సహకార మంత్రిత్వ శాఖ

ఢిల్లీలో రేపు (2024 మార్చి 13, బుధవారం) మూడు బహుళ రాష్ట్ర సహకార సంఘాల (బిబిఎస్ఎస్ఎల్, ఎన్సిఒఎల్, ఎన్ సిఈఎల్ ) నూతన కార్యాలయ భవనాలను ప్రారంభించనున్న కేంద్ర హోం మంత్రి, సహకార మంత్రి శ్రీ అమిత్ షా


' సహకారం ద్వారా సంక్షేమం ' అన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ లక్ష్యాన్ని సాధించడానికి సహకార మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా నూతన భవనాల ప్రారంభం

దేశవ్యాప్తంగా సహకార రంగంలో ఒక మైలురాయిగా బిబిఎస్ఎస్ఎల్, ఎన్సిఒఎల్, లకు విడివిడిగా ప్రత్యేక కార్యాలయ భవనాన్ని ఏర్పాటు

ఈ మూడు మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీలు వ్యవసాయం, సంబంధిత కార్యకలాపాలతో సంబంధం ఉన్న ప్రజల అభ్యున్నతికి కృషి చేయనున్న మూడు బహుళ రాష్ట్ర సహకార సంఘాలు

పీఏసీఎస్ ల ద్వారా రైతుల నుంచి వ్యవసాయ ఉత్పత్తులు, విత్తనాలు కొనుగోలు చేయడం వల్ల పీఏసీఎస్ లు బలోపేతం కావడానికి రైతులు తమ ఉత్పత్తులకు గరిష్ట విలువ పొందడానికి అవకాశం కలుగుతుంది.

Posted On: 12 MAR 2024 7:08PM by PIB Hyderabad

ఢిల్లీలో రేపు (2024 మార్చి 13, బుధవారం) మూడు  బహుళ రాష్ట్ర సహకార సంఘాల (బిబిఎస్ఎస్ఎల్, ఎన్సిఒఎల్, ఎన్ సిఈఎల్ ) నూతన కార్యాలయ భవనాలను కేంద్ర హోం మంత్రి,సహకార మంత్రి శ్రీ అమిత్ షా ప్రారంభిస్తారు.  న్యూఢిల్లీలోని నౌరోజీ నగర్ లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ లో జరిగే కార్యక్రమంలో  మూడు బహుళ రాష్ట్ర సహకార సంఘాలు-  భారతీయ బీజ్ సహకార సమితి లిమిటెడ్ (బిబిఎస్ఎస్ఎల్), నేషనల్ కో ఆపరేటివ్ ఆర్గానిక్స్ లిమిటెడ్ (ఎన్సిఒఎల్), నేషనల్ కో ఆపరేటివ్ ఎక్స్పోర్ట్ లిమిటెడ్ (ఎన్సిఒఎల్,)  నూతన కార్యాలయ భవనాలను శ్రీ షా ప్రారంభిస్తారు. 

'  సహకారం ద్వారా సంక్షేమం ' అన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ లక్ష్యాన్ని సాధించడానికి  సహకార మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా మూడు  బహుళ రాష్ట్ర సహకార సంఘాలకు నూతన కార్యాలయ భవనాలు ఏర్పాటు అవుతున్నాయి.

 మూడు సొసైటీలకు ప్రత్యేక కార్యాలయ భవనాలు అవసరమని సహకార మంత్రిత్వ శాఖ గుర్తించింది. నూతన భవనాలు అందుబాటులోకి రావడంతో ఈ సంఘాలు  నిరాటంకంగా పనిచేయగలుగుతాయి. 

 ఎగుమతులు, సేంద్రియ ఉత్పత్తులు, విత్తనాల కోసం మూడు జాతీయ స్థాయి బహుళ రాష్ట్ర సహకార సంఘాల ఏర్పాటుకు  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం  ఆమోదం తెలిపింది. ఎంఎస్సిఎస్ చట్టం 2002 కింద ఈ మూడు సహకారం సంఘాలు రిజిస్టర్ అయ్యాయి.  నిర్దేశించిన కార్యకలాపాలపై ఆసక్తి ఉన్న అన్ని  'పీఏసీఎస్ స్థాయి నుంచి ఏపీఏసీఎస్ స్థాయి' వరకు.పనిచేస్తున్న  సహకార సంఘాలు ఈ మూడు బహుళ రాష్ట్ర సహకార సంఘాల్లో సభ్యులుగా చేరవచ్చు.

