సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్
azadi ka amrit mahotsav

ముంబైలో 'మల్టీపర్పస్ ఎగ్జిబిషన్-కమ్-కన్వెన్షన్ సెంటర్‌'కు రేపు శంకుస్థాపన చేయనున్న కేంద్ర మంత్రి శ్రీ నారాయణ్ రాణె


పుణెలోని ఎంఎస్‌ఎంఈ 'డెవలప్‌మెంట్ అండ్ ఫెసిలిటేషన్ ఆఫీస్' కార్యాలయాన్ని కూడా ప్రారంభించనున్న రాణె

నాడు పోస్టు చేయడమైనది: 08 MAR 2024 5:01PM by PIB Hyderabad

కేంద్ర సూక్ష్మ, చిన్న & మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ నారాయణ్ రాణె, ముంబైలోని సాకి నాకాలో 'మల్టీపర్పస్ ఎగ్జిబిషన్-కమ్-కన్వెన్షన్ సెంటర్‌'కు రేపు శంకుస్థాపన చేయనున్నారు. పుణెలోని ఎంఎస్‌ఎంఈ 'డెవలప్‌మెంట్ అండ్ ఫెసిలిటేషన్ ఆఫీస్' కార్యాలయాన్ని కూడా ప్రారంభిస్తారు. ఎంఎస్‌ఎంఈ సహాయ మంత్రి శ్రీ భాను ప్రతాప్ సింగ్ వర్మ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

'మల్టీపర్పస్ ఎగ్జిబిషన్-కమ్-కన్వెన్షన్ సెంటర్‌'లో ఒక ప్రదర్శనశాల ఏర్పాటు చేస్తారు. వివిధ రంగాల ఎంఎస్‌ఎంఈలు ఉత్పత్తి చేసిన వస్తువులను ఇక్కడ ప్రదర్శిస్తారు. పీఎం విశ్వకర్మ, కేవీఐసీ, కాయిర్‌ బోర్డుకు చెందిన సుమారు 100 ప్రదర్శన స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇంక్యుబేటర్లు, మహిళా పారిశ్రామికవేత్తలు, ఎస్సీ/ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ఎక్కువ స్టాళ్లు కేటాయించారు. 'నేషనల్‌ ఎస్సీ ఎస్టీ హబ్' (ఎన్‌ఎస్‌ఎస్‌హెచ్‌) లబ్ధిదార్లను కేంద్ర ఎంఎస్‌ఎంఈ మంత్రి సత్కరిస్తారు.

పీఎం విశ్వకర్మ పథకాన్ని 17.09.2023న ప్రధాన మంత్రి ప్రారంభించారు. 18 విభాగాలకు చెందిన హస్త కళాకారులకు తుది ప్రయోజనాల మద్దతును అందించే సంపూర్ణ పథకం ఇది. 07.03.2024 నాటికి, పథకం కింద 6,46,164 దరఖాస్తులు విజయవంతంగా నమోదయ్యాయి. ఈ పథకంపై అవగాహన కల్పించేందుకు, ఈ పథకం కింద సాయమందే వివిధ విభాగాలకు సంబంధించిన అనుభవశాలను అందుబాటులో ఉంచుతారు. ఇక్కడ, పీఎం విశ్వకర్మ కార్యశాలను కూడా నిర్వహిస్తారు. 

 

***


(రిలీజ్ ఐడి: 2013374) సందర్శకుల సూచీ సంఖ్య : : 109
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी