శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

టెక్నాలజీ డెవలప్‌మెంట్ బోర్డ్ -డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ & టెక్నాలజీ పెప్ట్రిస్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌ మరియు నిర్లక్ష్యం చేయబడిన వ్యాధి పరిశోధన కోసం ఫౌండేషన్, ఫౌండేషన్ ఫర్ నెగ్లెక్టెడ్ డిసీజ్ రీసెర్చ్ (ఎఫ్ ఎన్ డీ ఆర్ ) లకు వినూత్న యాంటీబయాటిక్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ కోసం ₹75 లక్షల గ్రాంట్‌ ను అందిస్తుంది.

Posted On: 20 MAR 2024 7:00PM by PIB Hyderabad

వైద్య ఆవిష్కరణను ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో ఒక వినూత్న చొరవలో, టెక్నాలజీ డెవలప్‌మెంట్ బోర్డ్ (టీ డీ బీ) పెప్ట్రిస్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. పెప్ట్రిస్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు నిర్లక్ష్యం చేయబడిన వ్యాధి పరిశోధన కోసం ఫౌండేషన్, ఫౌండేషన్ ఫర్ నెగ్లెక్టెడ్ డిసీజ్ రీసెర్చ్ , మార్చి 18న బెంగళూరు. ఒప్పందం ప్రకారం, "అనగ్రన్ఇన్ఫ్ (ANAGRANINF) - గ్రామ్-నెగటివ్ బాక్టీరియల్-ఇన్‌ పీఫెక్షన్‌లకు వ్యతిరేకంగా  యొక్కనూతన తరగతి యాంటీబయాటిక్స్ అభివృద్ధి" ప్రాజెక్ట్ కోసం ₹75 లక్షల గ్రాంట్‌ను బోర్డు మంజూరు చేసింది,  మొత్తం ప్రాజెక్ట్ మొత్తం ₹1.5 కోట్లు.

 

ఈ సహకార ప్రయత్నం ఆరోగ్య సంరక్షణ రంగంలో ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుందని నమ్ముతారు. ఈ ప్రాజెక్ట్ భారతీయ మరియు స్పానిష్ కంపెనీల మధ్య ఉమ్మడి ప్రయత్నం, ఏ బీ ఏ సీ థెరప్యూటిక్స్ ఎస్ ఎల్  స్పానిష్ ప్రాజెక్ట్ లీడ్‌గా పనిచేస్తోంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ & టెక్నాలజీ మరియు సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ ఈ.పీ.ఈ. (సీ డీ టీ ఐ ) నేతృత్వంలో, ఈ ద్వైపాక్షిక కార్యక్రమం రెండు దేశాల మధ్య భాగస్వామ్యాలు మరియు వ్యాపార-నేతృత్వంలోని సహకార ప్రాజెక్టులను పెంపొందించుకుంటూ, తద్వారా ఆరోగ్య సంరక్షణలో ఆవిష్కరణలకోసం మార్కెట్-ఆధారిత పరిశోధన మరియు సాంకేతిక అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది.

 

ఎఫ్ ఏ బీ ఎల్ ఎంజైమ్‌ను నిరోధించడంలో మరియు క్లిష్టమైన గ్రామ్-నెగటివ్ వ్యాధికారక క్రిములను ఎదుర్కోవడంలో నైపుణ్యం కలిగిన ఒక నూతన తొలి సమ్మేళనం, ముఖ్యంగా యాంటీబయాటిక్‌ను అభివృద్ధి చేయడం ప్రాజెక్ట్ యొక్క ప్రాథమిక లక్ష్యం. సొంత ఏ ఐ సాధనాల శక్తిని ఉపయోగించడం మరియు ఎంట్రీ (eNTRy) నియమాల వంటి కఠినమైన మార్గదర్శకాలకు కట్టుబడి, మెరుగైన సామర్థ్యాన్ని ప్రదర్శించడమే కాకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్ ఓ) నిర్దేశించిన కఠినమైన ప్రమాణాలకు అనుగుణంగా ఉండే యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ (ఏ ఎం ఆర్) ఇన్ఫెక్షన్లను ఎదుర్కోవడానికి సమ్మేళనాల శ్రేణిని ఉత్పత్తి చేయడం ప్రాజెక్ట్ లక్ష్యం. 

 

ఎంచుకున్న లక్ష్య మాలిక్యూల్ ఎం ఎం వీ 1578564 గ్రామ్-నెగటివ్ వ్యాధికారక క్రిములకు వ్యతిరేకంగా మంచి కార్యాచరణను ప్రదర్శించింది, తదుపరి పరిశోధన మరియు అభివృద్ధి ప్రయత్నాలకు పునాదిగా పనిచేస్తుంది. ఇంకా ప్రాజెక్ట్ డబ్ల్యూ హెచ్ ఓ యొక్క ఆవిష్కరణ ప్రమాణాలకు అనుగుణంగా కొత్త రసాయన నిర్మాణాన్ని నిర్ధారిస్తుంది, ఇప్పటికే ఉన్న వాణిజ్య తరగతులతో క్రాస్-రెసిస్టెన్స్ లేదు, ఒక నూతన లక్ష్యం మరియు నూతన ప్రభావశీల ఔషద పనితీరు ఉన్న అభ్యర్థిని గుర్తించడం లక్ష్యంగా పెట్టుకుంది. 

 

టెక్నాలజీ డెవలప్‌మెంట్ బోర్డ్ కార్యదర్శి రాజేష్ కుమార్ పాఠక్ మాట్లాడుతూ, “ఈ సహకార చొరవ ద్వారా, యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ వంటి క్లిష్టమైన ప్రపంచ సవాళ్లను పరిష్కరించే లక్ష్యంతో మార్గదర్శక పరిశోధన ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడానికి టీ డీ బీ తన అచంచలమైన నిబద్ధతను పునరుద్ఘాటించింది. సామాజిక ప్రయోజనం కోసం వినూత్న ఆలోచనలను  స్పష్టమైన పరిష్కారాలలోకి అనువదించడానికి బోర్డు నిబద్దత లో అంకితభావం ఉంది.

 

***


(Release ID: 2015879) Visitor Counter : 208


Read this release in: English , Urdu , Hindi , Tamil