సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జే & కే లోని కిష్త్వార్ జిల్లా ప్రధాన విద్యుత్ కేంద్రం గా ఆవిర్భవించడంతో ప్రధాని మోడీ ఆధ్వర్యంలో ఉత్తర భారతదేశం పెద్ద విద్యుత్ బూమ్‌ను చూస్తోందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.


జే & కే లోని బనీ సమీపంలో 120 ఎం డబ్ల్యూ సేవా II జలవిద్యుత్ ప్రాజెక్టును సందర్శించారు

Posted On: 24 FEB 2024 8:52PM by PIB Hyderabad

"జే & కే లోని కిష్త్వార్ జిల్లా ఒక ప్రధాన విద్యుత్ కేంద్రంగా ఆవిర్భవించడంతో, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ఉత్తర భారతదేశం ఒక పెద్ద విద్యుత్ వెల్లువను చూస్తోంది" అని కేంద్ర సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) సైన్స్ & టెక్నాలజీ; సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) ఎర్త్ సైన్సెస్; ఎం ఓ ఎస్, పీ ఎం ఓ, పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, పెన్షన్స్, అటామిక్ ఎనర్జీ అండ్ స్పేస్, డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు అన్నారు.

 

డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు హిమాచల్ ప్రదేశ్ మరియు జే & కే సరిహద్దు కు సమీపంలో ఉన్న జమ్మూ మరియు కాశ్మీర్‌లోని బనీ  సేవా II జలవిద్యుత్ ప్రాజెక్టును సందర్శించారు. 120 ఎం డబ్ల్యూ విద్యుత్ ప్రాజెక్ట్ జే & కే తో పాటు అన్ని పొరుగు ఉత్తర భారత రాష్ట్రాలకు విద్యుత్ అందిస్తుంది. ఎన్ హెచ్ పీ సీ డైరెక్టర్ (ఫైనాన్స్) శ్రీ ఆర్ . పీ గోయల్ మరియు ఇతర అధికారులతో కేంద్ర మంత్రి జలవిద్యుత్ ప్రాజెక్టుల స్థితిగతులను సమీక్షించారు.

 

ఈ ప్రాంతంలోని వివిధ జలవిద్యుత్ మరియు అభివృద్ధి ప్రాజెక్టుల పురోగతిపై మంత్రికి సవివరమైన ప్రజెంటేషన్ ఇచ్చారు. మోదీ ప్రభుత్వం హయాంలో తొలిసారిగా జమ్మూ కాశ్మీర్‌లోని జలవిద్యుత్ వంటి సహజ వనరులు వినియోగం లోకి వచ్చాయని, తద్వారా ఈ ప్రాంతం నుండి మిగులు విద్యుత్‌ను ఉత్తర భారతదేశంలోని ఇతర ప్రాంతాలకు సరఫరా చేయవచ్చని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.

 

డాక్టర్ జితేంద్ర సింగ్ పొరుగున ఉన్న కతువా జిల్లాకు చెందిన బని మరియు బసోహ్లీకి రాబోయే సీ ఎస్ ఆర్ కార్యకలాపాల గురించి కూడా చర్చించారు.

 

డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్ కొనసాగుతున్న విద్యుత్ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత దాదాపు 6,000 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి తో ఉత్తర భారతదేశంలోని ప్రధాన "విద్యుత్ హబ్"గా అవతరించడానికి సిద్ధంగా ఉంది.

 

డాక్టర్ జితేంద్ర సింగ్ తన ప్రసంగంలో మరియు తరువాత మీడియాతో మాట్లాడుతూ, శ్రీ నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి 9 నుండి 10 సంవత్సరాల స్వల్ప వ్యవధిలో ఈ ప్రాంతంలో 6 నుండి 7 ప్రధాన జల విద్యుత్ ప్రాజెక్టులు వచ్చాయన్నారు.

 

దీనిపై ఆయన వివరిస్తూ, 1000 మెగావాట్ల సామర్థ్యంతో అతి భారీ సామర్థ్యం గల ప్రాజెక్టు పాకల్ దుల్ అని సూచించారు. దీని అంచనా వ్యయం, ప్రస్తుతానికి రూ.8,112.12 కోట్లు మరియు  ఇదీ 2025 నాటికి  పూర్తవుతుందని అంచనా. మరో ప్రధాన ప్రాజెక్ట్ 624 మెగావాట్ల సామర్థ్యం కలిగిన కిరు జలవిద్యుత్ ప్రాజెక్ట్. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 4,285.59 కోట్లు అలాగే ఇది కూడా 2025 నాటికి  పూర్తవుతుందని అంచనా అని ఆయన చెప్పారు.

 

అదే సమయంలో, జే & కే  కేంద్రం మరియు యూ టీ మధ్య జాయింట్ వెంచర్‌గా 850 మెగావాట్ల రాటిల్ ప్రాజెక్ట్ పునరుద్ధరణ చేయబడిందని మంత్రి తెలిపారు. ప్రస్తుత దులహస్తి పవర్ స్టేషన్ 390 మెగావాట్ల స్థాపిత సామర్థ్యాన్ని కలిగి ఉంది, అయితే దుల్హస్తి II హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ 260 మెగావాట్ల సామర్థ్యాన్ని అదనంగా కలిగి ఉంటుంది అని మంత్రి చెప్పారు.

 

ఈ ప్రాజెక్టులు విద్యుత్ సరఫరా స్థితిని మెరుగుపరచడం  అలాగే జే & కే  యూ టీ లో విద్యుత్ సరఫరా కొరతను భర్తీ చేయడమే కాకుండా, ఈ ప్రాజెక్టుల నిర్మాణం కోసం భారీ పెట్టుబడి పెట్టడం స్థానిక ప్రజలకు ప్రత్యక్ష ప్రోత్సాహం అని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.

 

***


(Release ID: 2008938) Visitor Counter : 93


Read this release in: English , Urdu , Hindi