రక్షణ మంత్రిత్వ శాఖ
రక్షణ రంగంలో ఆత్మనిర్భరతకు మరింత ప్రోత్సాహం; రూ . 39, 125.39 కోట్ల విలువైన ప్రధాన మూలధన ప్రాప్తి ఒప్పందాలపై సంతకాలు చేసిన రక్షణ మంత్రిత్వ శాఖ
రక్షణమంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ సమక్షంలో ఒప్పందాల మార్పిడి / ఇచ్చిపుచ్చుకున్నారు
Posted On:
01 MAR 2024 1:26PM by PIB Hyderabad
రక్షణలో ఆత్మనిర్భరతలో భాగంగా, మేక్ ఇన్ ఇండియా చొరవను మరింత బలోపేతం చేసేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ రూ. 39, 125.39 కోట్ల విలువైన ఐదు ప్రధాన కాపిటల్ ఎక్విజిషన్ (మూలధన ప్రాప్తి) ఒప్పందాలపై 1 మార్చి 2024న న్యూఢిల్లీలో సంతకాలు చేసింది. రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్, రక్షణ కార్యదర్శి శ్రీ గిరిధర్ అరమణె మార్గదర్శనంలో ఈ వ్యవహారం ఫలవంతమైనందున, వారి సమక్షంలో ఈ ఒప్పందాలను ఇచ్చి పుచ్చుకున్నారు.
భారత రక్షణ దళాల కోసం చేసుకున్న ఐదు ఒప్పందాలలో, ఒకటి మిగ్-29 విమానాలకు ఎయిరో- ఇంజన్లను సేకరించేందుకు ఎం/ ఎస్ హిందుస్తాన్ ఎయిరోనాటిక్స్ లిమిటెడ్‌తో, క్లోజ్- ఇన్ వెపన్ సిస్టమ్ (సిఐడబ్ల్యుఎస్ - చొచ్చుకు వస్తున్న స్వల్పదూరం వెళ్ళగల క్షిపణులు, శత్రువిమానాలను గుర్తించి, నాశనం చేయడం కోసం ఉద్దేశించిన గురిపెట్టిన ఆయుధ వ్యవస్థ), హైపవర్ రాడార్ (హెచ్‌పిఆర్) సేకరణకు ఎం/ ఎస్ లార్సెన్ అండ్ టుబ్రోతో రెండు ఒప్పందాలు, బ్రహ్మోస్ క్షిపణులు, నౌకలపై మోహరించగల బ్రహ్మోస్ వ్యవస్థ సేకరణ కోసం ఎం/ ఎస్ బ్రహ్మోస్ ఎయిరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ (బిఎపిఎల్)తో రెండు ఒప్పందాలు చేసుకున్నారు.
ఈ ఒప్పందాలు మన దేశీయ సామర్ధ్యాలను మరింత బలోపేతం చేసి, విదేశీ మారకాన్ని ఆదా చేయడమే కాకుండా, భవిష్యత్తులో విదేశీ మూలానికి చెందిన ఆయుధాల తయారీదారులపై ఆధారపడడాన్ని తగ్గిస్తుంది.
ఎం/ ఎస్ హిందుస్తాన్ ఎయిరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఎఎల్)తో మిగ్ -29 విమానాల కోసం రూ. 5,249.72 కోట్ల వ్యయంతో ఆర్‌డి-33 ఎయిరో ఇంజిన్స్ ఒప్పందం చేసుకున్నారు. ఈ ఎయిరో ఇంజిన్లను హెచ్ఎఎల్ కోరాపుట్ డివిజన్ తయారు చేయనుంది. ఈ ఎయిరో ఇంజిన్లు మిగ్-29 ఫ్లీట్ (సమూహం) కార్యాచరణ సామర్ధ్యాన్ని, అవశేష సేవా జీవితానికి కొనసాగించడానికి భారత వైమానిక దళం (ఐఎఎఫ్) అవసరాన్ని తీర్చగలవని భావిస్తున్నారు. ఈ ఎయిరో ఇంజిన్లను సాంకేతిక బదలాయింపు (ట్రాన్సఫర్ ఆఫ్ టెక్నాలజీ - టిఒటి), రష్యన్ ఒఇఎం నుంచి లైసెన్సుతో తయారు చేయనున్నారు. ఆర్‌డి-33 ఎయిరో ఇంజన్ల భవిష్యత్తు మరమ్మతు, సమగ్ర పరిశీలన (ఆర్ఒహెచ్) పనుల దేశీయ పరిమాణాన్ని పెంచడంలో సహాయ పడే అనేక అధిక విలువ కలిగిన కీలక భాగాల స్వదేశీకరణపై ఈ కార్యక్రమం దృష్టి సారిస్తుంది.
