పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సోన్‌భద్రలో రూ. 10.41 కోట్ల విలువైన 177 అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడం తో పాటు శంకుస్థాపన చేసిన హర్దీప్ ఎస్ పూరి జిల్లా సాధిస్తున్న ప్రగతికి నిదర్శనం ఈ ప్రాజెక్టులు హర్దీప్ ఎస్ పూరి

Posted On: 07 MAR 2024 5:06PM by PIB Hyderabad

కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాలు, పెట్రోలియం, సహజ వాయువు శాఖ  శ్రీ హర్దీప్ ఎస్ పూరి వర్చువల్ విధానంలో  ఉత్తరప్రదేశ్ లోని సోన్‌భద్ర జిల్లాలో  రూ. 10.41 కోట్ల విలువైన 177 అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడం తో పాటు శంకుస్థాపన చేశారు. సమ్మిళిత అభివృద్ధి సాధన దిశగా అభివృద్ధి  ప్రాజెక్టులు చేపట్టారు. 

ప్రాజెక్టుల నిర్మాణం కోసం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న శ్రీ పూరి ఎంపీ లాడ్స్ పథకం నుంచి  10 కోట్ల 41 లక్షల రూపాయలను విడుదల చేశారు. నీతి ఆయోగ్ అమలు చేస్తున్న  ఆకాంక్షాత్మక జిల్లాల కార్యక్రమంలో భాగంగా జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించే బాధ్యతను శ్రీ పూరి స్వీకరించారు. 

ఈ సందర్భంగా శ్రీ పూరి మాట్లాడుతూ సోన్‌భద్ర గణనీయమైన అభివృద్ధి  సాధిస్తోందని అన్నారు.  ఈ ప్రాజెక్టులు జిల్లా సాధించిన ప్రగతికి  ప్రతీక అని అన్నారు. ' విద్యా రంగం అభివృద్ధి కోసం పాఠశాలలకు నూతన భవనాల నిర్మాణం జరుగుతోంది. . ప్రజల కోసం సామాజిక భవనాలు రూపుదిద్దుకుంటున్నాయి. రవాణా  సౌకర్యాలు, , సులభ్ మరుగుదొడ్లు, వంతెనలు,  సీసీ రోడ్ల నిర్మాణం జరుగుతోంది' అని మంత్రి తెలిపారు. 

జిల్లా సాధించిన ప్రగతిని నీతి ఆయోగ్ గుర్తించిందని శ్రీ పూరి తెలిపారు. నీతి ఆయోగ్ 112 జిల్లాల్లో  అమలు చేస్తున్న ఆకాంక్షిత జిల్లాల అభివృద్ధి కార్యక్రమం అమలులో  సోన్‌భద్ర 2018 జనవరి నుంచి 2024 మార్చి వరకు మొదటి 5   జిలాల్లో ఒకటిగా  ఉందని శ్రీ పూరి తెలిపారు. 
ప్రాజెక్టులను వేగంగా రూపొందించి అమలు చేసిన  సోన్‌భద్ర జిల్లా యంత్రాంగాన్ని శ్రీ పూరి  అభినందించారు. ప్రాజెక్టుల అమలుకు సహకరించిన స్థానిక ప్రజలను మంత్రి అభినందించారు. 
 'సబ్కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్, సబ్‌కా ప్రయాస్' అనే ప్రధాని మోదీ దార్శనికతకు  సోన్‌భద్ర ప్రజల సహకారం ఉదాహరణగా నిలుస్తుందని ఆయన అన్నారు.

***


(Release ID: 2012396)
Read this release in: English , Urdu , Hindi