కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సి-డాట్‌ పరిశోధన విభాగం ఆర్‌&డి ప్రయత్నాలను అభినందించిన వైమానిక దళాధిపతి వి.ఆర్‌. చౌదరి


కీలక అవసరాల కోసం భవిష్యత్ తరహా & అత్యాధునిక సురక్షిత టెలికాం పరిష్కారాల అభివృద్ధికి సి-డాట్‌ - వైమానిక దళం మధ్య సహకారం కొనసాగాలని స్పష్టీకరణ

దేశీయంగా అభివృద్ధి చేసిన ఆధునిక భద్రత పరిష్కారాలను, ఇతర సాంకేతిక ఆవిష్కరణలను ఐఏఎఫ్‌ అధిపతి ఎదుట ప్రదర్శించిన సి-డాట్‌

Posted On: 27 MAR 2024 10:33AM by PIB Hyderabad

క్లిష్టమైన అవస్థాపనల కోసం భవిష్యత్ తరహా & అత్యాధునిక సురక్షిత టెలికాం పరిష్కారాల అభివృద్ధికి సి-డాట్‌ - వైమానిక దళం మధ్య సహకారం పెరగాలని వైమానిక దళాధిపతి, ఎయిర్ చీఫ్ మార్షల్ వి.ఆర్‌. చౌదరి స్పష్టం చేశారు. 26 మార్చి 2024న, 'సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్' (సి-డాట్‌) దిల్లీ ప్రాంగాణాన్ని ఆయన సందర్శించారు. కేంద్ర కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని టెలికమ్యూనికేషన్స్ విభాగానికి చెందిన ప్రధాన టెలికాం ఆర్‌&డి కేంద్రం సి-డాట్‌. రక్షణ రంగం, సైబర్ భద్రత వంటి కీలక మౌలిక సదుపాయాల కోసం స్వదేశీ, సురక్షిత టెలికాం పరిష్కారాలను అభివృద్ధి చేయడంలో ఇది చురుకుగా పని చేస్తోంది.

విభిన్న టెలికాం ఉత్పత్తులు, పరిష్కారాలు, భద్రత కార్యకలాపాల కేంద్రం (నెట్‌వర్క్‌లో మాల్‌వేర్‌ను నిజ సమయంలో గుర్తించడం), ఎంటర్‌ప్రైజ్ భద్రత కేంద్రం (అన్ని తుది పాయింట్లకు భద్రత కల్పించేలా, ఎంటర్‌ప్రైజ్ స్థాయిలో, హానికారక బెదిరింపులు & దాడులను నిజ సమయంలో గుర్తించడం & తగ్గించడం), క్వాంటం కీ డిస్ట్రిబ్యూషన్, పోస్ట్ క్వాంటం క్రిప్టోగ్రఫీ వంటి కీలకమైన టెలికాం భద్రత పరిష్కారాల గురించి వైమానిక దళాధిపతికి, ఇతర ప్రముఖులకు సి-డాట్‌ సీఈవో డా.రాజ్‌కుమార్ ఉపాధ్యాయ వివరించారు. 4జీ కోర్ & 4డీ రాన్‌, 5జీ కోర్ & 5G రాన్‌, క్యాప్‌ను ఉపయోగిస్తూ విపత్తు నిర్వహణ పరిష్కారం, ఆప్టికల్ రవాణా & వినియోగ పరిష్కారం, స్విచింగ్ & రూటింగ్ పరిష్కారం వంటి వాటి గురించి వివరించారు.

ఆ తర్వాత, వివిధ టెలికాం పరిష్కారాల ప్రత్యక్ష ప్రదర్శన జరిగింది.

సి-డాట్‌ సీనియర్ అధికార్లతో వైమానిక దళాధిపతి మాట్లాడారు. ఆధునిక యుద్ధం నెట్‌వర్క్-కేంద్రీకృతం నుంచి సమాచార-కేంద్రీకృతంగా మారుతున్న నేపథ్యంలో, భవిష్యత్ తరహా & అత్యాధునిక సురక్షిత టెలికాం పరిష్కారాల అభివృద్ధికి సి-డాట్‌ - వైమానిక దళం మధ్య సహకారం మరింత పెరగాలని స్పష్టం చేశారు.


వైమానిక దళం అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక భద్రత పరిష్కారాలను అభివృద్ధి చేయడంలో సి-డాట్‌ నిబద్ధతతో పని చేస్తుందని డా.ఉపాధ్యాయ్ హామీ ఇచ్చారు.

సి-డాట్‌ ప్రాంగణంలో వైమానిక దళాధిపతి వి.ఆర్‌. చౌదరి

సందర్శనకు గుర్తుగా మొక్క నాటిన ఎయిర్ చీఫ్ మార్షల్

స్వదేశీ వీడియో కాన్ఫరెన్సింగ్ (సి-డాట్‌ మీట్) & ఫోన్‌కాల్/సందేశాల (సంవాద్‌) పరిష్కారంపై ప్రదర్శన

'కామన్ అలెర్ట్ ప్రోటోకాల్' (క్యాప్‌) ముందస్తు హెచ్చరిక సమీకృత వ్యవస్థ ప్రయోగశాల సందర్శన

స్వదేశీ 5జీ స్టాండ్ అలోన్ (ఎస్‌ఏ) పరిష్కారం గురించి వివరణ

బృందంతో పాటు ఎయిర్ చీఫ్ మార్షల్ వి.ఆర్. చౌదరి

 

సి-డాట్ ప్రాంగణంలో తన అనుభవం గురించి సందర్శకుల పుస్తకంలో రాస్తున్న వైమానిక దళాధిపతి

***


(Release ID: 2016558) Visitor Counter : 175