శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

భారతదేశం యొక్క తొలి సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేసే రోబోట్ స్వచ్ భారత్ ప్రచారాన్ని బలోపేతం చేస్తోంది.

Posted On: 26 FEB 2024 3:31PM by PIB Hyderabad

భారతదేశపు మొట్టమొదటి సెప్టిక్ ట్యాంక్/మ్యాన్‌హోల్ శుభ్రం చేసే రోబోట్, మానవ పారిశుద్ధ్య పనిని తొలగించడానికి సంపూర్ణ పరిష్కారాన్ని  అందిస్తోంది, దేశంలోని వివిధ ప్రాంతాలలో స్వచ్ఛతా అభియాన్‌ను బలోపేతం చేస్తోంది.

 

ఐ ఐ టీ మద్రాస్‌లోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డీ ఎస్ టి )-టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్ (టీ బీ ఐ) స్టార్టప్ అభివృద్ధి చేసిన హోమోసెప్ ఆటం అనే సాంకేతికత, మానవ పారిశుద్ధ్య పద్ధతులను పరిష్కరించి, దానిని రోబోటిక్ పారిశుద్ధ్య పద్ధతులకు మారుస్తుంది. ఇది భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లోని 16 నగరాలకు చేరుకుంది మరియు విస్తృతమైన బ్లేడ్ పారిశుధ్యం, ఘన వ్యర్థాలను తొలగించడం, చూషణ మరియు ఒక పరికరంలో నిల్వ ఉంచడం వంటి వాటిని  అందిస్తుంది; తద్వారా బహుళ ఆస్తులను సొంతం చేసుకునే ఖర్చు తగ్గుతుంది మరియు మురుగు కాలువల్లో రోబోటిక్ పారిశుద్ధ్యాన్ని ప్రోత్సహిస్తుంది.

 

విద్యా/సాంకేతిక/ ఆర్ & డీ సంస్థలలో నిధి ప్రోగ్రామ్‌లో భాగంగా విజయవంతమైన ఎంటర్‌ప్రైజెస్‌గా వినూత్నమైన స్టార్ట్-అప్‌లకు మద్దతు ఇవ్వడానికి మరియు ప్రోత్సహించడానికి డీ ఎస్ టి-టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్లు (టీ బీ ఐ లు) స్థాపించబడ్డాయి.

 

సోలినాస్ అనే స్టార్టప్, ఈ సరసమైన రోబోటిక్ పరిష్కారాన్ని అభివృద్ధి చేసింది, ఇది పారిశుద్ధ్య ప్రయోజనాల కోసం పరిమిత స్థలాన్ని తనిఖీ చేయడానికి, శుభ్రం చేయడానికి మరియు నిర్వహించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏ ఐ)ని సమీకృతం చేసింది. ఇది మధురైలో మ్యాన్‌హోల్ అడ్డంకులు మరియు మురుగునీరు పొంగిపోర్లటాన్ని తగ్గించడంలో సహాయపడింది. హోమోసెప్ ఆటం యొక్క అప్లికేషన్  చెన్నై లోని జనసాంద్రత గల ప్రాంతాలలోని క్లిష్టమైన ఇరుకు సందులకు విస్తరించబడింది. ఇది పెద్ద అపార్ట్‌మెంట్‌లు, హౌసింగ్ బోర్డులు మరియు వ్యక్తిగత గృహాలకు సంబంధించిన సెప్టిక్ ట్యాంక్‌లను లక్ష్యంగా చేసుకుంది. ఈ ప్రక్రియ మునిసిపాలిటీలను వేగంగా మరియు సమర్థవంతంగా శుభ్రపరచడానికి, తొలగించడానికి  మరియు ట్రీట్‌మెంట్ ప్లాంట్‌లకు వ్యర్థాలను రవాణా చేయడానికి వీలు కల్పించింది. అంతేకాకుండా,   రోబోట్‌లతో మ్యాన్‌హోల్ శుభ్రం చేయడం ద్వారా పారిశుధ్య కార్మికులకు సాధికారత కల్పించారు, ఇవి మ్యాన్‌హోల్‌లను బయటి నుండి శుభ్రం చేయడానికి మరియు విషపూరిత వాతావరణంలోకి వెళ్లకుండా ఉండటానికి సహాయపడతాయి, తద్వారా పారిశుధ్య కార్మికులకు గౌరవాన్ని అందిస్తుంది.

