నాలుగో త్రైమాసికం (క్యు4)లో 3,492 కోట్ల రూపాయల నుండి 18 శాతం వృద్ధి తో ఆర్థిక సంవత్సరం 2024 యొక్క నాలుగో త్రైమాసికం లో 4,135 కోట్ల రూపాయలు అయింది.

  • బోర్డు 2024 నాలుగో త్రైమాసికం లో ఒక్కొక్క శేరు కు 2.50 రూపాయల చొప్పున తుది డివిడెండు ను చెల్లించాలి అని ప్రతిపాదించింది. దీనిని కలుపుకొంటే, పిఎఫ్‌సి ఆర్థిక సంవత్సరం 2024 కు గాను ఒక్కొక్క శేరు కు 13.50 రూపాయల మొత్తం డివిడెండు ను ఇచ్చినట్లు అవుతున్నది.
  • రుణ రూపేణా ఆస్తులు 31.03.2023 నాడు 4,22,498 కోట్ల రూపాయల నుండి రెండు అంకె ల స్థాయి లో 14 శాతం మేర వృద్ధి చెంది 31.03.2024 నాటికి 4,81,462 కోట్ల రూపాయలు గా నమోదయ్యాయి.
  • నవీనీకరించదగిన రుణాలు ఏటికేడాది 25 శాతం వృద్ధి తో 60,208 కోట్ల రూపాయలు గా ఉన్నాయి. భారతదేశం లో నవీనీకరించదగిన రుణాల ను సమకూర్చుతున్న వ్యాపార సంస్థల లో అతి పెద్ద వ్యాపార సంస్థ గా పిఎఫ్‌సి తన స్థానాన్ని నిలబెట్టుకొన్నది.

· పిఎఫ్‌సి యొక్క కేపిటల్ ఎడిక్వసి స్థాయి లు అనుకూల స్థితి లో కొనసాగుతున్నాయి. కేపిటల్ టు రిస్క్ (వెయిటెడ్) ఎసెట్స్ రేశియో (సిఆర్ఎఆర్) 2024 మార్చి నెల 31 వ తేదీ నాటికి 25.41 శాతం గా ఉండగా, ఒకటో అంచె మూలధనం 23.18 శాతం వద్ద నియంత్రణ పరిమితి కి ఎంతో ఎక్కువ గా ఉంది.

· నికర విలువ ను చూసుకొంటే, 31.03.2023 నాటి 68,202 కోట్ల రూపాయల నుండి 16 శాతం వృద్ధి తో 31.03.2024 నాటికి 79,203 కోట్ల రూపాయలు గా ఉంది.

  • నికర ఎన్‌పిఎ నిష్పత్తి గడచిన ఆరు సంవత్సరాల లో అత్యల్ప స్థాయి కి చేరుకొంది. ఇది ఆర్థిక సంవత్సరం 2023 లోని 1.07 శాతం నుండి ఆర్థిక సంవత్సరం 2024 లో 0.85 శాతాని కి దిగి వచ్చింది. ఏడాది కి మించిన కాలం లో ఎటువంటి క్రొత్త ఎన్‌పిఎ ను జోడించడం జరుగ లేదు. స్థూల ఎన్‌పిఎ ఆర్థిక సంవత్సరం 2024 కు గాను 3.34 శాతం గా నమోదు అయింది. ఆర్థిక సంవత్సరం 2023 లో నమోదు అయిన 3.91 శాతం స్థూల ఎన్‌పిఎ లో 57 బేసిస్ పాయింట్ ల క్షీణత కనిపించింది.

యాజమాన్యం యొక్క వ్యాఖ్య లు

పిఎఫ్‌సి గ్రూపు భారతదేశం లో అతి పెద్ద ఎన్‌బిఎఫ్‌సి గ్రూపు గా ఉంటోంది అని పిఎఫ్‌సి చైర్ పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి పర్‌మీందర్ చోప్‌డా తెలిపారు. అంతేకాకుండా, ఏకీకృత ప్రాతిపదిక న మరియు స్టాండ్ అలోన్ ప్రాతిపదిక న చూసినప్పుడు భారతదేశం లోని అత్యధిక లాభాన్ని ఆర్జించే ఎన్‌బిఎఫ్‌సి గా కూడా పిఎఫ్‌సి నే ఉంది అని ఆమె అన్నారు.

పిఎఫ్‌సి ఆర్థిక సంవత్సరం ’24 లో రికార్డు స్థాయి లో లాభాల ను ఆర్జించింది. లాభం లో 24 శాతం వృద్ధి ఉంది. ఈ కంపెనీ 14,367 కోట్ల రూపాయల లాభాన్ని ఆర్జించింది. ఈ బలమైన ప్రదర్శన కు లోన్ పోర్ట్‌ ఫోలియో లో నమోదైన 14 శాతం వృద్ధి దన్ను గా నిలచింది. ఆస్తుల నాణ్యత బలం గా ఉంది. నికర ఎన్‌పిఎ స్థాయి లు మునుపటి ఆర్థిక సంవత్సరం లో 1.07 శాతం గా ఉండగా ప్రస్తుతం 0.85 శాతాని కి తగ్గాయి.

 

శేర్ హోల్డరు కు గరిష్ఠ విలువ ను అందించడం అనేది సంస్థ యొక్క ప్రాథమ్యం గా ఉంటోంది. బోర్డు ఈ రోజు న ప్రతిపాదించిన ప్రకారం శేరు ఒక్కింటికి 2.50 రూపాయల తుది డివిడెండు తో సహా ఆర్థిక సంవత్సరం ’24 కు గాను మొత్తం డివిడెండు ఒక్కొక్క శేరు కు 13.50 రూపాయలు గా ఉంటుంది.

 

ఆర్థిక ఫలితాల ను అటుంచితే, పిఎఫ్‌సి భారతదేశం లో స్వచ్ఛ శక్తి కార్యక్రమాన్ని ప్రోత్సహించడం లో అగ్రగామి గా ఉంటోంది. ఈ సంస్థ యొక్క నవీనీకరణ యోగ్యమైన లోన్ పోర్ట్‌ ఫోలియో ఏటికేడాది 25 శాతం వృద్ధి తో 60,000 కోట్ల రూపాయల కు పైబడింది. దీనితో సంస్థ యొక్క స్థితి భారతదేశం లో అగ్రగామి రీన్యూవబుల్ లెండర్ గా నిలబెడుతోంది.

 

భవిష్యత్తు లో, పిఎఫ్‌సి విద్యుత్తు మరియు మౌలిక సదుపాయాల కల్పన రంగాల లో మంచి వృద్ధి ని సాధించాలి అని తలుస్తోంది. మరి ఈ సంస్థ భారతదేశం యొక్క భావి అభివృద్ధి ప్రక్రియ లో ఒక సక్రియాత్మకమైనటువంటి భాగస్వామి గా మారేందుకు సిద్ధం గా ఉంది.

 

 

**



(Release ID: 2020813) Visitor Counter : 69