నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఎన్‌ఎస్‌టిఐ క్యాంపస్ అగర్తల మరియు వడోదరలో బాలికల వసతి గృహాన్ని ప్రారంభించిన శ్రీ ధర్మేంద్ర ప్రధాన్


తూర్పు మరియు పశ్చిమ భారతదేశంలోని రెండు ముఖ్యమైన కేంద్రాలలో సౌకర్యాలు మహిళా సాధికారతకు నిజమైన చిహ్నాలుగా నిలుస్తాయి - శ్రీ ధర్మేంద్ర ప్రధాన్

Posted On: 13 FEB 2024 8:53PM by PIB Hyderabad

కేంద్ర విద్య మరియు నైపుణ్యాభివృద్ధి & వ్యవస్థాపకత మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ అగర్తలాలో జాతీయ నైపుణ్య శిక్షణా సంస్థను ప్రారంభించారు మరియు గుజరాత్‌లోని వడోదరలో బాలికల హాస్టల్‌ను ప్రారంభించారు. ఇది  నైపుణ్యాభివృద్ధిని అభ్యసిస్తున్న మహిళా ట్రైనీల నారీ శక్తికి సాధికారత మరియు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించే ప్రధాన పురోగతిని సూచిస్తుంది. సామాజిక న్యాయం మరియు సాధికారత శాఖ సహాయమంత్రి శ్రీమతి. ప్రతిమ భూమిక్; త్రిపుర ముఖ్యమంత్రి, ప్రొ. (డా.) మాణిక్ సాహా; త్రిపుర పరిశ్రమలు మరియు వాణిజ్యం, జైలు (హోమ్) మరియు ఓబిసీల సంక్షేమ మంత్రి  శ్రీమతి. సంతాన చక్మా; వడోదర పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి. రంజన్‌బెన్ ధనంజయ్ భట్;  త్రిపుర శాసనసభ డిప్యూటీ స్పీకర్ శ్రీ రామ్ ప్రసాద్ పాల్; మరియు వడోదర మున్సిపల్ కార్పొరేషన్ మేయర్  శ్రీమతి. పింకీబెన్ నీరజ్‌భాయ్ సోనీ మరియు ఇతర ప్రముఖులు కూడా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

image.png


 శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ తన వర్చువల్ ప్రసంగంలో జాతీయ మహిళా దినోత్సవంగా కూడా గుర్తించబడిన సరోజినీ నాయుడు జయంతి శుభ సందర్భంగా ఈ ముఖ్యమైన సౌకర్యాల ప్రారంభోత్సవం తూర్పు మరియు పశ్చిమ భారతదేశంలోని రెండు ముఖ్యమైన కేంద్రాలలో మహిళా సాధికారతకు నిజమైన చిహ్నాలుగా నిలుస్తాయని అన్నారు. ఈ ప్రాంతంలోని మహిళలకు నైపుణ్యాలు మరియు వైఖరులతో సన్నద్ధం చేయడంతోపాటు వారి మార్గాన్ని ప్రకాశవంతం చేసేందుకు వారు కృషి చేస్తారని మరియు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఊహించిన విధంగా మహిళల నేతృత్వంలోని అభివృద్ధిలో పురోగతికి సహాయపడతారని ఆయన అన్నారు.

ప్రొఫెసర్ (డా.) మాణిక్ సాహా, తన ప్రసంగంలో డెరైక్టరేట్ ఆఫ్ స్కిల్ డెవలప్‌మెంట్ 42 వేల మంది వ్యక్తులకు విలువైన నైపుణ్యాలను ఎలా సమకూర్చిందో వివరించారు. గత తొమ్మిదేళ్లలో 17,000 మందికి పైగా పిఎంకెవివై ప్రోగ్రామ్ ద్వారా లబ్ధి పొందారని పేర్కొన్నారు. మహిళా సాధికారత కోసం ప్రభుత్వం యొక్క అంకితభావం మాటలను దాటి చేతల్లో చూపుతోందన్నారు; ఇది స్వావలంబనను పెంపొందించే లక్ష్యంతో కూడిన స్పష్టమైన చర్యలలో ప్రతిబింబిస్తుందని ఆయన తెలిపారు. ఆర్థిక స్వాతంత్ర్యం యొక్క కీలక పాత్రను గుర్తించి మహిళలు తమ ఆర్థిక భవిష్యత్తును సురక్షితంగా ఉంచుకునే సాధనాలను కలిగి ఉండేలా దృష్టి సారించారన్నారు.

