ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
అందరికీ అందుబాటులో ఉండే భారత డిపిఐలను కొలంబియాతో పంచుకునేందుకు ఎంఒయుపై సంతకాలు చేసిన భారత్
ఇండియా స్టాక్ ద్వారా డిజిటల్ పరివర్తనను ప్రోత్సహించడం ఎంఒయు లక్ష్యం
Posted On:
16 FEB 2024 6:19PM by PIB Hyderabad
డిజిటల్ పరివర్తన కోసం జనాభా శ్రేణిలో అమలు చేసేందుకు విజయవంతమైన డిజిటల్ పరిష్కారాలను పంచుకోవడంలో సహకారం కోసం భారతదేశం & కొలంబియా అవగాహనా ఒప్పందం (ఎంఒయు)పై సంతకాలు చేశాయి. జఈ ఒప్పందంపై ఎలక్ట్రానిక్స్& ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (ఎంఇఐటివై), కొలంబియాకు చెందిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ అండ్ కమ్యూనికేషన్స్ సంతకాలు చేశాయి.
కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటి, నైపుణ్యాల అభివృద్ధి & వ్యవస్థాపకత, జలశక్తి శాఖ సహాయ మంత్రి శ్రీ రాజీవ్ చంద్ర శేఖర్, కొలంబియా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ అండ్ కమ్యూనికేషన్స్ మం్రతి శ్రీ మారీషియో లిజ్‌కానో ఎంఒయులను ఇచ్చి పుచ్చుకున్నారు.
భారత్ తరుఫున దీనిపై ఎంఇఐటివై కార్యదర్శి శ్రీ ఎస్ కృష్ణన్, కొలంబియా వైపు నుంచి శ్రీమారిషియాఓ లికాంకోలు సంతకాలు చేశారు. సామర్ధ్య నిర్మాణ కార్యక్రమాలు, ఉత్తమ ఆచరణల బదలాయింపు, ప్రభుత్వాధికారులు, నిపుణుల బదిలీ, పైలెట్ లేదా డెమో పరిష్కారాలను అభివృద్ధి చేయం, ఇరు దేశాలలోని డిజిటల్ పర్యావరణ వ్యవస్థ నుంచి పరస్పరం లబ్ధి పొందేందుకు ప్రైవేటు రంగంలోని వారికి సౌలభ్యతను కల్పించడం ద్వారా డిజిటల్ పరివర్తన (ఇండియా స్టాక్ - INDIA STACK)ను ప్రోత్సహించడం ఎంఒయు ఉద్దేశ్యం.
ఇరు పక్షాలూ డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాల గురించి చర్చించాయి. ఈ మౌలిక సదుపాయాలు సురక్షితమైన, పరస్పరం పని చేయగల భాగస్వామ్య డిజిటల్ వ్యవస్థను ఏర్పరుస్తాయి. వాటిని ప్రభుత్వ, ప్రైవేట్ సేవలకు సమాన ప్రాప్యతను అందించేందుకు, బట్వాడా చేసేందుకు ఓపెన్ స్టాండర్డ్స్ (బహిరంగ ప్రమాణాల)పై వాటిని నిర్మించవచ్చు.
ఇండియా స్టాక్ పరిష్కారాలు అనేవి ప్రభుత్వ సేవల అందుబాటు, బట్వాడాను అందించేందుకు ప్రజా శ్రేణి కోసం భారత్ అభివృద్ధి చేసి, అమలు చేసినవి డిపిఐలు.
కొలంబియాలో డిజిటల్ ప్రజా మౌలికసదుపాయాలను సజావుగా స్వీకరించడానికి దారి తీసే డిజిటల్ పరివర్తపై అభివృద్ధి భాగస్వామ్యాన్ని నిర్మించడం ద్వారా కొలంబియాతో భాగస్వామ్యం కోసం భారత్ ఆసక్తితో ఉంది.
***
(Release ID: 2006716)
Visitor Counter : 171