కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సి-డాట్‌ దేశీయంగా అభివృద్ధి చేసిన "మొబైల్ ఎనేబుల్డ్ డిజాస్టర్ రెసిలెన్స్ త్రూ సెల్ బ్రాడ్‌కాస్ట్ ఎమర్జెన్సీ అలెర్టింగ్" యూఎన్‌ వరల్డ్ సమ్మిట్‌ నిర్వహిస్తున్న ఇన్ఫర్మేషన్‌ సొసైటీ పోటీ తదుపరి రౌండ్‌కు అర్హత సాధించింది


"జీవితానికి సంబంధించిన అన్ని అంశాలలో ప్రయోజనాలు: ఈ-ఎన్విరాన్‌మెంట్ కేటగిరీ" విభాగంలో షార్ట్‌లిస్ట్‌ చేయబడిన మొబైల్ ఎనేబుల్డ్ డిజాస్టర్ రెసిలెన్స్ థ్రూ సెల్ బ్రాడ్‌కాస్ట్ ఎమర్జెన్సీ అలెర్టింగ్

Posted On: 23 MAR 2024 7:12PM by PIB Hyderabad

వరల్డ్ సమ్మిట్ ఆన్ ది ఇన్ఫర్మేషన్ సొసైటీ (డబ్ల్యూఎస్‌ఐఎస్‌) అనేది ఐక్యరాజ్యసమితి (యూఎన్‌) ఆధ్వర్యంలో నిర్వహించే సమావేశాల శ్రేణి. ఐటీయూ మరియు స్విస్ సమాఖ్య హోస్ట్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్ టెక్నాలజీలు (ఐసిటీలు) మరియు సమాజంపై దాని ప్రభావంపై దృష్టి సారిస్తుంది. సమాజంలో డిజిటల్‌ అంతరాలను తొలగించడం జాతీయ, ప్రాంతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలలో నిర్మాణాత్మక మరియు సమగ్ర విధానం ద్వారా సామాజిక మరియు ఆర్థిక అభివృద్ధికి ఐసీటీల వినియోగాన్ని ప్రోత్సహించాలని డబ్ల్యూఎస్‌ఐఎస్‌ లక్ష్యంగా పెట్టుకుంది.

సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనను వేగవంతం చేయడానికి అలాగే సమాచార మరియు కమ్యూనికేషన్ సాంకేతికత శక్తిని ప్రభావితం చేసే అత్యుత్తమ ప్రాజెక్ట్‌లు / విజయాలను  డబ్ల్యూఎస్‌ఐఎస్‌ బహుమతులు  గౌరవిస్తాయి.

సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (సి-డాట్‌) అనేది భారత ప్రభుత్వ  కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ప్రధానమైన పరిశోధనా కేంద్రం. ఈ సంస్థ రూపొందించిన ప్రాజెక్ట్/ప్రొడక్ట్ "మొబైల్-ఎనేబుల్డ్ డిజాస్టర్ రెసిలెన్స్ త్రూ సెల్ బ్రాడ్‌కాస్ట్ ఎమర్జెన్సీ అలెర్టింగ్ "డబ్ల్యూఎస్‌ఐఎస్‌ ప్రైజ్ 2024 కోసం 1000+ గ్లోబల్ ఎంట్రీలలో జీవితానికి సంబంధించిన అన్ని అంశాలలో ప్రయోజనాలు -ఇ-ఎన్విరాన్‌మెంట్ విభాగంలో తదుపరి దశకు అర్హత సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేసింది.

సి-డాట్‌ రూపొందించిన  "మొబైల్-ఎనేబుల్డ్ డిజాస్టర్ రెసిలెన్స్ త్రూ సెల్ బ్రాడ్‌కాస్ట్ ఎమర్జెన్సీ అలెర్టింగ్" సిస్టమ్ అనేది సెల్యులార్ టెలికాం నెట్‌వర్క్‌ల ద్వారా మొబైల్ ఫోన్‌లలో ప్రాణాలను రక్షించే అత్యవసర సమాచారాన్ని తక్షణమే డెలివరీ చేయడానికి దేశీయంగా అభివృద్ధి చేయబడిన ఎండ్-టు-ఎండ్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ సొల్యూషన్. ఇది ప్రత్యేకమైన టోన్ మరియు పాప్-అప్ నోటిఫికేషన్‌తో హ్యాండ్‌సెట్‌లలో మెసేజ్‌ను పంపిస్తుంది. దీంతో వెంటనే క్లిష్టమైన పరిస్థితుల్లో సమర్థవంతమైన హెచ్చరికను అందిస్తుంది. విపత్తు మరియు అత్యవసర సమాచారానికి మాత్రమే కాకుండా ఈ  పరిష్కారం క్రింద పేర్కొన్న అనేక ఇతర సందర్భాలకు కూడా సరిపోతుంది:

 

  • ప్రభుత్వ ఆదేశాలు
  • శాంతి భద్రతల పరిరక్షణ
  • రక్షణ మరియు వ్యూహాల రంగం
  • పారిశ్రామిక రంగం
  • ప్రకటనలు


భూకంపం, పిడుగులు, సునామీ వంటి విపత్తుల సమయంలో తక్షణం చర్యలు తీసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన సమయాల్లో హెచ్చరికలను వ్యాప్తి చేయడం కోసం ప్రాణాలను రక్షించడంలో ఈ వ్యవస్థ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

డబ్ల్యూఎస్‌ఐఎస్‌-సంబంధిత ప్రాజెక్ట్‌ల సమర్పణ ప్రక్రియ 10 అక్టోబర్, 2023 నుండి 15 ఫిబ్రవరి, 2024 వరకు కొనసాగింది. ఆ తర్వాత నామినేషన్ దశ (16 ఫిబ్రవరి, 24 నుండి 10 మార్చి, 2024 వరకు) జరిగింది. ఇందులో సి-డాట్‌ ప్రాజెక్ట్ మొబైల్ ఎనేబుల్డ్ త్రూ డిజాస్టర్ రెసిలెన్స్ సెల్ బ్రాడ్‌కాస్ట్ ఎమర్జెన్సీ అలర్ట్ 1000+ ప్రాజెక్ట్‌లలో తదుపరి రౌండ్‌కు అర్హత పొందింది.

సి-డాట్‌ మొబైల్-ఎనేబుల్డ్ డిజాస్టర్ రెసిలెన్స్ త్రూ సెల్ బ్రాడ్‌కాస్ట్ ఎమర్జెన్సీ అలెర్టింగ్ సిస్టమ్‌తో పాటు పేర్కొన్న కేటగిరీలో అర్హత పొందిన ఇతర ఉత్పత్తులు/సొల్యూషన్‌లు ఉన్నాయి మరియు ఓటింగ్ ప్రక్రియ తర్వాత, అధిక సంఖ్యలో ఓట్లు పొందిన  ప్రాజెక్ట్ తదుపరి ఫేజ్‌కు అర్హత సాధిస్తుంది.

ఈ పరిష్కారాన్ని జీవితాలను రక్షించడానికి ఉపయోగించవచ్చు. ఈ నేపథ్యంలో సి-డాట్‌ ప్రజల మద్దతు కోసం ఓటు వేయమని అభ్యర్థిస్తుంది, తద్వారా మన దేశీయ మేక్ ఇన్ ఇండియా పరిష్కారం తదుపరి రౌండ్‌కు చేరుకుంటుంది.

ఓటింగ్ లింక్ 31 మార్చి, 2024 వరకు తెరిచి ఉంటుంది. ఈ పత్రికా ప్రకటన ద్వారా డి-డాట్‌  దాని ఉపయోగాలను అందించిన పరిష్కారానికి ఓటు వేయమని అభ్యర్థనలు విపత్తు వంటి పరిస్థితుల్లో విలువైన ప్రాణాలను రక్షించడానికి దారి తీస్తుంది.

ఓటింగ్ విధానం క్రింద జతచేయబడింది.

ఇన్ఫర్మేషన్ సొసైటీ (డబ్ల్యూఎస్‌ఐఎస్‌) ప్రైజ్‌లపై వరల్డ్ సమ్మిట్ 2024 కోసం సి-డాట్‌ యొక్క మొబైల్-ఎనేబుల్డ్ డిజాస్టర్ రెసిలెన్స్ త్రూ సెల్ బ్రాడ్‌కాస్ట్ ఎమర్జెన్సీ అలెర్టింగ్ కోసం ఓటు వేసే ప్రక్రియ:

1. ఓటింగ్ వెబ్‌సైట్‌ https://www.itu.int/net4/wsis/stocktaking/Prizes/2024 ను సందర్శించండి:
 
2. "ఓటు" బటన్‌పై క్లిక్ చేయండి:
image.png
image.png
 
 
3. మీ ఇమెయిల్ ఐడితో నమోదు చేసుకోండి మరియు అవసరమైన వివరాలను పంచుకోండి మరియు ఇమెయిల్ ఐడిని ధృవీకరించండి. ఇప్పటికే నమోదు చేసుకున్నట్లయితే, ఆధారాలను నమోదు చేసి లాగిన్ చేయండి:
 
image.png
 
 
4. "ఓటింగ్ ఫారమ్" పై క్లిక్ చేయండి
 
image.png
 
5. ఓటింగ్ ఫారమ్ తెరిచిన తర్వాత, డ్రాప్‌డౌన్ ఎంపిక జాబితా నుండి "సి7, ఈ-ఎన్విరాన్‌మెంట్" ఎంచుకోండి.
 
image.png
 
6.సి-డాట్‌ ప్రాజెక్ట్‌కు ఓటు వేయండి: సెల్ బ్రాడ్‌కాస్ట్ ఎమర్జెన్సీ అలర్ట్ ద్వారా మొబైల్ ఎనేబుల్డ్ డిజాస్టర్ రెసిలెన్స్
 
image.png
 
7. ఓటు వేసిన తర్వాత మీరు "మై ఓట్స్‌" విభాగం నుండి మీ ఓటును తనిఖీ చేయవచ్చు:
 
image.png
****

(Release ID: 2016352) Visitor Counter : 196


Read this release in: English , Urdu , Marathi , Hindi