ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ పాలకమండలి సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన డా. మన్‌సుఖ్ మాండవీయ
వైద్య ఆరోగ్య పరిశోధన పట్ల మా నిబద్ధతను ప్రదర్శిస్తూ గత 10 ఏళ్లల్లో నాలుగు రెట్లు పెరిగిన ఐసిఎంఆర్ బడ్జెట్ మొత్తం ః డా, మన్‌సుఖ్ మాండవీయ
జాతీయ ప్రాధాన్యత కలిగిన ఆరోగ్య సమస్యలను పరిష్కరించడంలో విశేషమైన పురోగతిని చూపడమే కాక అర్థవంతమైన, ప్రభావవంతమైన పరిశోధనను ప్రోత్సహించేందుకు అంతర్ విభాగ చొరవకు శ్రీకారం చుట్టిన ఐసిఎంఆర్
Posted On:
02 MAR 2024 7:14PM by PIB Hyderabad
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డా. మన్‌సుఖ్ మాండవీయ నేడు న్యూఢిల్లీలో జరిగిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) పాలకమండలి సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి కేంద్ర ఆరోగ్య& కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డా. భారతి ప్రవీణ్ పవార్ కూడా హాజరయ్యారు. ఇటీవలి కాలంలో ఐసిఎంఆర్ సహకారాలకి, మండలి నేతృత్వంలో చొరవలను అన్వేషించేందుకు, వైద్య పరిశోధన భవిష్యత్ కోసం వ్యూహాత్మక రోడ్‌మ్యాప్‌కు రూపురేఖలను ఇవ్వడంపై చర్చించేందుకు ఈ సమావేశాన్ని నిర్వహించారు.
దేశంలో వైద్య పరిశోధన, అభివృద్ధిని నడిపించేందుకు చొరవలను, ఐసిఎంఆర్ కీలక పురోగతులను డా. మాండవీయ ప్రశంసించారు. ఐసిఎంఆర్ అవిశ్రాంత ప్రయత్నాలతో పాటు భారత ప్రభుత్వ నిబద్ధత, వైద్య పరిశోధన, అభివృద్ధిలో భారతదేశాన్ని ప్రపంచవేదికపై అగ్రగామిగా నిలుపుతుందని ఆయన నొక్కి చెప్పారు.
ఐసిఎంఆర్ పరిశోధన పురోగతి పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తూ వైద్య ఆవిష్కరణలో భారత్ ప్రపంచ అంచనాలను అందుకునేందుకు మారుతున్న కాలానికి అనుగుణంగా పని చేయవలసిందిగా కౌన్సిల్‌కు విజ్ఞప్తి చేశారు. సరసమైన ధరలలో దేశీయ వైద్య పరికారలను అభివృద్ధి చేయడంలో ప్రైవేటు రంగానికి మద్దతునివ్వాలనే లక్ష్యంతో ఇటీవలే ప్రారంభించిన మెడిటెక్ మిత్రా చొరవను ప్రశంసించారు.
ఐసిఎంఆర్-డిబిటి-ఆయుష్‌తో పాటు జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థల (ఐఎన్ఐలు) సహకారంతో సంప్రదాయ విజ్ఞానాన్ని ఉపయోగించుకోవలసిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ప్రభ/త్వం, ప్రైవేట్ రంగానికి మధ్య సహకారం, విద్య, పరిశోధన సంస్థలకు వ్యవస్థాపకతా విధానానికి మద్దతునివ్వాల్సిన కీలక ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. దేశంలో పరిశోధన& ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థలను పెంపొందించే దిశగా ప్రభుత్వ తిరుగులేని మద్దతుకు డా. మాండవీయ హామీ ఇచ్చారు.
ఐసిఎంఆర్ పురోగమన కృషిని ప్రశంసిస్తూ, లక్ష్యిత పరిశోధనల కోసం ఇతర విభాగాలతో సహకార ప్రాముఖ్యతను డా. భారతి ప్రవీణ్ పవార్ నొక్కి చెప్పారు. మారుమూల ప్రాంతాలకు చేరుకునేందుకు ఎఐ ఆధారిత ఆరోగ్య పరిష్కారల ఆవశ్యకతను ఆమె పట్టి చూపుతూ, ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రపంచ ఔచిత్యం, పోటీతత్వం కలిగి ఉండాలని పిలుపిచ్చారు.
త్వరలో చేపట్టనున్న చొరవల గురించి మాట్లాడుతూ, ప్రపంచంలో తొలిసారి విజ్ఞానం పై బయోమెడికల్ ఉత్పత్తులను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఐసిఎంఆర్ చేపట్టిన విశిష్ట చొరవ, ఫస్ట్ ఇన్ ది వరల్డ్ ఛాలెంజ్ (ప్రపంచంలోనే మొదట సవాలు) ను ఆరోగ్య పరిశోధన విభాగం కార్యదర్శి, ఐసిఎంఆర్ డిజి డా. రాజీవ్ బాల్ పట్టి చూపారు. అధిక సాహసం & అధిక పారితోషకం పరిశోధనలు నిర్వహించడానికి అద్భుతమైన ఆలోచనలతో భారతీయ శాస్త్రవేత్తలకు పెట్టిన పోటీకి నిధులు సమకూరుస్తుందని ఆయన చెప్పారు. నవీన ఎంపిక పద్ధతి ద్వారా ఐడియాలకు నిధులు సమకూరుస్తారని, ఇది భారతీయ బయోమెడికల్ పరిశోధకులలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు తోడ్పడుతుందని ఆయన అన్నారు.
