విద్యుత్తు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కర్బన రహిత వ్యవస్థలో భారతీయ కర్బన్ మార్కెట్ శక్తి,ఇంధన పరివర్తనలో ఇ మొబిలిటి పాత్ర పై 22 వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా చర్చించనున్న ఇంధన సమర్థతా బ్యూరో


దేశవ్యాప్తంగా విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు విద్యుత్ వాహనాల నమూనా విధానాన్ని సూచించిన బిఇఇ డైరక్టర్ జనరల్

Posted On: 02 MAR 2024 5:24PM by PIB Hyderabad

‘‘వాతావరణ కార్యాచరణపై భారత కార్బన్ మార్కెట్ పరివర్తనాత్మక ప్రభావం కలిగి ఉంటుంది’’

దేశ సేవలో 22 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ పరిధిలోని ఇంధన సమర్థతా బ్యూరో (బిఇఇ)  వివిధ ప్రభుత్వవిభాగాలు, పరిశ్రమ వర్గాలను ఆహ్వానించి 2024  మార్చి 1న న్యూఢిల్లీలో వ్యవస్థాపక దినోత్సవ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. 22వ వ్యవస్థాపక దినోత్సవ థీమ్ కింద ‘‘ఇండియాలో కర్బన రహిత చర్యలు, విద్యుదీకరణ ద్వారా ఇంధన పరివర్తన ”అంశాన్ని ఎంచుకున్నారు. ఈ కార్యక్రంలో కేంద్ర విద్యుత్, నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి శ్రీ ఆర్.కె. సింగ్, బిఇఇ సంస్థ వినూత్న, ప్రపంచానికే ఆదర్శవంతమైన కార్యక్రమాలు చేపడుతుండడంపట్ల అభినందనలు తెలిపారు. దేశ కర్బనలోడ్ను తగ్గించడంలో బిఇఇ పాత్రను మంత్రి ప్రశంసించచారు. ప్రధనాంగా బిఇఇ కృషి కారణంగా 11 సంవత్సరాలకు ముందే దేశ జిడిపిలో ఉద్గారాల తీవ్రతను ఎన్.డి.సి లక్ష్యాకు అనుగుణంగా తగ్గించగలిగినట్టు మంత్రి తెలిపారు. ఈ సందర్బంగా  మంత్రి బిఇఇ ప్రమాణాలు లేబిలింగ్ ప్రోగ్రాంలను ప్రారంభించారు. ఇందులో ఒకటి పాకేజ్డ్ బాయిలర్లకు సంబంధించినది కాగా , మరొకటి వాణిజ్యపరమైన బెవరేజ్ కూలర్లకు సంబంధించినది.దీనిని విసి కూలర్ (లేదా బెవరేజ్ కూలర్) అంటారు. అలాగే మంత్రి, ఇండియా ఇవి డైజెస్ట్ను, స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్ను ఐదవ ఎడిషన్ ను విడుదల చేశారు.

ఈ ఉత్సవాల సందర్భంగా ఎలక్ట్రిక్ మొబిలిటి, ఎలక్ట్రిక్ కుకింగ్లపై ఎగ్జిబిషన్ ను నిర్వహించారు. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు, ఇళ్లలో సమర్ధంగా ఇంధన పొదుపుతో వంట తయారు చేసుకోవడాన్ని ప్రోత్సహించేందుకు దీనిని నిర్దేశించారు.

బిఇఇ 22వ వ్యవస్థాపక దినోత్సవం సందర్బంగా పలు ముఖ్యమైన అంశాలపై చర్చలు కూడ జరిపారు. భారత ఆర్థిక వ్యవస్థపై ఇంధన భారాన్ని తగ్గించడానికి సంబంధించిన అంశాలను ఇందులో చర్చించారు.

విద్యుదీకరణ ద్వారా రవాణా రంగంలో ఇంధన పరివర్తన:

ఇంధన పరివర్తనకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలలో భాగంగామొదటి ప్యానల్ చర్చలో రవాణారంగంలో ఇంధన పరివర్తనకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి చర్చించారు. ఈ పరివర్తనకు అనసరిస్తున్న విధానాలు, రెగ్యులేటరీ ఏర్పాట్లు, వినియోగదారులకు తక్కువ ధరకు విద్యుత్ వాహనాలు అందుబాటులోకి రావడం వంటి విషయాలను చర్చలో పాల్గొన్నవారు ప్రస్తావించారు.. 

‘‘33 రాష్ట్రాలలో ఆయా రాష్ట్రాలకు ప్రత్యేకమైన ఇవి పాలసీలు’’

 

నీతి ఆయోగ్ సలహాదారు శ్రీ సుధేందు జ్యోతి సిన్హా పానెల్ చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ, విద్యుత్ వాహనాల(ఇవిల) వినియోగానికి సంబంధించి ఆయా రాష్ట్రాలు సాధించిన ప్రగతి గురించి ప్రస్తావించారు. 36 రాష్ట్రాలలో 33 రాష్ట్రాలు , ఆయా రాష్ట్రాలకు ప్రత్యేకమైన ఇవి పాలసీలను రూపొందించుకున్నట్టు తెలిపారు.ఈ విషయంలో పరస్పర సమష్టి కృషి అవసరాన్ని గురించి ప్రస్తావిస్తూ రాష్ట్రస్థాయిలో పటిష్ట అమలుతోనే వీటి విజయం ఆధారపడి ఉంటుందని చెప్పారు.

‘‘దేశవ్యాప్తంగా అనుసరించేందుకు నమూనా ఇవి పాలసీ’’

పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ వాహనాల వాడకం అవసరం గురించి బిఇఇ డైరక్టర్ జనరల్ శ్రీ అభయ్ బాక్రే మాట్లాడుతూరాష్ట్రాలలో సానుకూల ఇవి విధానాలు ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. నమూనా ఇవివి విధానాన్ని దేశవ్యాప్తంగా అమలులోకి తెచ్చేందుకు బిఇఇ, నీతి ఆయోగ్ మధ్య సమన్వయాన్ని ఆయన ప్రతిపాదించారు. దీనికితోడు విద్యుత్ తక్కువ ధరకు అందుబాటులోకి రావలసిన అవసరాన్ని ప్రస్తావిస్తూ ఇవి వాహనాలు వాడే వారికి ఆర్థిక ప్రోత్సాహకాలు ఇవ్వాలని , తయారీ దారులకు విధానపరమైన మద్దతు నివ్వాలని సూచించారు.

ఇ మొబిలిటి విషయంలో తెలంగాణా రాష్ట్రం సాధించిన అద్బుత విజయాన్ని ఆయన ప్రస్తావించారు. తెలంగాణా పునరుత్పాదక ఇంధన అభివృద్ధి కార్పొరేషన్ మేనేజింగ్ డైరక్టర్ శ్రీ ఎన్.జానయ్య మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్రంలో ఇవి వాహనాల సెగ్మెంట్లో చెప్పుకోదగిన స్థాయిలో 15 నుంచి 16 శాతం వృద్ధి కనిపించినట్టు తెలిపారు.

ఎలక్ట్రిక్వాహనాల చార్జింగ్కు మౌలికసదుపాయాల కల్పనకు సబ్సిడీ, రోడ్ టాక్స్ మినహాయింపు,హైదరాబాద్ సమీపంలో ఈ మొబిలిటీ వ్యాలీ అభివృద్ధి వంటి వాటి విషయంలో తెలంగాణా ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఆయన వివరించారు. ఐసిఇ రెట్రోఫిట్టింగ్ ఆటోల విషయంలో తెలంగాణా చురుకుగా పనిచేస్తున్నదని, వందకు పైగా ఎలక్ట్రిక్ బస్సులు తెలంగాణాలో నడుస్తున్నాయని ఆయన తెలిపారు.

మైక్రో మొబిలిటిఈ –సైకిళ్లు: 

 

ఇంధన సమర్థత సర్వీసెస్ లిమిటెడ్ డిజిఎండాక్టర్ రితు సింగ్ మాట్లాడుతూ, మైక్రో మొబిలిటీ గురించి, ప్రత్యేకించి ఎలక్ట్రిక్ సైకిళ్లను అటు పట్టణాలు,ఇటు గ్రామీణ ప్రాంతాలలో వాడకం గురించి ప్రస్తావించారు.ఈ సైకిళ్ల వాడకానికి సంబంధించి విధానపరమైన నిర్ణయాల ఆవశ్యకత గురించి  ఆయన ప్రస్తావించారు. ఈ సైకిళ్లు అందుబాటు ధరలో ఉండాల్సిన ఆవశ్యకతను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు.ఇందుకు సంబంధించి కేంద్ర , రాష్ట్రప్రభుత్వాలు విధానపరమైన నిర్ణయాలు చేపట్టాలని సూచించారు.

అందుబాటు ధర, విధానపరమైన మద్దతు, ప్రమాణాలు ముఖ్యం:శ్రీఅశోక్కుమార్

 

ఈ మొబిలిటికి సంబంధించి వాహనాల ధరలు అందుబాటులో ఉండాల్సిన ఆవశ్యకత గురించి  కేంద్ర ఎలక్ట్రిసిటీ అథారిటీ సభ్యుడు (పవర్ సిస్టమ్) శ్రీ అశోక్ కుమార్ రాజ్పుత్ మాట్లాడుతూ ,వాహనాల ధర అందుబాటులో ఉండడం, విధానపరమైన మద్దతు అవసరమని అన్నారు. ఈ –మొబిలిటీ ఉత్పత్తుల భద్రత, నాణ్యత విషయంలో ప్రమాణాలు పాటించడం ఎంతో అవసరమని ఆయన అన్నారు. ఇందుకు వనరుల విషయంలో వ్యూహాత్మక ప్లానింగ్ అవసరమన్నారు. ప్రత్యామ్నాయ సాంకేతికతలను అందిపుచ్చుకోవాలని భారీ వాహనాల విషయంలో హైడ్రోజన్ అప్లికేషన్ను అందిపుచ్చుకోవాలని సూచించారు. చర్చల ఉమ్మడి సారాంశాన్ని  ప్రస్తావిస్తూ ప్యానలిస్టులు,సమష్టికృషి, తగిన మద్దతుతో కూడిన విధానాలు, వ్యూహాత్మక ప్రణాళిక వంటివి ఇండియాను ఎలక్ట్రిక్మొబిలిటీవైపు విజయవంతంగా పరివర్తన చెందిస్తాయన్నారు.

భారత కార్బన్ మార్కెట్  ద్వారా వాతావరణంలో  కర్బన ఉద్గారాల తగ్గింపు వేగం పెంపు:

 

మరో ప్యానల్ చర్చా కార్యక్రమంలో ఇండియన్ కార్బన్ మార్కెట్ ద్వారా, వాతావరణంలో కర్బన ఉద్గారాల తగ్గింపు వేగాన్ని పెంచడంపై చర్చించారు. ఈ సమావేశానికి కేంద్ర పర్యావరణ, అడవులు, వాతావరణ వార్పుల మంత్రిత్వశాఖ పూర్వ ప్రత్యేక కార్యదర్శి శ్రీ ఆర్.ఆర్. రష్మి అధ్యక్షత వహించారు. ఈ చర్చా కార్యక్రమం పలు కీలక అంశాలను చర్చించింది. ప్రస్తుత భారత కార్బన్ మార్కెట్గురించి, పారిస్ ఒప్పందంలోని ఆర్టికల్ 6.4 కు సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న సంప్రదింపుల గురించి ఇందులో చర్చించారు.

గ్రిడ్ కంట్రోలర్ఆఫ్ ఇండియా (జిఐసి) డైరక్టర్ (మార్కెట్ ఆపరేషన్స్) శ్రీ ఎస్.ఎస్. బారపండా మాట్లాడుతూ కార్బన్ మార్కెట్ రిజిస్ట్రీ కీలకపాత్ర గురించి ప్రస్తావించారు. ఇది మార్కెట్ పారదర్శకతకు తోడ్పడుతుందన్నారు. జిఐసి కంట్రిబ్యూషన్లగురించి ప్రస్తావిస్తూ విజయవంతమైన మార్కెట్ యంత్రాంగానికి రిజిస్ట్రీ కీలకపాత్ర పోషించాలన్నారు.

