సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
థాయ్ లాండ్ ప్రజల సందర్శనార్ధం భారతదేశం నుంచి గౌతమ బుద్ధుడు, ఇద్దరు శిష్యుల పవిత్ర అవశేషాలు
2024 ఫిబ్రవరి 22న 26 రోజుల ప్రదర్శన కోసం భారత్ నుంచి థాయ్ లాండ్ కు బయలు దేరుతున్న పవిత్ర
అవశేషాలు
థాయ్ లాండ్ కు పవిత్ర అవశేషాలు తీసుకు వెళ్లనున్న బీహార్ గవర్నర్ శ్రీ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్, కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ నేతృత్వంలోని 22 మంది సభ్యుల ప్రతినిధి బృందం
प्रविष्टि तिथि:
20 FEB 2024 8:00PM by PIB Hyderabad
చారిత్రాత్మక, ముఖ్యమైన సంఘటనలో భాగంగా బుద్ధ భగవానుడు , అతని శిష్యులైన అరాహత సరిపుత్ర, అరాహత మౌద్గలాయణుల పవిత్ర అవశేషాలు థాయ్ లాండ్ కు పవిత్ర యాత్రలో భాగంగా వెళ్లనున్నాయి. బుద్ధ భగవానుడు, ఆయన శిష్యుల పవిత్ర అవశేషాలను ఒకేసారి ప్రజల దర్శనార్ధం ప్రదర్శించడం ఇదే తొలిసారి.
ఈరోజు న్యూ ఢిల్లీ పర్యటన వివరాలను మీడియాకు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ గోవింద్ మోహన్ వివరించారు. బీహార్ గవర్నర్ శ్రీ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ నేతృత్వంలోని 22 మంది సభ్యుల బృందం అవశేషాలను థాయ్‌లాండ్‌కు తీసుకు వెళ్తుంది. 26 రోజుల పాటు పవిత్ర శేషాలను థాయ్‌లాండ్ లో సందర్శన కోసం ఉంచుతారు. ప్రతినిధి బృందంలో ఖుషీనగర్, ఔరంగాబాద్, లడఖ్ ప్రాంతాలకు చెందిన సన్యాసులు, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ అధికారులు, మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, నేషనల్ మ్యూజియం నుండి క్యూరేటర్లు, కళాకారులు, పండితులు సభ్యులుగా ఉంటారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, థాయ్‌లాండ్‌లోని భారత రాయబార కార్యాలయం, ఇంటర్నేషనల్ బౌద్ధ సమాఖ్య, నేషనల్ మ్యూజియం, మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని శ్రీ గోవింద్ మోహన్ తెలిపారు.
భారతదేశం-థాయ్‌లాండ్ సంబంధాలలో ఇది మరో చారిత్రక మైలురాయిగా నిలుస్తుందని ఇరు దేశాల మధ్య సాంస్కృతిక, ఆధ్యాత్మిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని శ్రీ గోవింద్ మోహన్ అన్నారు. జాతీయ మ్యూజియంలో భద్రపరచబడిన AAగా వర్గీకరించబడిన పిపరాహ్వా అవశేషం ప్రధాన ఆకర్షణగా ఉంటుందన్నారు. నేషనల్ మ్యూజియంలో ఉన్న 20 ప్రతిష్టాత్మకమైన ముక్కలలో నాలుగు భాగాలను థాయ్‌లాండ్‌కు తీసుకు వెళ్తారు.
ప్రస్తుతం సాంచిలో భద్రపరిచిన అరహత సారిపుత్ర,అరహత మౌద్గలాయన ల పవిత్ర అవశేషాలు థాయ్‌లాండ్‌కు తీసుకు వెళ్లేందుకు ఢిల్లీకి తీసుకు వచ్చారు.
పవిత్ర అవశేషాలను ప్రతిష్టించడానికి బ్యాంకాక్‌లోని పగోడాలో థాయ్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక పేటిక నిర్మించింది
థాయ్‌లాండ్‌కు ఈ పవిత్ర అవశేషాల ప్రయాణం 22 ఫిబ్రవరి 2024న ప్రారంభం కానుంది.ప్రభుత్వ మర్యాదలతో వైమానిక విమానంలో శేషాలను తీసుకువెళుతున్నారు. అదే రోజు ఉదయం థాయ్‌లాండ్‌కు చేరుకుంటారు. సంప్రదాయబద్ధంగా అవశేషాలకు థాయిలాండ్ ప్రభుత్వం స్వాగతం పలుకుతుంది. ఫిబ్రవరి 23న బ్యాంకాక్‌లోని సనమ్ లుయాంగ్ పెవిలియన్‌లో సిద్ధం చేసిన మండపంలో అవశేషాలను ప్రతిష్టిస్తారు. . మఖ బుచ్చా రోజు నుండి ప్రజల సందర్శనార్ధం అవశేషాలను ఉంచుతారు. కార్యక్రమంలో భాగంగా భారతదేశంలో బౌద్ధ స్థలాల గురించి ప్రదర్శనలు, అవశేషాలపై విద్యావేత్తల ప్రసంగాలు నిర్వహిస్తారు.
అవశేషాలను థాయ్‌లాండ్ అంతటా ప్రధ ర్శించడానికి ఏర్పాట్లు చేశారు. భక్తులు మరియు ఔత్సాహికులు నివాళులర్పించేందుకు వీలు కల్పిస్తుంది.
సనమ్ లుయాంగ్ పెవిలియన్, బ్యాంకాక్: 22 ఫిబ్రవరి 2024 - 3 మార్చి 2024 (11 రోజులు)
హో కుమ్ లుయాంగ్, రాయల్ రుజాప్రూక్, చియాంగ్ మాయి: 4 మార్చి 2024 – 8 మార్చి 2024 (5 రోజులు)
వాట్ మహా వానరం, ఉబోన్ రట్చథని: 9 మార్చి 2024 - 13 మార్చి 2024 (5 రోజులు)
వాట్ మహాతట్, అలూయెక్, క్రాబీ: 14 మార్చి 2024 - 18 మార్చి 2024 (5 రోజులు)
ఈ పవిత్ర ప్రదర్శన 19 మార్చి 2024 న ముగుస్తుంది,
***
(रिलीज़ आईडी: 2007671)
आगंतुक पटल : 197