వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

176% వృద్ధి సాధించి ఆర్థిక సంవత్సరం 24 (2024 ఫిబ్రవరి 22 వరకు) లో 1,82,000 కోట్ల రూపాయలకు చేరిన జెమ్ ద్వారా జరిగిన సేవల సేకరణ


జెమ్ ద్వారా ఆర్థిక సంవత్సరం 21 లో 8,500 కోట్ల రూపాయల విలువ చేసే సేవల సేకరణ

Posted On: 23 FEB 2024 5:06PM by PIB Hyderabad

ప్రభుత్వ ఇ-మార్కెట్‌ప్లేస్ (జెమ్ ) ద్వారా సేవల సేకరణ గణనీయంగా పెరిగింది. 176% వృద్ధి సాధించి ఆర్థిక సంవత్సరం 24 (2024 ఫిబ్రవరి 22 వరకు) లో 1,82,000 కోట్ల రూపాయలకు చేరిన జెమ్ ద్వారా  సేవల సేకరణ జరిగింది. జెమ్ ద్వారా ఆర్థిక సంవత్సరం 21 లో 8,500 కోట్ల రూపాయల విలువ చేసే సేవల సేకరణ  

జరిగింది.జెమ్ ద్వారా  ఆర్థిక సంవత్సరం 23 లో దాదాపు 66,000 కోట్ల రూపాయల విలువ చేసే సేవల సేకరణ జరిగింది. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చి చూస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం లో సేవల సేకరణ  176% పెరిగింది. . ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తుల సేకరణ  మొత్తం విలువకు  మించి సేవల సేకరణ  మొత్తం విలువ పెరగడంతో జెమ్ అందిస్తున్న సేవలను ఎక్కువ మంది  వివిధ కొనుగోలుదారులు ఆమోదిస్తున్నారని సూచిస్తుంది.జెమ్ సేవలు వినియోగిస్తున్న వారి సంఖ్య  2024  ఫిబ్రవరి లో,గణనీయంగా పెరిగింది.జెమ్ ద్వారా సాగిన మొత్తం లావాదేవీలలో ఒక్క ఫిబ్రవరి నెలలో  దాదాపు 80% లావాదేవీలు జరిగాయి. . ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం సేకరణలో సేవల సేకరణ వాటా 50%  స్థాయిని  అధిగమించింది.  కోల్ ఇండియా లిమిటెడ్  అనుబంధ సంస్థగా పనిచేస్తున్న సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్ లిమిటెడ్ సేవల కోసం వేసిన దాదాపు 40,000 కోట్ల విలువ చేసే  రెండు బిడ్‌లు దాఖలు చేసింది. 

 డిజిటల్ సామర్థ్యాలను పూర్తిగా ఉపయోగించుకుని వివిధ స్థాయిల్లో  ప్రభుత్వ శాఖలు/ విభాగాలకు అవసరమైన సేవలను ఒక చోట అందిస్తూ ప్రగతి సాధించామని జెమ్ సీఈఓ శ్రీ పి.కే. సింగ్ తెలిపారు.  ప్రభుత్వ కొనుగోలుదారులకు అవసరమైన అన్ని సేవలను కొనుగోలు చేయడానికి జెమ్  ఒక-స్టాప్-షాప్‌గా అభివృద్ధి చెందని ఆయన వివరించారు. అతి తక్కువ  కాలంలో విపరీతమైన వృద్ధిని సాధించిందని ఆయన అన్నారు.

జెమ్ ద్వారా అందిస్తున్న  సేవల శ్రేణి ఎక్కువగా ఉండడంతో సంస్థ వాణిజ్య కార్యక్రమాలకు ప్రోత్సాహం అందించింది.  ఈ ఒక్క సంవత్సరంలోనే  గ్రూప్ మెడిక్లెయిమ్ ఇన్సూరెన్స్ సర్వీస్, అసెట్ ఇన్సూరెన్స్ సర్వీస్, గ్రూప్ టర్మ్ ఇన్సూరెన్స్ సర్వీస్ మొదలైన 9 రకాల ఇన్సూరెన్స్ సర్వీస్‌లను సేకరించడం కోసం 4,036 కోట్ల రూపాయల  విలువైన దాదాపు 457 ఆర్డర్‌లు జెమ్ కు వచ్చాయి. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద గుజరాత్ ప్రభుత్వం 2,302 కోట్లు   విలువైన గ్రూప్ మెడిక్లెయిమ్ ఇన్సూరెన్స్ సర్వీస్‌లను కొనుగోలు చేసింది. దీని ద్వారా  62 లక్షల కుటుంబాలకు బీమా సౌకర్యం కల్పిస్తారు. 

