విద్యుత్తు మంత్రిత్వ శాఖ
సమర్థవంతమైన నీటి నిర్వహణకు గుర్తింపు పొందటం తో పాటు కార్బన్ డిస్‌క్లోజర్ ప్రాజెక్ట్ వాటర్ సెక్యూరిటీ రేటింగ్‌లో రెండు స్థాయిలను ఎన్ టీ పీ సీ అధిరోహించింది
Posted On:
21 FEB 2024 6:52PM by PIB Hyderabad
ఎన్ టీ పీ సీ యొక్క పర్యావరణ, సామాజిక మరియు పాలనా నిర్వహణ ( ఈ ఎస్ జీ ) స్కోర్ రెండు స్థాయిలు పెరిగింది. కార్బన్ డిస్‌క్లోజర్ ప్రాజెక్ట్ (సీ డీ పీ) నీటి పరిరక్షణ రేటింగ్‌లో 2022లో 'డీ' రేటింగ్ నుండి 2023లో ' సీ' రేటింగ్‌కి మారుతుంది. ఈ ఘనత నీటి నిర్వహణపై నిర్దిష్ట ప్రాధాన్యతతో పర్యావరణ నిర్వహణ మరియు సుస్థిరమైన పద్ధతుల పట్ల ఎన్ టీ పీ సీ యొక్క అచంచలమైన నిబద్ధతకు నిదర్శనం.
నీటి పునర్వినియోగం మరియు రీసైక్లింగ్‌ను మెరుగుపరచడానికి ఎన్ టీ పీ సీ యొక్క ప్రయత్నాలు సానుకూల ఫలితాలను అందించాయి. ఇటీవలి సంవత్సరాలలో నిర్దిష్ట నీటి వినియోగంలో గణనీయమైన తగ్గుదలలో ఇది ప్రతిబింబిస్తుంది. ఎదురయ్యే సవాళ్లు ఉన్నప్పటికీbపునరుత్పాదక శక్తి ఏకీకరణ మరియు వెట్ ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ సిస్టమ్‌ల అమలు ద్వారా ఎన్ టీ పీ సీ వినూత్న చర్యలు మరియు సమర్థవంతమైన పద్ధతుల ద్వారా నీటి వినియోగాన్ని బాగా తగ్గిస్తోంది.
కార్బన్ డిస్‌క్లోజర్ ప్రాజెక్ట్ (సీ డీ పీ ) అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఈ ఎస్ జీ రేటింగ్ ఏజెన్సీలలో ఒకటి. ముఖ్యంగా వాతావరణ మార్పు, నీటి భద్రత మరియు అటవీ నిర్మూలన వంటి వాటి పర్యావరణ పనితీరుపై కంపెనీలను అంచనా వేస్తుంది.
దాని నిబద్ధతను బలపరిచేందుకు సీ ఈ ఓ వాటర్ మాండేట్‌పై ఎన్ టీ పీ సీ 2021లో సంతకం చేసింది. బాధ్యతాయుతమైన నీటి నిర్వహణకు అంకితభావం మరియు నీటి సుస్థిరత్వ సవాళ్లను పరిష్కరించే లక్ష్యంతో ప్రపంచవ్యాప్త చొరవలో పాల్గొనడాన్ని ఇది నొక్కి చెబుతుంది.
అధునాతన సాంకేతికతలు మరియు ప్రాసెస్ రీఇంజనీరింగ్ ద్వారా నీటి వినియోగాన్ని సర్వోత్తమీకరణం చేయడం, పటిష్టమైన "నీటి విధానం" మరియు "వర్షపు నీటి వినియోగ విధానం " అమలు చేయడం మరియు అన్ని స్టేషన్‌లలో "శూన్య ద్రవ విసర్జన (జెడ్ ఎల్ డీ)" స్థితిని కొనసాగించడం వంటివి నీటి సంరక్షణ కోసం ఎన్ టీ పీ సీ యొక్క ముఖ్యమైన నీటి చొరవలు.
ఇంకా, కంపెనీ ఎయిర్-కూల్డ్ కండెన్సర్‌ల ద్వారా 75% నీటిని ఆదా చేస్తుంది. మంచినీటి వినియోగాన్ని తగ్గించడానికి అన్ని స్టేషన్లలో మంచినీటి లభ్యత మరియు సామర్థ్య పెంపుదల మరియు సైకిల్స్ ఆఫ్ కాన్సంట్రేషన్ ( సీ ఓ సీ) లో కూడా ఇది కమ్యూనిటీ పెట్టుబడులను చేస్తుంది.
ఎన్ టీ పీ సీ లిమిటెడ్ భారత ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖ క్రింద పనిచేస్తున్న అతిపెద్ద ప్రభుత్వ రంగ సమగ్ర విద్యుత్ రంగ సంస్థ. 74 జీ డబ్ల్యూ స్థాపిత సామర్ధ్యం తో భారతదేశంలో ఉత్పత్తి చేయబడిన మొత్తం విద్యుత్‌లో 25% వాటాను అందిస్తుంది. ఎన్ టీ పీ సీ తన అశిలాజ ఆధారిత సామర్థ్యాన్ని 2032 నాటికి 45%-50%కి విస్తరించాలని చూస్తోంది. ఇది తన మొత్తం 130 జీ డబ్ల్యూ సామర్ధ్యం లో 60 జీ డబ్ల్యూ పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఎన్ టీ పీ సీ భారతదేశ నికర శూన్య విడుదల ప్రయత్నాలను బలోపేతం చేయడానికి నీతి ఆయోగ్‌తో భాగస్వామ్యం కలిగి ఉంది.
ఇది కూడా చదవండి
***
(Release ID: 2007924)
Visitor Counter : 84