వాతావరణ కార్యాచరణపై భారత కార్బన్ మార్కెట్ పరివర్తనాత్మక  ప్రభావాన్ని చూపుతుంది: శ్రీ సురభ్ దిద్ది

 

భారత కార్బన్ మార్కెట్ (ఐసిఎం) వెనుకగల ఫ్రేమ్వర్క్ గురించి బిఇఇ డైరక్టర్ ,శ్రీసురభ్ దిద్ది వివరించారు. ఇందుకు సంబంధించిన యంత్రాంగం ,అమలు ప్రతిపాదనలను ప్రస్తావించారు. ఐసిఎం నెట్ జీరో లక్ష్యాలను అటు పరిశ్రమలు, ఇటు కార్పొరేట్ సంస్థలు సాధించడంలో కీలకమన్నారు. వాతావరణ కార్యాచరణపై భారత కార్బన్ మార్కెట్ పరివర్తనాత్మక ప్రభావాన్ని చూపుతుందని వారు స్పష్టం చేశారు. స్వచ్ఛంద కార్బన్క్రెడిట్లకు డిమాండ్ పెంపు:

ప్రపంచబ్యాంకు కు చెందిన కార్బన్ మార్కెట్స్ఫైనాన్స్, క్లైమేట్ ఫైనాన్స్, ఎకనమిక్స్కు చెందిన శ్రీ చంద్రశేఖర్ సిన్హా మాట్లాడుతూ, కార్బన్ మార్కెట్ విషయంలో ప్రపంచబ్యాంకు అందిస్తున్న సహకారం గురించి ప్రస్తావించారు.మార్కెట్, పరస్పరాధారత వ్యవస్థ వంటివాటిగురించి మాట్లాడారు. అమలుకు సంబంధించిన పటిష్ట వ్యవస్థల ద్వారా స్వచ్ఛంద కార్బన్ క్రెడిట్ కు సంబంధించి డిమాండ్ ఏర్పడుతుందన్నారు. ఇందుకు ప్రత్యేక యంత్రాంగం విషయంలో ఇండియా కీలక పాత్ర పోషిస్తున్నదని, ఇది వర్ధమాన దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నదని అన్నారు.

టాటా స్టీలుకు చెందిన మనీష్ మిశ్రావేదాంత రిసోర్సెస్కు చెందిన శ్రీ గౌరవ్ సరూప్లు కార్బన్ మార్కెట్ ప్రాధాన్యత గురించి ప్రస్తావించారు. ఈ దిశగా పరిశ్రమ చేస్తున్న కృషిని పేర్కొన్నారు. పిడబ్ల్యుసి కి చెందిన శ్రీ రాజీవ్ రతన్ బ్లాక్ చెయిన్ సాంకేతికత, ఇంటర్నెట్ఆఫ్ థింగ్స్ వంటి వాటి  పాత్ర గురిఇంచి ,భారత కార్బన్ మార్కెట్లో పారదర్శకత, జవాబుదారిత్వం గురించి వివరించారు.

ఈ రెండు సాంకేతిక సెషన్లు ప్రశ్నలుజవాబుల సెషన్లను నిర్వహించాయి, ఇది ఆలోచనలు పంచుకునేందుకు చక్కని వేదికగా ఉపయోగపదింది. ఇంధన సామర్ధ్య బ్యూరో కొలాబరేషన్లు చేపట్టడంలో, విధాన నిర్ణాయలకు మద్దతునివ్వడంలో,వ్యూహాత్మక ప్రణాళికలో,ఇండియాలో సుస్థిర పరివర్తనాత్మక ఇంధన విధానల అమలులో మరింత పట్టుదలతో ముందుకు సాగిపోతున్నది.

***


(Release ID: 2011132) Visitor Counter : 189


Read this release in: English , Urdu , Hindi