మొత్తం రూ. 17 కోట్లతో 4.12 ఎకరాలలో నిర్మించబడ్డ అగర్తలలోని ఆనంద్ నగర్‌లో నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (మహిళలు) యొక్క శాశ్వత క్యాంపస్ మహిళళ పురోగతి మరియు నిబద్ధతకు చిహ్నంగా నిలుస్తుంది. ఎన్‌ఎస్‌టిఐ (డబ్ల్యూ) అగర్తల, 2015లో ఎంఎస్‌డిఈ,జీఓఐ కింద పశ్చిమ త్రిపురలోని అగర్తలాలోని గూర్ఖాబస్తీలో అమలు చేయబడింది. త్రిపుర మరియు ఈశాన్య ప్రాంతంలోని మహిళా ట్రైనీలకు వృత్తిపరమైన శిక్షణను అందించడంపై ఇది దృష్టి సారించింది. అధిక ఉపాధితో కూడిన ట్రేడ్‌లకు ప్రాధాన్యతనిస్తూ ఇన్‌స్టిట్యూట్ వేతనం మరియు స్వయం ఉపాధి కోసం అవసరాల ఆధారిత శిక్షణను అందిస్తుంది. క్యాంపస్‌లో 32 మంది బాలికలకు వసతి కల్పించే హాస్టల్‌తో పాటు అకడమిక్ మరియు అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్‌లు ఉన్నాయి.

క్రాఫ్ట్స్‌మెన్ ట్రైనింగ్ స్కీమ్ (సిటిఎస్‌) కింద ఎన్‌ఎస్‌టిఐ (డబ్ల్యూ) అగర్తల కాస్మోటాలజీ, డ్రెస్ మేకింగ్ మరియు సెక్రటేరియల్ ప్రాక్టీస్ (ఇంగ్లీష్) కోర్సులను అందిస్తుంది. క్యాటరింగ్ మరియు హాస్పిటాలిటీ, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ మరియు ఆఫీస్ మేనేజ్‌మెంట్‌తో సహా 2023-24 సెషన్ నుండి క్రాఫ్ట్స్ ఇన్‌స్ట్రక్టర్ ట్రైనింగ్ స్కీమ్ (సిఐటిఎస్‌) కింద కొత్త ట్రేడ్‌ల పరిచయం, అభివృద్ధి చెందుతున్న పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ఉంటాయి. ప్రస్తుతం 102 మంది ట్రైనీలు నమోదు చేసుకున్నారు మరియు రాబోయే సెషన్‌లో మరో 200 మందిని చేర్చుకోవాలని యోచిస్తోంది. ఎన్‌ఎస్‌టిఐ (డబ్ల్యూ) అగర్తల నైపుణ్యం కలిగిన నిపుణుల కోసం పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది.

 

image.png


 ఎన్‌ఎస్‌టిఐవడోదరలో కొత్తగా నిర్మించిన రెండు అంతస్తుల హాస్టల్ భవనం సుమారు రూ. 6 కోట్లతో నిర్మించబడింది. జంట-భాగస్వామ్య ప్రాతిపదికన 80 మంది ట్రైనీలకు వసతి కల్పించే 40 గదులు ఉన్నాయి. ఈ సౌకర్యం సహజ వెంటిలేషన్‌తో సౌకర్యవంతమైన జీవన పరిస్థితులను నిర్ధారిస్తుంది. వ్యాయామశాల మరియు క్రీడా కార్యకలాపాల కోసం బహిరంగ ప్రదేశాలు వంటి సౌకర్యాలతో కూడిన హాస్టల్ శిక్షణార్థులలో సమగ్ర అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది.

ఎన్‌ఎస్‌టిఐ వడోదర, ప్రారంభంలో 1993లో స్థాపించబడింది. మహిళల నైపుణ్యాభివృద్ధిలో అగ్రగామిగా ఉంది. ఈ సంస్థ ఇప్పుడు 6 ఎకరాల విస్తీర్ణంలో తన స్వంత క్యాంపస్‌లో ఉంది. ఇటీవల ఎక్కువ మంది శిక్షణార్థులకు వసతి కల్పించేందుకు కొత్త హాస్టల్ భవనాన్ని సమకూర్చుకుంది.సిటిఎస్‌ మరియు సిఐటిఎస్‌ కింద ట్రేడ్‌లపై దృష్టి సారించి ఎన్‌ఎస్‌టిఐ వడోదర కంప్యూటర్ ఆపరేటర్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, ఫ్యాషన్ డిజైన్ మరియు టెక్నాలజీ మరియు ఆఫీస్ మేనేజ్‌మెంట్‌తో సహా విభిన్న శ్రేణి కోర్సులను అందిస్తుంది. ఈ సంస్థ స్వల్పకాలిక శిక్షణా కార్యక్రమాలను అందిస్తుంది, విస్తృత శ్రేణి నైపుణ్యం సెట్‌లను అందిస్తుంది.

నవంబర్ 2023లో శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ఒడిశాలో యువత నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో ఎన్‌ఎస్‌టిఐ ప్లస్ స్థాపనను ప్రారంభించారు. భువనేశ్వర్‌లోని జట్నీలో 7.8 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న క్యాంపస్‌లో ఉన్న ఎన్ఎస్‌టిఐ ప్లస్ పరిశ్రమ మరియు భవిష్యత్తుకు తగిన నైపుణ్యాలతో అభ్యర్థులతో పాటు శిక్షకులను సన్నద్ధం చేయడానికి ఆధునిక గురుకుల్‌గా ఆవిర్భవిస్తుంది.

 

***


(Release ID: 2005971) Visitor Counter : 57


Read this release in: English , Urdu , Hindi