పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ

అబుదాబిలో ఆయిల్ ఇండియా గ్లోబల్ పార్ట్‌నర్ రోడ్ షో


-“సంగమం: ఎక్కడ శక్తి అవకాశం సమ్మిళితమవుతాయో” పేరిట నిర్వహణ

Posted On: 26 FEB 2024 3:08PM by PIB Hyderabad

ఆయిల్ ఇండియా లిమిటెడ్ (ఓఐఎల్) భారతదేశంలో చమురు అన్వేషణ మరియు ఉత్పత్తి సంస్థ. ఇది భారతదేశపు అతి యువ మహారత్న సీపీఎస్ఈ కూడా.. ఈ సంస్థ తాజాగా మొట్టమొదటి ప్రపంచ భాగస్వామి రోడ్షోను ప్రకటించింది: -“సంగమంఇక్కడ ఇంధనం- అవకాశం సమ్మిళితమవుతాయో” పేరిట ఈ రోడ్డు షోను నిర్వహించినున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమం 28 ఫిబ్రవరి 2024 యుఏఈలోని అబుదాబిలో జరగనుంది.   రోడ్డు షో ఓఐఎల్ సంస్థ యొక్క మేటి వృద్ధి మరియు అంతర్జాతీయ సహకారానికి నిబద్ధతను సూచిస్తుందిఓఐఎల్ ప్రతిష్టాత్మకమైన ఉత్పత్తి లక్ష్యాలపై దృష్టి పెట్టిందిఎఫ్ఐ 26 నాటికి 4 ఎంఎంటీల చమురు మరియు 5 బీసీఎంల గ్యాస్ వార్షిక ఉత్పత్తిని సాధించే దిశగా ముందుకు సాగుతోంది. 2030 నాటికి 12 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించే లక్ష్యంతోకంపెనీ 4.8 బిలియన్ అమెరికన్ డాలర్లను వివిధ రకాల కార్యకలాపాలలో పెట్టుబడి పెట్టాలని యోచిస్తోందిఅన్వేషణ ప్రయత్నాలను వేగవంతం చేయడంక్షేత్ర అభివృద్ధిని మెరుగుపరచడం మరియు ఉత్పత్తిని వేగవంతం చేయడంపై కూడా సంస్థ దృష్టి సారించింది.  దీనికి తోడు ఓఐఎల్ ఆఫ్షోర్ భారతీయ ప్రాంతాలలో దూకుడుగా విస్తరించడానికి సిద్ధంగా ఉందిరోడ్షోను ఓఐఎల్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ఆపరేషన్స్ విభాగం డైరెక్టర్ మరియు సీనియర్ అధికారుల సమక్షంలో నిర్వహించనున్నారు.  ఈ కార్యక్రమం రాబోయే ఒకటి నుండి ఐదు సంవత్సరాల వరకు ఓఐఎల్ యొక్క వివరణాత్మక సేకరణ వ్యూహాలను వివరించడానికి కీలకమైన వేదికగా ఉపయోగపడుతుంది, భాగస్వామి ఆన్‌బోర్డింగ్ ప్రక్రియను నిమగ్నం చేయడానికి, ఆలోచన చేయడానికి మరియు వేగవంతం చేయడానికి భాగస్వాములకు ఒక ప్రత్యేకమైన ప్లాట్‌ఫారమ్‌ను అందిస్తుంది. దీనికి తోడు ఇంధన పరిశ్రమలో కొత్త వ్యాపార అవకాశాలను అన్వేషించడానికి దాని భాగస్వాములతో బలమైన సంబంధాలను ఏర్పరచుకోవడంపై ఓఐఎల్ యొక్క దృష్టిని ఈ కార్యక్రమం వెలుగులోకి తేనుంది. ఈ రోడ్డుషో ఇంధన సేవల పరిశ్రమ నుండి 50కి పైగా ప్రముఖ కంపెనీలను ఆకర్షించగలదని అంచనా వేయబడింది. ఈ కార్యక్రమం సంస్థ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలువనుంది, ఇది గ్లోబల్ ఎనర్జీ సహకారం యొక్క దృశ్యాన్ని సమర్థవంతంగా మార్చగలదు. ప్రపంచ స్థాయిలో సహకార ప్రయత్నాల ద్వారా కొత్త పరిశ్రమ ప్రమాణాలను నెలకొలుపుకోవాలనే ఓఐఎల్ లక్ష్యంతో, ఆవిష్కరణ, సుస్థిరత మరియు వ్యూహాత్మక పొత్తులకు నాయకత్వం వహించడంపై దృష్టి కేంద్రీకరించబడుతుంది.

***



(Release ID: 2009352) Visitor Counter : 71


Read this release in: English , Urdu , Hindi