రక్షణ మంత్రిత్వ శాఖ
పోర్‌బందర్ సమీపంలో అరేబియా సముద్రంలో ఉమ్మడి ఆపరేషన్ నిర్వహించి ఒక పాకిస్తానీ పడవను అదుపులోకి తీసుకున్న భారతీయ కోస్ట్ గార్డ్
పడవలో రూ. 480 కోట్ల విలువైన మాదకద్రవ్యాల స్వాదీనం
Posted On:
12 MAR 2024 6:09PM by PIB Hyderabad
మార్చి 11&12 , 2024 అర్థరాత్రి నిఘావర్గాల సమాచారం ఆధారంగా నిర్వహించిన ఉమ్మడి ఆపరేషన్‌లో దాదాపు 480 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు, ఆరుగురు సిబ్బందితో కూడిన పాకిస్తానీ పడవను భారతీయ కోస్ట్ గార్డ్ (ఐసిజి- సముద్రతీర గస్తీ) అదుపులోకి తీసుకుంది.అరేబియా సముద్రంలో పోరుబందర్‌కు 350 కిమీల దూరంలో ఐసిజి నౌకలు, డోమియర్ విమానం కలిసి సమన్వయంతో నిర్వహించిన సముద్ర- వైమానిక ఆపరేషన్‌లో ఈ పడవను నిర్బంధంలోకి తీసుకున్నారు. ఈ ఆపరేషన్ ఐసిజి, ఎన్‌సిబి & గుజరాత్ ఎటిఎస్ మధ్య సమన్వయ కృషిని ప్రదర్శించింది.
ఏజెన్సీల నుంచి అందుకున్న నిర్ధిష్ట నిఘా సమాచారం మేరకు 11 మార్చి, 24, సోమవారం నాడు అరేబియా సముద్రంలో తన నౌకలను వ్యూహాత్మకంగా భారతీయ కోస్ట్ గార్డ్ నిలిపింది. పడవ ఉండే ప్రాంతాలలో వెతికి, కనిపెట్టే బాధ్యతను డోర్నియర్ విమానానికి ఐసిజి అప్పగించింది. ఆ ప్రాంతంలో విస్త్రతమైన సోదా అనంతరం, ఎన్‌సిబి, ఎటిఎస్ గుజరాత్ బృందాలతో కలిసి ఐసిజి నౌకలు ఆ ప్రాంతానికి చేరుకొని, చీకట్లో అనుమానాస్పదంగా ప్రయాణిస్తున్న పడవను కచ్ఛితంగా గుర్తించాయి. ఐసిజి నౌకలు సవాలుగా సమీపిస్తుండడంతో,పడవ తప్పించుకునే యుక్తిని ప్రారంభించినప్పటికీ ఐసిజి నౌకలు నేర్పుగా దానిని వెంబడించి, బలవంతంగా దానిని నిలిపివేశాయి. నౌకపై ఉన్న బృందం ప్రాథమిక తనిఖీలు దర్యాప్తు కోసం తక్షణమే పడవలోకి ఎక్కింది. ఆరుగురు సిబ్బంది కలిగిన ఆ పడవను పాకిస్తానీ పడవగా గుర్తించారు. ఆ పడవలోకి ప్రవేశించిన ఉమ్మడి బృందం నిర్వహించిన సోదాలు, దర్యాప్తులో దాదాపు రూ. 480 కోట్ల విలువైన 80 కేజీల మాదక ద్రవ్యాలు బయిటపడ్డాయి.
సిబ్బంది సహా ఆ పడవను నిర్బంధంలోకి తీసుకుని తదుపరి దర్యాప్తు కోసం పోరుబందర్ తీసుకువెళ్ళారు. గత మూడేళ్ళలో రూ. 3135 కోట్ల విలువైన 517 కిలోల మాదక ద్రవ్యాలను ఎటిఎస్ గుజరాత్, ఎన్‌సిబితో కలిసి ఐసిజి పట్టుకోవడం ఇది పదవసారి.
***
(Release ID: 2013987)
Visitor Counter : 105