ఇ-బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా  జెమ్ అందిస్తున్న లోకల్ కెమిస్ట్ ఎంప్యానెల్‌మెంట్ వంటి వినూత్న, ప్రత్యేక సేవల వల్ల  ఔషధాల సరఫరాపై సగటున 30-32% తగ్గింపు లభిస్తుంది. దీనిని గుర్తించిన  కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం, ఉద్యోగులు రాష్ట్ర బీమా కార్పొరేషన్ , వివిధ రాష్ట్రాల ఆరోగ్య,కుటుంబ సంక్షేమ శాఖలు ఈ సేవలను జెమ్ ద్వారా పొందడానికి ముందుకు వచ్చాయి. 

కన్సల్టెంట్స్,పిఆర్  ఏజెన్సీ నియామకం, అవుట్‌డోర్ అడ్వర్టైజ్‌మెంట్ సేవలు, ఎగ్జిబిషన్ / ఈవెంట్ / సెమినార్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ వంటి సేవల సేకరణ ద్వారా  ప్రభుత్వ సంస్థలు విధాన-నిర్ణయాలను వివరంగా వివరించడానికి,  సమాచారాన్ని సమర్థవంతంగా వ్యాప్తి చేయడానికి వీలు కల్పిస్తుంది. ఈ రకమైన సేవలలో పెట్టుబడులు పెట్టడం ద్వారా ప్రభుత్వ కొనుగోలుదారులు తమ సామర్థ్యాలను మెరుగు పరుచుకున్నారు.దేశ ప్రజల అవసరాలకు అనుగుణంగా కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. 

జల్ జీవన్ మిషన్, పోషన్   2.0 లాంటి  కీలక సామాజిక సంక్షేమ కార్యక్రమాల అమలుకు కూడా జెమ్ సేవల సేకరణ సహకారం అందించింది. . స్వచ్ఛ భారత్ మిషన్ ను మరింత సమర్థంగా అమలు చేయడానికి జెమ్ ప్రత్యేక సేవలు రూపొందించింది సేకరణ, పారవేయడం, నిర్వహణ తో సహా పారిశుద్ధ్య సేవల నియామకం కోసం జెమ్  ప్రత్యేక సేవలను అందుబాటులోకి తెచ్చింది.  ఈ సేవను బీహార్‌లోని అర్బన్ డెవలప్‌మెంట్ ,హౌసింగ్ డిపార్ట్‌మెంట్ క్రమం తప్పకుండా కొనుగోలు చేస్తోంది, ఈ ప్రత్యేక సేవలు ద్వారా  వివిధ పట్టణ స్థానిక సంస్థలలో వ్యర్థాలను సేకరించడం, ఎత్తడం, రవాణా చేయడం , పారవేయడం కోసం 35 ఆర్డర్‌లను ఇచ్చింది. జమ్మూ , కాశ్మీర్, అండమాన్ , నికోబార్ దీవులు, ఉత్తరాఖండ్ , ఢిల్లీ వంటి వివిధ రాష్ట్రాల్లో పట్టణ స్థానిక సంస్థలు కూడా ఇలాంటి ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.
 సేవలను వ్యూహాత్మక ఆస్తిగా గుర్తించడానికి జెమ్ అమలు చేస్తున్న కార్యక్రమాలు సహకరించాయి.   పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్ ప్రక్రియలను క్రమబద్ధీకరించడంలో బలమైన సేకరణ మౌలిక సదుపాయాల  ప్రాముఖ్యతకు గుర్తింపు లభించింది.గణనీయమైన వ్యాపార రూఢి సాధించి జెమ్ భారతదేశ ఆర్థికాభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తోంది. 

ప్రభుత్వ కొనుగోలుదారులకు సరసమైన ధరలకు సేవలు, వస్తువులుఅందించడానికి 2016 లో జెమ్ ఏర్పాటయింది. 19-20 ఆర్థిక సంవత్సరంలో ఈ-బిడ్డింగ్ వంటి సాధనాల ద్వారా మానవనరుల సరఫరా, అద్దె వాహనాలు, , సెక్యూరిటీ సేవలు,  క్లీనింగ్  శానిటేషన్ సర్వీసెస్ వంటి ప్రాథమిక సేవలను జెమ్ అందించింది. సేవల శ్రేణి పెరగడంతో జెమ్ ద్వారా సాగుతున్న లావాదేవీల సంఖ్య గణనీయంగా పెరిగింది. 

 

***


(Release ID: 2008738) Visitor Counter : 107


Read this release in: English , Hindi