ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
జైళ్లలో ఆహార భద్రతకు ప్రాధాన్యత దాదాపు 100 జైళ్లను ఈట్ రైట్ క్యాంపస్‌లుగా ధ్రువీకరించిన ఎఫ్ఎస్ఎస్ఏఐ
దేశవ్యాప్తంగా ఈట్ రైట్ క్యాంపస్‌లుగా గుర్తింపు పొందిన 2,90 0పని ప్రాంతాలు
Posted On:
14 MAR 2024 3:03PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా దాదాపు 100 జైళ్లకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) 'ఈట్ రైట్ క్యాంపస్‌లుగా 'గా సర్టిఫికేట్ ఇచ్చింది.పని ప్రాంతాల్లో ఆహార రక్షణ, మంచి తిండి అలవాట్లు ప్రోత్సహించడానికి ఎఫ్ఎస్ఎస్ఏఐ అమలు చేస్తున్న కార్యక్రమంలో భాగంగా 100 జైళ్లకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) 'ఈట్ రైట్ క్యాంపస్‌లుగా 'గా సర్టిఫికేట్ ఇచ్చింది జైళ్ల తో సహా వివిధ కార్యాలయాలు, సంస్థలలో సురక్షితమైన, ఆరోగ్యకరమైన , స్థిరమైన అందేలా చూసేందుకు ఎఫ్ఎస్ఎస్ఏఐ కృషి చేస్తోంది.
ఈట్ రైట్ క్యాంపస్ సర్టిఫికేట్ కోసం ఎఫ్ఎస్ఎస్ఏఐ నిర్వహించిన కార్యక్రమంలో భారతదేశంలోప్రముఖ జైళ్లుగా గుర్తింపు పొందిన తీహార్ జైలు (ఢిల్లీ), సెంట్రల్ జైలు గయా (బీహార్), మోడరన్ సెంట్రల్ జైలు (పంజాబ్), సెంట్రల్ జైలు రేవా (మధ్యప్రదేశ్) తో సహా అనేక జిల్లా, మండల జైళ్లు పాల్గొని సర్టిఫికేషన్ పొందాయి ఉత్తర ప్రదేశ్, పంజాబ్, బీహార్, మధ్యప్రదేశ్ ఉన్న జైళ్లు అత్యధికంగా .సర్టిఫికేషన్ పొందాయి.
జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న వారికి, జైలు సిబ్బందికి సురక్షితమైన పోషకమైన ఆహారాలు అందేలా చూసేందుకు ఈట్ రైట్ క్యాంపస్ కార్యక్రమాన్ని జైళ్లు, కరెక్షనల్ కేంద్రాలలో కూడా అమలు చేయాలని ఎఫ్ఎస్ఎస్ఏఐ నిర్ణయించింది.
‘ఈట్ రైట్ క్యాంపస్’ సర్టిఫికెట్ జారీ చేయడానికి ఎఫ్ఎస్ఎస్ఏఐ కఠినమైన ప్రమాణాలు నిర్ణయించింది. ప్రమాణాలకు లోబడి ధ్రువీకరణ ప్రక్రియ జరుగుతుంది. ఈ ప్రమాణాలను పాటించడం ద్వారా సర్టిఫికెట్ పొందిన జైళ్లు ఖైదీల ఆహార భద్రత, శ్రేయస్సు కోసం తాము అనుసరిస్తున్న విధానాన్ని దర్శించాయి. జైలు వ్యవస్థలో ఆహార భద్రత, పోషకాహారం పట్ల బాధ్యత, జవాబుదారీతనాన్ని ప్రోత్సహించడానికి ఎఫ్ఎస్ఎస్ఏఐ అమలు చేసిన కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుంది. ఖైదీలు, సిబ్బందికి సురక్షితమైన, సమతుల్య ఆహారం అందించడానికి ప్రోత్సహిస్తుంది. సర్టిఫికెట్ పొందిన జైళ్లు ఇతర జైళ్లకు మార్గదర్శకంగా ఉండి వ్యవస్థలు మార్పు తీసుకు రావడానికి తమ వంతు సహకారం అందిస్తాయి.
కార్యక్రమంలో పాల్గొన్న జైళ్లను నాలుగు ప్రమాణాల ఆధారంగా విశ్లేషిస్తారు. ప్రాథమిక పరిశుభ్రత ప్రమాణాలు, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడానికి అమలు చేస్తున్న చర్యలు, స్థానిక, కాలానుగుణ ఆహారం గురించి అవగాహన పెంపొందించడానికి చేస్తున్న కృషి ఆధారంగా అధ్యయనం చేస్తారు. కార్యక్రమంలో పాల్గొనడానికి నమోదు చేసుకున్న తర్వాత సంబంధిత జైలును తొలుత స్వీయ-అంచనా లేదా ఎఫ్ఎస్ఎస్ఏఐ గుర్తించిన థర్డ్-పార్టీ ఆడిట్ ద్వారా అధ్యయనం చేసి మార్గదర్శకాల ప్రకారం లోపాలు గుర్తించి, లోపాలు సరి చేయడానికి గల అవకాశాలను గుర్తిస్తారు. ఈ లోపాలను పరిష్కరించడానికి యంత్రాంగం తగిన చర్యలు అమలు చేస్తుంది. కార్యక్రమంలో భాగంగా ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్ (FoSTaC) ప్రోగ్రాం ద్వారా ఎఫ్ఎస్ఎస్ఏఐ క్యాంపస్‌లో ఫుడ్ సేఫ్టీ సూపర్‌వైజర్లు, ఆహారం సిద్ధం చేసే వారికి తగిన శిక్షణ ఇస్తుంది.ఫుడ్ సేఫ్టీ సూపర్‌వైజర్లు, ఆహారం సిద్ధం చేసే వారికి శిక్షణ ఇవ్వడం ఈ ప్రక్రియలో కీలక దశగా అమలు జరుగుతుంది.ఫుడ్ సేఫ్టీ సూపర్‌వైజర్లు, ఆహారం సిద్ధం చేసే వారికి పరిశుభ్రత, తయారీ పద్ధతులపై శిక్షణ ఇవ్వడానికి ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్ అమలు జరుగుతుంది.
లోపాలు సరి తర్వాత మరోసారి ఎఫ్ఎస్ఎస్ఏఐ గుర్తించిన ఏజెన్సీ తుది ఆడిట్ నిర్వహిస్తుంది. ప్రమాణాల మేరకు పనిచేస్తున్న జైళ్లకు ఈట్ రైట్ క్యాంపస్ గా గుర్తించి సర్టిఫికేట్ జారీ చేస్తుంది.
దేశవ్యాప్తంగా 2,900కి పైగా పని కేంద్రాలు ఈట్ రైట్ క్యాంపస్‌లుగా గుర్తింపు పొందాయి. ఈ ప్రాంతాల్లో పనిచేస్తున్న సిబ్బంది సానుకూల ప్రయోజనం పొందుతున్నారు.కార్యక్రమానికి స్పందన లభించడంతో ప్రతి ఒక్కరికి ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన ఆహారం అందేలా చూసేందుకు వివిధ రంగాలకు చెందిన సంస్థలతో కలిసి పని చేయడానికి ఎఫ్ఎస్ఎస్ఏఐ సిద్ధంగా ఉంది.
***
(Release ID: 2014744)
Visitor Counter : 130