 

సోలినాస్ అనేది ఐ ఐ టీ మద్రాస్ నుండి స్థాపించబడ్డ డీప్-టెక్ మరియు క్లైమేట్ టెక్ స్టార్టప్, ఇది నీరు మరియు పారిశుద్ధ్య రంగంలో విప్లవాత్మక మార్పులు మరియు వాతావరణ పరిస్థితులను మెరుగుపరచడం లోని సవాళ్లను పరిష్కరించే ఉద్దేశ్యంతో స్థాపించబడింది. ఐ ఐ టీ మద్రాస్ డీ ఎస్ టి-టీ బీ ఐ కూడా ప్రారంభ దశలో సోలినాస్ ఉత్పత్తి అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడంలో కీలకపాత్ర పోషించింది.

 

భారతదేశపు తొలి 90 ఎం ఎం నీటి రోబోట్ మరియు 120 ఎం ఎం మురుగు రోబోట్‌లతో సహా సూక్ష్మ రోబోట్‌లను అభివృద్ధి చేయడంలో ఈ స్టార్టప్ ప్రత్యేకత కలిగి ఉంది, నీటి-మురుగు పైపులైన్‌లలోని కలుషిత సవాళ్లను పరిష్కరించడానికి 100 ఎం ఎం కంటే తక్కువ పైపులైన్‌ల ద్వారా వెళ్ళగల సామర్థ్యం ఉంది. డీ ఎస్ టి నుండి వచ్చిన మద్దతు ద్వారా  సుస్థిరమైన మరియు భారీ గా ఎదిగే అవకాశం గల పరిష్కారాలు రెండింటినీ నిర్ధారిస్తుంది.

 

ఈ తొలి ఉత్పత్తితో పాటు, సోలినాస్ యొక్క సాంకేతికతలు నీటి వృధాలు, భూగర్భజలాల కాలుష్యం, వాతావరణ మార్పు మరియు మానవ పారిశుద్ధ్య పనిని, కలుషిత నీటిని తాగడం,  మురుగునీరు పొంగిపొర్లడం వంటి రోజువారీ మానవ సవాళ్ల వంటి కొన్ని వాతావరణ సవాళ్లను పరిష్కరించాయి.

 

ఎండోబోట్ మరియు స్వాస్త్ ఏ ఐ వంటి సాంకేతికతలు కోయంబత్తూర్ వంటి నగరాల్లో  వృధాలు, అడ్డంకులు మరియు చెట్ల మూలాలు వంటి భూగర్భ సమస్యల కారణంగా తరచుగా గుర్తించబడని నీటి కాలుష్యం, వృధాలు మరియు మురుగు పొంగిపొర్లడాన్ని గుర్తించి, తగ్గించగల పైప్‌లైన్ డయాగ్నస్టిక్ సాధనాలుగా పనిచేశాయి.

 

సోలినాస్ యొక్క ఏఐ-ఆధారిత పైప్‌లైన్ లోపం గుర్తింపు మరియు అంచనా సేవలు ఖర్చులను ఆదా చేయడం, పరిష్కార సమయాన్ని తగ్గించడం మరియు 1000 కంటే ఎక్కువ గృహాలకు తాగునీటి సరఫరాను అందించిన  హుబ్బలి నగరానికి తాగునీటి సరఫరాను మొత్తం గా మెరుగుపరచడంలో సహాయపడింది. సీవరేజ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ గోవా కోసం మురుగునీటి పైప్‌లైన్‌లో లోపాలను గుర్తించడం, త్వరితంగా మరియు మరింత తక్కువ ఖర్చుతో కూడిన పరిష్కారాలకు దారితీసింది. చెన్నై మెట్రోతో భాగస్వామ్యంతో ఇది పరస్పర-కాలుష్యం మరియు అక్రమ ట్యాపింగ్‌ల యొక్క కీలక సవాళ్లను గుర్తించడంలో సహాయపడింది, తద్వారా పైప్‌లైన్ సమగ్రత అలాగే నీటి ప్రాప్యతను మెరుగుపరిచింది.

 

"అటువంటి స్టార్టప్‌లకు డీ ఎస్ టి యొక్క మద్దతు  విజ్ఞాన ఆధారిత సంస్థలను అభివృద్ధి చేయడానికి మరియు సామాజిక సవాళ్లను పరిష్కరించడానికి అలాగే దేశ వృద్ధి మరియు అభివృద్ధికి దోహదపడటానికి ప్రభుత్వ స్టార్టప్ ఉద్యమం నుండి ప్రేరణ పొందిన యువకులకు ప్రోత్సాహానికి ప్రధాన మూలం" అని ప్రొఫెసర్ అభయ్ కరాండీకర్, కార్యదర్శి డిఎస్‌టి తెలిపారు.

***



(Release ID: 2009348) Visitor Counter : 1884


Read this release in: English , Urdu , Hindi