సమావేశంలో పట్టి చూపిన కీలక విజయాలు ఈ విధంగా ఉన్నాయిః
పెట్టుబడులలో నాలుగురెట్ల పెంపుః గత దశాబ్దకాలంలో వైద్య పరిశోధన, అభివృద్ధిలో పెట్టుబడిని భారత ప్రభుత్వం నాలుగురెట్లు పెంచింది.
విస్త్రత ప్రభావంః ఇటీవలే ప్రారంభించిన జాతీయ ఆరోగ్య పరిశోధన కార్యక్రమం ద్వారా, 12 ప్రాధాన్యత ప్రాంతాలలో/ రంగాలలో పరిష్కార ఆధారిత మిషన్ పద్ధతిలో పరిశోధనను నిర్వహించేందుకు ఒక నవీన చొరవను దేశవ్యాప్తంగా దాదాపు 100 జిల్లాలకు ఐసిఎంఆర్ విస్తరించింది.
బహుళ విభాగాల మధ్య సహకారాలుః నీతీ ఆయోగ్, సిడిఎస్‌సిఒ, సిఎస్ఐఆర్, ఐఐటిలు, డిబిటి, ఎన్ఐపిఇఆర్‌లు, ఐసిఎఆర్, డిడబ్ల్యుసిడి, ఇతర ప్రముఖ సంస్థలతో బహువిభాగాల సహకారానికి ఐసిఎంఆర్ శ్రీకారం చుట్టింది. దీని ఫలితంగా నేషనల్ వన్ హెల్త్ మిషన్, ఆయుష్- ఐసిఎంఆర్ ట్రయల్స్, ఎసిఎస్ఐఆర్- ఐసిఎంఆర్ వైద్య పరిశోధన ఫ్యాకల్టీ, పాల్నా పథకం, పలు రకాల కాన్సర్లకు ఐసిఎంఆర్- జాతీయ కాన్సర్ గ్రిడ్ క్లినికల్ ట్రయల్స్ సహా ఉమ్మడి చొరవలకు ఆస్కారం ఇచ్చింది.
దేశంలో ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థను పెంచిపోషించడంః దేశంలో ఆవిష్కరణ పర్యావరణ వ్యవస్థను పెంచిపోషించే దిశగా బెంచ్‌టాప్ టెస్టింగ్ (పరికరాల నమూనా రూపొందించే ప్రక్రియలో కీలక అడుగు), చికిత్సకు ముందు, చికిత్స మూల్యాంకనం, ధృవీకరణకు అంకితమైన ఉత్సత్తుల అభివృద్ధి కోసం 7 ఐఐటిలలో ఐసిఎంఆర్ సెంటర్స్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లను, 5 ఐసిఎంఆర్- అత్యాధునిక పరిశోధన కేంద్రాలు (సిఎఆర్)ను ఏర్పాటు చేసింది. ఈ చొరవ ఎఐ ఆధారిత ఆరోగ్య పరిష్కారాలను ప్రోత్సహిస్తూనే మెడ్‌టెక్ రంగంలో మేక్ ఇన్ ఇండియాకు తోడ్పాటునందించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. అదనంగా, నీతీ ఆయోగ్ మార్గదర్శనంలో, కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సిడిఎస్‌సిఒ) భాగస్వామ్యంతో ఐసిఎంఆర్ నేతృత్వం వహిస్తున్న మెడ్‌టెక్ మిత్రా చొరవ ఆవిష్కర్తలకు కీలక మద్దతును అందించడంతో పాటుగా, వ్యూహాత్మక తోడ్పాటుతో సరసమైన ధరలో, అందుబాటులో దేశీయ వైద్య పరికరాల అభివృద్ధిని సులభతరం చేయడం, చకిత్సా మూల్యాంకనం, నియంత్రిత సౌలభ్యం, మరిన్ని మెరుగుదలలతో జరుగుతుండగా ఉత్పత్తి వినియోగంలో మార్గదర్శనానికి కీలక మద్దతును అందిస్తుంది.
శ్రామికశక్తిని బలోపేతం చేయడంః ప్రధానమంత్రి మిషన్ రిక్రూట్‌మెంట్ & రోజ్‌గార్ మేలా చొరవలకు అనుగుణంగా, శాస్త్ర, సాంకేతికత, పాలనాపరమైన కేడర్లలో గల 1200 ఖాళీలను గత ఏడాదిలో ఐసిఎంఆర్ విజయవంతంగా భర్తీ చేసింది.
***
(Release ID: 2010992)
Visitor Counter : 126