నేషనల్ కో ఆపరేటివ్ ఆర్గానిక్స్ లిమిటెడ్:  సహకార రంగం నుంచి ఎగుమతులు ప్రోత్సహించడానికి నేషనల్ కో ఆపరేటివ్ ఆర్గానిక్స్ లిమిటెడ్ ద్వారా కృషి జరుగుతుంది.  గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ (GCMMF), ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్ కో ఆపరేటివ్ లిమిటెడ్ (IFFCO), క్రిషక్ భారతి కోఆపరేటివ్ లిమిటెడ్ (KRIBHCO), నేషనల్ అగ్రికల్చరల్ కో ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NAFED), నేషనల్ కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NCDC) వంటి ప్రముఖ  సంస్థలు  నేషనల్ కో ఆపరేటివ్ ఆర్గానిక్స్ లిమిటెడ్ లో సభ్యులుగా ఉన్నాయి. సహకార సంస్థలు, సంబంధిత సంస్థల  వస్తువులు, సేవల  ప్రత్యక్ష ఎగుమతి,  అన్ని సంబంధిత ప్రమోషన్ కార్యకలాపాలను నేషనల్ కో ఆపరేటివ్ ఆర్గానిక్స్ లిమిటెడ్ చేపడుతుంది.  వివిధ స్థాయిలలో సహకార సంఘాల మధ్య వస్తువులు, సేవల అనుసంధానాన్నినేషనల్ కో ఆపరేటివ్ ఆర్గానిక్స్ లిమిటెడ్  పెంచుతుంది, ఫలితంగా ఈ రంగంలో మరింత ఉపాధి అవకాశాలు లభిస్తాయి.  సహకార రంగంలో ఉత్పత్తి అయిన  మిగులు వస్తువులు, సేవల ఎగుమతి చేయడానికి నేషనల్ కో ఆపరేటివ్ ఆర్గానిక్స్ లిమిటెడ్ సహకారం అందించి  మేక్ ఇన్ ఇండియా"నుప్రోత్సహించి  ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణానికి కృషి చేస్తుంది. 

నేషనల్ కో ఆపరేటివ్ ఆర్గానిక్స్ లిమిటెడ్   సేంద్రియ ఉత్పత్తుల సామర్థ్యాన్ని వెలికి తీసి  ఆరోగ్యకరమైన వ్యవసాయ పర్యావరణ వ్యవస్థ ను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో నేషనల్ కో ఆపరేటివ్ ఆర్గానిక్స్ లిమిటెడ్ ఏర్పాటయింది.  సహకార రంగంలో సేంద్రియ ఉత్పత్తుల గుర్తింపు , సేకరణ, సర్టిఫికేషన్, టెస్టింగ్, బ్రాండింగ్ , మార్కెటింగ్ కోసం నేషనల్ కో ఆపరేటివ్ ఆర్గానిక్స్ లిమిటెడ్ ఒక ఏక గవాక్ష  సంస్థగా పని చేస్తుంది.నేషనల్ కో ఆపరేటివ్ ఆర్గానిక్స్ లిమిటెడ్ ను   ఐదు జాతీయ స్థాయి సహకార సమాఖ్యలు ఏర్పాటు చేశాయి. నేషనల్ అగ్రికల్చరల్ కో ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NAFED), నేషనల్ డైరీ డెవలప్‌మెంట్ బోర్డ్ (NDDB), నేషనల్ కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NCDC), గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ (GCMMF), నేషనల్ కో ఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NCCF) లు నేషనల్ కో ఆపరేటివ్ ఆర్గానిక్స్ లిమిటెడ్ లో సభ్యత్వం పొందాయి.  సేంద్రియ ఉత్పత్తుల ఉత్పత్తిని ఎక్కువ చేయడానికి నేషనల్ కో ఆపరేటివ్ ఆర్గానిక్స్ లిమిటెడ్  సహాయం చేస్తుంది, వివిధ స్థాయిలలో సహకార సంస్థలు, సంబంధిత సంస్థల ద్వారా ప్రామాణికమైన , ధృవీకరిం చిన సేంద్రీయ ఉత్పత్తుల మార్కెటింగ్‌ కు సహకారం అందిస్తుంది.

