రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

హిమాచల్‌ప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్‌లో కొత్త సిపెట్‌లను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా.మన్‌సుఖ్ మాండవీయ


పెట్రో రసాయనాల పరిశ్రమ అవసరాలను తీర్చడానికి భారత ప్రభుత్వం గత పదేళ్లలో సిపెట్‌లను 23 నుంచి 47కు పెంచింది: మాండవీయ

Posted On: 04 MAR 2024 7:44PM by PIB Hyderabad

మన దేశంలో, పెట్రో రసాయనాల పరిశ్రమ అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం గత 10 సంవత్సరాల్లో సిపెట్‌ల సంఖ్యను 23 నుంచి 47కు పెంచిందని కేంద్ర రసాయనాలు & ఎరువుల మంత్రి డా.మన్‌సుఖ్ మాండవీయ చెప్పారు. హిమాచల్‌ప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్‌లో 'సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ' (సిపెట్‌) 3 కేంద్రాలను ఈ రోజు న్యూదిల్లీ నుంచి వర్చువల్‌ పద్ధతిలో కేంద్ర మంత్రి ప్రారంభించారు. సీఎస్‌టీఎస్‌ బద్ది (హిమాచల్‌ప్రదేశ్), సీఎస్‌టీఎస్‌ రాంచీ (జార్ఖండ్), సీఎస్‌టీఎస్‌ గ్వాలియర్‌లోని (మధ్యప్రదేశ్‌) మూడు కొత్త సిపెట్‌ కేంద్రాలను కేంద్ర మంత్రి దేశానికి అంకితం చేశారు. మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీ భగవంత్ ఖుబా, కార్యదర్శి శ్రీ నివేదిత శుక్లా వర్మ, సీనియర్ అధికార్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

మన దేశంలో సిపెట్‌కు ప్రత్యేక స్థానం ఉందని డా.మన్‌సుఖ్ మాండవీయ వెల్లడించారు. ఈ సంస్థలు 21వ శతాబ్దపు అవసరాలకు అనుగుణంగా తమను తాము మార్చుకున్నాయని ప్రశంసించారు. ఆత్మనిర్భర్ భారత్ కలను సాకారం చేస్తున్నాయని కూడా చెప్పారు. సిపెట్‌లు నైపుణ్యమైన మానవ వనరులను అందించడం ద్వారా మాత్రమే కాకుండా, పరిశోధనలు & ఉత్పత్తుల ద్వారా కూడా పరిశ్రమకు సాయం చేస్తున్నాయని వెల్లడించారు.

సిపెట్‌ నుంచి శిక్షణ పొందిన యువతలో దాదాపు అందరికీ పెట్రో రసాయనాల రంగంలో ఉద్యోగాలు పొందుతున్నారని మంత్రి చెప్పారు. సిపెట్‌, తొలుత, 1968లో చెన్నైలో సెంట్రల్ ప్లాస్టిక్ ఇంజినీరింగ్ & టూల్ ఇన్‌స్టిట్యూషన్‌గా ప్రారంభమైంది. అప్పట్లో సిపెట్‌ కింద సర్టిఫికెట్, డిప్లొమా కోర్సులు మాత్రమే ఉండేవి. ఇప్పుడు ఆ కోర్సుల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, పీహెచ్‌డీ స్థాయి కోర్సులను కూడా ఈ సంస్థలు అందిస్తున్నాయి.

స్వయంసమృద్ధిగా మారేందుకు, పరిశోధన & ఆవిష్కరణలకు సిపెట్‌లు పెద్దపీట వేస్తున్నట్లు డా.మాండవీయ చెప్పారు. పరిశ్రమ అవసరాలను అర్థం చేసుకుని, తదనుగుణంగా పరిశోధనలు చేస్తున్నాయన్నారు. దీనివల్ల, సౌర బ్యాటరీలు, వాయు సంలీనం, నీటి శుద్ధి, పాలిమర్ పరిశోధనల్లో పరిశోధనలు కొత్త పుంతలు తొక్కుతున్నాయని అన్నారు.

 

సిపెట్‌: సీఎస్‌టీఎస్‌ - బద్ది (హిమాచల్‌ప్రదేశ్)

  1. పాలిమర్/ప్లాస్టిక్స్ & అనుబంధ పరిశ్రమల మానవ శక్తి అవసరాలను తీర్చేందుకు, ప్రత్యేకంగా రూపొందించిన కోర్సుల ద్వారా నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ.
  2. విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి నిర్వహిస్తున్న దీర్ఘకాల కోర్సులు:
              • డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ మోల్డ్ టెక్నాలజీ (డీపీటీఎం)
              • డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ టెక్నాలజీ (టీపీటీ)
              • పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ ప్రాసెసింగ్ & టెస్టింగ్ (పీజీడీ-పీపీటీ)
  3. సాంకేతికత సేవల మద్దతు ద్వారా ఆ ప్రాంతంలో పాలిమర్ & అనుబంధ పరిశ్రమలకు ప్రోత్సాహం.
  4. శిక్షణ పొందిన విద్యార్థులకు ఉద్యోగాలు/స్వయం ఉపాధి కల్పించేలా ప్రయత్నాలు.