ఎం/ ఎస్ లార్సన్ టుబ్రో లిమిటెడ్‌తో సిఐడబ్ల్యుఎస్‌ల సేకరణ కోసం రూ. 7,668.82 కోట్ల విలువైన ఒపపందం చేసుకున్నారు. దేశంలో ఎంపిక చేసిన ప్రాంతాలలో అగ్ర వాయు రక్షణను సిఐడబ్ల్యుఎస్‌లు కల్పిస్తాయి. ఈ ప్రాజెక్టు ఎంఎస్ ఎంఈలు సహా భారతీయ అంతరిక్ష, రక్షణ, సంబంధిత పరిశ్రమల చురుకైన భాగస్వామ్యాన్ని ప్రోత్సహించి, బలోపేతం చేస్తుంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఐదు సంవత్సరాల వ్యవధిలో ఏడాదికి సగటున 2,400మంది వ్యక్తులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పన జరుగుతుంది.
ఎం/ ఎస్ లార్సన్& టుబ్రో లిమిటెడ్‌తో హెచ్‌పిఆర్ సేకరణ కోసం రూ. 5,700.13 కోట్ల విలువైన ఒప్పందం చేసుకున్నారు. ఇది ప్రస్తుతం ఐఎఎఫ్ వద్ద గల దూరగామి రాడార్ల స్థానంలో అత్యాధునిక నిఘా లక్షణాలు గల ఆధునిక, చురుకైన అపెర్చర్ ఫేజ్డ్ అర్రే ( క్రమబద్ధ ద్వార అమరిక) ఆధారిత హెచ్‌పిఆర్ వస్తుంది. ఇది చిన్నరాడార్ క్రాస్ సెక్షన్ (విభిన్నవర్గాల) లక్ష్యాలను గుర్తించే సామర్ధ్యం కలిగిన అత్యాధునిక సెన్సార్ల ఏకీకరణతో ఐఎఎఫ్ భూసంబంధ వాయు రక్షణ సామర్ధ్యాలను గణనీయంగా పెంచుతుంది. ఇది భారతదేశంలో ప్రైవేట్ రంగం ద్వారా నిర్మితమైన తొలి రాడార్ కనుక దేశీయ రాడార్ తయారీ సాంకేతికతను మరింత బలోపేతం చేసి, ప్రోత్సహిస్తుంది. ఈ ప్రాజెక్టు కింద ఐదు సంవత్సరాల వ్యవధిలో ఏడాదికి సగటున 1000 మంది వ్యక్తులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పన జరుగుతుంది.
బ్రహ్మోస్ క్షిపణుల సేకరణ కోసం ఎం/ ఎస్ బ్రహ్మోస్ ఎయిరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ (బిఎపిఎల్)తో చేసుకున్న ఒప్పందం విలువ రూ. 19,518.65 కోట్లు. ఈ క్షిపణులను భారత నావికాదళ యుద్ధ సామాగ్రి, శిక్షణ అవసరాలను తీర్చేందుకు ఉపయోగిస్తారు. ఈ ప్రాజెక్టు దేశంలోని ఎంఎస్ ఎంఇలు సహా అనుబంధ పరిశ్రమలలో సుమారు 135 లక్షల పని దినాలను, జాయింట్ వెంచర్ సంస్థలో తొమ్మిది లక్షల పని దినాలను కల్పించనుంది.
నౌకలపై అమర్చే బ్రహ్మోస్ వ్యవస్థ సేకరణ కోసం ఎం/ ఎస్ బ్రహ్మోస్ ఎయిర్ స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ (బిఎపిఎల్) తో రూ. 988.07 కోట్ల విలువైన ఒప్పందాన్ని చేసుకున్నారు. ఈ వ్యవస్థ సముద్రపు దాడుల కార్యకలాపాలకు ముందువరుస వివిధ యుద్ధనౌకలలో అమర్చిన ప్రాథమిక ఆయుధం . ఈ వ్యవస్థ సూపర్‌సోనిక్ వేగంతో లక్ష్యాలను ఖచ్చితత్వంతో విస్తరించిన పరిధుల నుండి భూమిపై లేదా సముద్ర లక్ష్యాలను ఛేదించగలదు. ఈ ప్రాజెక్టు దాదాపు 7-8 సంవత్సరాల కాలంలో 60వేల పనిదినాలను ఉత్పత్తి సృస్టించగలదు.
***
(Release ID: 2010895)
Visitor Counter : 175