భారతీయ బీజ్ సహకార సమితి లిమిటెడ్  :  అధునాతన  సాంప్రదాయ విత్తన పరిశోధన, ఉత్పత్తి అంశాలపై  భారతీయ బీజ్ సహకార సమితి లిమిటెడ్ దృష్టి సారించి పనిచేస్తుంది. సహకార రంగం ద్వారా వాటి ప్రాసెసింగ్, మార్కెటింగ్‌కు బాధ్యత వహిస్తుంది. ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్ కో ఆపరేటివ్ లిమిటెడ్ (IFFCO), క్రిషక్ భారతి కోపరేటివ్ లిమిటెడ్ (KRIBHCO),  నేషనల్ అగ్రికల్చరల్ కో ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NAFED), నేషనల్ డైరీ డెవలప్‌మెంట్ బోర్డ్ (NDDB), -ఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NCDC)లు  భారతీయ బీజ్ సహకార సమితి లిమిటెడ్ ను  ఏర్పాటు చేశాయి. సహకార సంఘాల ద్వారా ప్రపంచ ప్రమాణాలతో సమానంగా భారతదేశంలో నాణ్యమైన విత్తనాల ఉత్పత్తి పెంచడం,దిగుమతి చేసుకున్న విత్తనాలపై ఆధారపడటాన్ని తగ్గించడం, వ్యవసాయోత్పత్తులను  మెరుగుపరచడం, విత్తనోత్పత్తి చేసే రైతులకు ఆదాయాన్ని పెంచడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ప్రోత్సాహం అందించడం లక్ష్యంగా  భారతీయ బీజ్ సహకార సమితి లిమిటెడ్ పనిచేస్తుంది. 

 వ్యవసాయం, సంబంధిత కార్యకలాపాలతో అనుబంధించబడిన ప్రజల అభ్యున్నతికి మూడు సహకార సంఘాలు కృషి చేస్తాయి.ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా  రైతుల నుంచి వ్యవసాయ ఉత్పత్తులు , విత్తనాలు  కొనుగోలు చేస్తాయి. దీనివల్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు   మరింత బలోపేతం కావడానికి అవకాశం కలుగుతుంది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలతో సంబంధం ఉన్న  రైతులు వారి ఉత్పత్తులకు గరిష్ట విలువ పొందుతారు.  నికర మిగులుపై లాభాలు నేరుగా రైతుల ఖాతాల్లోకి వెళ్లేలా చూడటం ద్వారా ప్రక్రియలో లీకేజీలను నిరోధించే లక్ష్యంతో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పనిచేస్తాయి.

బిబిఎస్ఎస్ఎల్, ఎన్సిఒఎల్, ఎన్ సిఈఎల్ ల నూతన  ప్రత్యేక కార్యాలయ భవనం ప్రారంభోత్సవం దేశంలో సహకార రంగంలో ఒక మైలురాయిగా నిలుస్తుంది,. రైతులకు స్థిరమైన ఆదాయాన్ని పొందేందుకు మూడు సంఘాల కృషి జరుగుతుంది.'  సహకారం ద్వారా సంక్షేమం ' అన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ   దార్శనికతను సాకారం చేయడంలో సహాయపడుతుంది.
ఈ కార్యక్రమంలో సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖలు/విభాగాలకు చెందిన  కార్యదర్శులు, ఇతర సీనియర్ అధికారులు, కొత్తగా ఏర్పడినబిబిఎస్ఎస్ఎల్, ఎన్సిఒఎల్, ఎన్ సిఈఎల్  సంస్థల  అధికారులు, వ్యవసాయ, ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ  ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) వంటి సంబంధిత సంస్థల అధికారులు పాల్గొంటారు. భారతదేశంలో విదేశీ రాయబార కార్యాలయాల అధికారులు, మూడు సంఘాల  ప్రమోటర్ల అధికారులు, దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ సహకార సమాఖ్యల అధికారులు, ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరవుతారు.


***



(Release ID: 2013965) Visitor Counter : 100


Read this release in: English , Urdu , Hindi