గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
'పీఎం స్వనిధి' పథకం వీధి వ్యాపారుల గౌరవాన్ని నిలబెట్టింది: గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పురి
ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 60.94 లక్షల మంది వీధి వ్యాపారులు లబ్ధి పొందారు: హర్దీప్ సింగ్ పురి
'పీఎం స్వనిధి' మెగా క్యాంప్‌లో 10,000 మంది వీధి వ్యాపారులకు రుణాలు పంపిణీ
Posted On:
16 FEB 2024 4:34PM by PIB Hyderabad
దిల్లీలో 'పీఎం స్వనిధి' మెగా క్యాంప్ నిర్వహించి 10,000 మంది వీధి వ్యాపారులకు రుణాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన గృహ నిర్మాణం & పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పురి, కరోనా మహమ్మారి కారణంగా దేశంలోని వీధి వ్యాపారులు అత్యంత తీవ్రంగా ప్రభావితమైన సమయంలో 'పీఎం స్వనిధి' పథకం ప్రారంభమైందని చెప్పారు. అది, వీధి వ్యాపారుల గౌరవాన్ని కాపాడిందని, వేరొకరి మీద ఆధారపడకుండా వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడేలా చేసిందని అన్నారు.
ఈ రోజు ఇక్కడ జరిగిన 'పీఎం స్వనిధి' మెగా క్యాంపులో 10 వేల మంది వీధి వ్యాపారులకు రుణాలు పంపిణీ చేశామని కేంద్ర వివరించారు.
దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ వినయ్ కుమార్ సక్సేనా, ఆర్థిక శాఖ సహాయ మంత్రి శ్రీ భగవత్ కిషన్‌రావ్ కరాడ్, విదేశీ వ్యవహారాలు & సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి శ్రీమతి మీనాక్షి లేఖి, దిల్లీ ఎంపీ డా.హర్షవర్ధన్ సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
పీఎం స్వనిధి పథకం విజయాల గురించి కేంద్ర మంత్రి వివరించారు. ఈ పథకం ద్వారా 60.94 లక్షల మంది వీధి వ్యాపారులకు రూ.10,678 కోట్ల విలువైన 80.42 లక్షల రుణాలు అందజేసినట్లు చెప్పారు. తొలి విడతలో, ఎలాంటి తనఖా లేకుండా రూ.10,000 వరకు రుణం, ఆ తర్వాత రెండు & మూడు విడతల్లో వరుసగా రూ.20,000 & రూ.50,000 చొప్పున రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ పథకం వల్ల వీధి వ్యాపారులు ఆర్థిక వ్యవస్థలో భాగం కావడమేగాక, వారి గౌరవం పెరిగిందన్నారు. “ఇప్పుడు, వీధి వ్యాపారులు అధిక వడ్డీ చెల్లించే అనధికార రుణ మార్గాలపై ఆధారపడరు. ప్రభుత్వం వారికి ప్రత్యామ్నయ మార్గాన్ని తెరిచింది” అని శ్రీ పురి చెప్పారు.
దిల్లీలోని వీధి వ్యాపారులకు కూడా ఈ పథకం ద్వారా అవసరమైన సాయం అందించినట్లు మంత్రి హర్దీప్ సింగ్ పురి వెల్లడించారు. 14 ఫిబ్రవరి 2024 నాటికి, దిల్లీలోని వీధి వ్యాపారుల నుంచి 3.05 లక్షల రుణ దరఖాస్తులు అందాయని, వాటిలో 2.2 లక్షల దరఖాస్తులకు బ్యాంకులు రుణం చేశాయని, మరో 1.9 లక్షల రుణాలు రూపంలో ఇప్పటికే రూ. 221 కోట్లు పంపిణీ చేసినట్లు వివరించారు. ఈ రోజు మెగా క్యాంప్‌లో 10,000 రుణాల పంపిణీతో, ఒక్క దిల్లీలోనే 2 లక్షల రుణాల పంపిణీ మైలురాయిని దాటినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు.
***
(Release ID: 2006717)
Visitor Counter : 132