భూమి & భవనం స్థితి:

  1. హిమాచల్‌ప్రదేశ్‌లోని బద్దిలో సిపెట్‌ కేంద్రం ఏర్పాటు కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం 12.43 ఎకరాల భూమిని ఉచితంగా అందించింది.
  2. సిపెట్‌ బద్ది కేంద్రానికి 27 ఏప్రిల్ 2016న శంకుస్థాపన జరిగింది.

 

సిపెట్‌: సీఎస్‌టీఎస్‌ గ్వాలియర్

ఈ కేంద్రం 2016లో ప్రారంభమైంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందించిన తాత్కాలిక ప్రాంగణంలో నడుస్తోంది.

భూమి & భవనం స్థితి:

  1. ప్రాజెక్టు ప్రాథమిక వ్యయం రూ.40.10 కోట్లు. ఈ మొత్తాన్ని మధ్యప్రదేశ్ ప్రభుత్వం & భారత ప్రభుత్వం 50:50 ప్రాతిపదికన భరించాయి.

 

  1. మధ్యప్రదేశ్ ప్రభుత్వం గ్వాలియర్‌లోని మహారాజ్‌పురా గ్రామం వద్ద మొదట 10 ఎకరాల భూమిని కేటాయించింది, ఆ తర్వాత మరో 15 ఎకరాలు ఇచ్చింది.

 

  1. సిపెట్‌ గ్వాలియర్ కోసం భవన నిర్మాణం కోసం గ్వాలియర్‌లోని 'ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్'ను (ఐఐడీసీ) ఆ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. 2019 జనవరిలో నిర్మాణం ప్రారంభమైంది.

 

  1. విద్య & నిర్వహణ భవనాలు, ఒక సాంకేతిక భవనం, భోజనశాల, సిబ్బంది నివాసాలు, విద్యార్థుల వసతి గృహం కలిపి మొత్తం నిర్మాణ విస్తీర్ణం సుమారుగా 9,319.52 చదరపు మీటర్లు.

 

  1. పైన చెప్పిన ప్రాంతంలో 3,861.255 చదరపు మీటర్ల విస్తీర్ణంలో సాంకేతిక భవనం ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది.

 

  1. విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి నిర్వహిస్తున్న దీర్ఘకాల కోర్సులు:
      • డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ మోల్డ్ టెక్నాలజీ (డీపీటీఎం)
      • డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ టెక్నాలజీ (టీపీటీ)

 

  1. పాలిమర్/ప్లాస్టిక్స్ & అనుబంధ పరిశ్రమల మానవశక్తి అవసరాలను తీర్చడానికి ప్రత్యేకంగా రూపొందించిన కోర్సుల ద్వారా నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ.

 

  1. సాంకేతికత సేవల మద్దతు ద్వారా ఆ ప్రాంతంలో పాలిమర్ & అనుబంధ పరిశ్రమలకు ప్రోత్సాహం.

 

సిపెట్‌ సీఎస్‌టీఎస్‌, రాంచీ (జార్ఖండ్)

  1. పాలిమర్/ప్లాస్టిక్స్ & అనుబంధ పరిశ్రమల మానవశక్తి అవసరాలను తీర్చడానికి ప్రత్యేకంగా రూపొందించిన కోర్సుల ద్వారా నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ.
  2. విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి నిర్వహిస్తున్న దీర్ఘకాల కోర్సులు:
              • డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ మోల్డ్ టెక్నాలజీ (డీపీటీఎం)
              • డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ టెక్నాలజీ (టీపీటీ)
  3. సాంకేతికత సేవల మద్దతు ద్వారా ఆ ప్రాంతంలో పాలిమర్ & అనుబంధ పరిశ్రమలకు ప్రోత్సాహం.
  4. శిక్షణ పొందిన విద్యార్థులకు ఉద్యోగాలు/స్వయం ఉపాధి కల్పించేలా ప్రయత్నాలు.

భూమి & భవనం స్థితి:

  1. జార్ఖండ్‌లో సిపెట్‌ కేంద్రం ఏర్పాటు కోసం రాంచీలోని హెహల్‌లో 12.82 ఎకరాల స్థలాన్ని, 6,319 చదరపు మీటర్ల విస్తీర్ణంలోని భవనాలను జార్ఖండ్ ప్రభుత్వం ఉచితంగా అందించింది.
  2. సిపెట్‌ రాంచీ కేంద్రానికి 15 మే 2017న శంకుస్థాపన జరిగింది.
  3. సిపెట్‌ రాంచీలో తరగతులు జరుగుతున్నాయి. ఇక్కడ తరగతి గదులతో కూడిన ఒక పరిపాలనా భవనం & బాలుర వసతి గృహం ఉన్నాయి.
  4. యంత్రాల ఏర్పాటు కోసం తాత్కాలికంగా ఒక నిర్మాణం చేపట్టారు. ఇక్కడ శిక్షణ & సాంకేతికత సేవలు ప్రారంభమయ్యాయి.
  5. శిక్షణకు అవసరమైన యంత్రాలు, పరికరాలు ఈ కేంద్రంలో ఉన్నాయి. ప్రస్తుతం, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. 2020-21 విద్యా సంవత్సరం నుంచి డిప్లొమా కోర్సులు ప్రారంభమయ్యాయి.

 

***


(Release ID: 2011592) Visitor Counter : 100


Read this release in: English , Urdu , Hindi