ఆయుష్
azadi ka amrit mahotsav

దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ఎయిమ్స్ లో ఆయుష్ - ఐసీఎంఆర్ అడ్వాన్స్డ్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటివ్ హెల్త్ రీసెర్చ్ (ఏఐ-ఏసీఐహెచ్ఆర్) ను ప్రారంభించనున్న కేంద్ర ఆయుష్, ఆరోగ్య మంత్రులు


రక్తహీనతపై మల్టీ సెంటర్ క్లినికల్ ట్రయల్స్ పై ప్రకటన
ఆయుష్ ఆరోగ్య సౌకర్యాల కోసం ప్రజారోగ్య ప్రమాణాలు
రాష్ట్రీయ ఆయుర్వేద విద్యాపీఠ్ 27వ స్నాతకోత్సవం ప్రారంభం

Posted On: 03 MAR 2024 6:35PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 4 ఎయిమ్స్ లో ఏర్పాటు చేసిన 5 ఆయుష్ - ఐసీఎంఆర్ అడ్వాన్స్డ్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటివ్ హెల్త్ రీసెర్చ్ (ఏఐ-ఏసీఐహెచ్ఆర్) ను రేపు కేంద్ర ఆయుష్, ఓడరేవులు, షిప్పింగ్జలమార్గాల మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ , కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, రసాయనాలు, ఎరువుల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ రేపు ప్రారంభిస్తారు.  రక్తహీనతపై  మల్టీ సెంటర్ క్లినికల్ ట్రయల్ ను కూడా కేంద్ర మంత్రులు ప్రారంభిస్తారు. ఆయుష్ ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల కోసం రూపొందించిన ప్రజారోగ్య ప్రమాణాలను మంత్రులు విడుదల చేస్తారు.  రాష్ట్రీయ ఆయుర్వేద విద్యాపీఠ్ 27 వ స్నాతకోత్సవం లో మంత్రులు పాల్గొంటారు.

i. ఢిల్లీ ఎయిమ్స్:  

ఎ . గ్యాస్ట్రో-ఇంటెస్టినల్ డిసీజెస్‌లో అధునాతన ఇంటిగ్రేటివ్ హెల్త్ రీసెర్చ్   కేంద్రం

బి. మహిళలు, పిల్లల ఆరోగ్యంలో అధునాతన సమగ్ర ఆరోగ్య పరిశోధన కేంద్రం 

ii. ఎయిమ్స్ -జోధ్‌పూర్: వృద్ధాప్య ఆరోగ్యంలో అధునాతన సమగ్ర ఆరోగ్య పరిశోధన కేంద్రం 

iii. ఎయిమ్స్ నాగ్‌పూర్: క్యాన్సర్ కేర్‌లో  అధునాతన సమగ్ర ఆరోగ్య పరిశోధన కేంద్రం 
iv. ఎయిమ్స్  రిషికేశ్: వృద్ధాప్య ఆరోగ్యంలోఅధునాతన సమగ్ర ఆరోగ్య పరిశోధన కేంద్రం 

రక్తహీనతపై మల్టీ సెంటర్ క్లినికల్ ట్రయల్ పై ప్రకటన

ఆయుష్ మంత్రిత్వ శాఖ, ఐసిఎంఆర్ ఆధ్వర్యంలో రక్తహీనతపై  సిసిఆర్ఎఎస్ పరిశోధన నిర్వహించింది.  "పునరుత్పత్తి వయస్సు గల గర్భిణీ కాని మహిళల్లో మితమైన ఇనుము లోపం రక్తహీనత చికిత్సలో ఐరన్ ఫోలిక్ యాసిడ్ తో పోలిస్తే పునర్నవాడి మండూరా  సమర్థత , భద్రత " అనే శీర్షికతోఈ  అధ్యయనాన్ని చేపట్టింది. సామాజిక  ఆధారిత త్రీ ఆర్మ్ మల్టీ సెంటర్ విధానంలో అధ్యయనం నిర్వహించారు. అధ్యయనం ఫలితాలను   ఎంజీఐఎంఎస్ వార్ధా, ఎయిమ్స్ జోధ్పూర్, ఎన్ఐటీఎం బెంగళూరు, రిమ్స్ రాంచీ, కేఈఎం హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్, న్యూఢిల్లీ ఎయిమ్స్, ఎయిమ్స్ భోపాల్, బీబీనగర్ ఎయిమ్స్ లో విశ్లేషిస్తారు. 

ఆయుష్ ఆరోగ్య సౌకర్యాల కోసం ప్రజారోగ్య ప్రమాణాల ఆవిష్కరణ 

మౌలిక సదుపాయాలు, మానవ వనరులు, ఔషదాలు లాంటి వివిధ అంశాలపై దేశవ్యాప్తంగా ప్రమాణాలు నిర్ణయించారు. ఈ ప్రమాణాలనుఅమలు చేయడం  ద్వారా, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అర్హులైన ప్రజలకు  నాణ్యమైన ఆయుష్ ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడానికి అవకాశం కలుగుతుంది. . రాజీలేని నాణ్యతకు ప్రాధాన్యమిస్తూ ప్రజారోగ్య రంగంలో నివారణ, ప్రోత్సాహక, నివారణ, ఉపశమన, పునరావాస సేవలు పెంపొందించడం లక్ష్యంగా ప్రమాణాలు అమలు జరుగుతాయి. బహుళత్వం ఆశయానికి ప్రాధాన్యత ఇస్తూ జాతీయ ఆరోగ్య విధానం 2017 రూపొందింది. 

రాష్ట్రీయ ఆయుర్వేద విద్యాపీఠ్ 27వ స్నాతకోత్సవం మరియు 29వ జాతీయ సెమినార్ ప్రారంభం

గురు శిష్య పరంపర కింద విద్య పూర్తి చేసుకున్న  201 మందికి   సీఆర్వీ సర్టిఫికెట్ లు ప్రదానం చేస్తారు.  ఆయుర్వేద అభ్యున్నతికి విశేష కృషి చేసిన ప్రముఖ వైద్యులకు ఫెలో ఆఫ్ ఆర్ ఏవీ (ఎఫ్ ఆర్ ఏవీ), జీవిత సాఫల్య పురస్కారం అందజేయనున్నారు. 2024-25 బ్యాచ్  విద్యార్థులకు శిశుపనానియా సంస్కారం (స్వాగత కార్యక్రమం) జరుగుతుంది. . ఆయుర్వేదం ద్వారా ఒక ఆరోగ్యం/కరోనా అనంతర నిర్వహణ/రోగనిరోధక శక్తి అనే అంశంపై "ఆయుర్వేద అమృతం" పేరిట ఆయుర్వేదంపై రెండు రోజుల జాతీయ సెమినార్ జరుగుతుంది. 

***


(Release ID: 2011442) Visitor Counter : 100


Read this release in: English , Urdu , Hindi , Tamil