బొగ్గు మంత్రిత్వ శాఖ
డిసెంబర్ 2023లో 4.75% క్షీణతను చూపిన జాతీయ బొగ్గు సూచీ
Posted On:
15 FEB 2024 11:32AM by PIB Hyderabad
జాతీయ బొగ్గు సూచీ (తాత్కాలికం) డిసెంబర్ 2022లో ఉన్న 163.19 పాయింట్లతో పోలిస్తే డిసెంబర్ 2023లో 4.75% శాతం తగ్గి 155.44 పాయింట్లుగా నిలిచి గణనీయమైన క్షీణతను చూపింది. పెరుగుతున్న డిమాండ్లను నెరవేర్చేందుకు మార్కెట్‌లో తగినంత బొగ్గు అందుబాటులో ఉండటాన్ని ఈ గణనీయ క్షీణత సూచిస్తోంది.
జాతీయ బొగ్గు సూచీ (ఎన్‌సిఐ) అనేది అన్ని విక్రయ మార్గాల నుంచి బొగ్గు ధరలను అంటే నోటిఫైడ్ ధరలు, వేలం ధరలు, దిగుమతి ధరలను మిళితం చేసే ధరల సూచిక. ఇది నియంత్రిత (విద్యుత్ & ఎరువులు), అనియంత్రిత రంగాలలో లావాదేవీలు జరిపే వివిధ గ్రేడ్‌ల కోకింగ్, నాన్-కోకింగ్ బొగ్గు ధరలను పరిగణనలోకి తీసుకుంటుంది.
ఆర్ధిక సంవత్సరం 2017-18 ని మూల సంవత్సరంగా తీసుకొని ఏర్పాటు చేసిన ఎన్‌సిఐ, ధరల హెచ్చు తగ్గుల గురించి విలువైన అంతర్దృష్టులను అందించడం ద్వారా మార్కెట్ చలనగతికి విశ్వసనీయ సూచికగా పని చేస్తుంది.
జూన్ 2022లో సూచీ 238.83 పాయింట్లకు చేరుకున్నప్పుడు ఎన్‌సిఐ గరిష్ట స్థాయిని గమనించింది, అయితే ఆ తర్వాతి నెలల్లో క్షీణతను చవిచూడటం అన్నది భారత్ మార్కెట్లో బొగ్గు సమృద్ధిగా అందుబాటులో ఉండడాన్ని సూచిస్తుంది.
అదనంగా, బొగ్గు వేలం మీద లాభం పరిశ్రమ నాడిని సూచిస్తుండగా, బొగ్గు వేలంపై లాభం గణనీయంగా క్షీణించడమన్నది మార్కెట్లో తగినంత బొగ్గు అందుబాటులో ఉండడాన్ని నిర్ధారిస్తుంది. గత సంవత్సరం సంబంధిత కాలంతో పోలిస్తే డిసెంబర్ 23లో దేశంలోని బొగ్గు ఉత్పత్తిలో 10.74% ఆక్టుకునే వృద్ధిని, బొగ్గుపై ఆధారపడిన వివిధ రంగాలకు స్థిరమైన సరఫరాను నిర్ధారిస్తూ, దేశ సమగ్ర ఇంధన భద్రత గణనీయంగా దోహదపడింది.
ఎన్‌సిఐ అధోముఖ పథం మరింత సమానమైన మార్కెట్‌ను సూచిస్తూ, డిమాండ్, సరఫరాల చలనశీలతను సమన్వయం చేస్తుంది. తగినంత బొగ్గు అందుబాటుతో, దేశం పెరుగుతున్న డిమాండ్లను నెరవేర్చడమే కాక, దాని దీర్ఘకాలిక ఇంధన అవసరాలను కూడా తోడ్పాటునందిస్తూ, తద్వారా మరింత స్థితిస్థాపకంగా, స్థిరమైన బొగ్గు పరిశ్రమను పటిష్టం చేయడమే కాక దేశానికి సుసంపన్నమైన భవిష్యత్తును ప్రోత్సహిస్తుంది.
***
(Release ID: 2006461)
Visitor Counter : 129