సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తన లోక్‌సభ నియోజకవర్గంలో భాగమైన ఉదంపూర్ మరియు కథువాలో రెండు స్టేషన్‌లలో స్టాప్‌లతో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు మొదటి రెగ్యులర్ రన్‌ను ప్రారంభించారు.
ఇది చారిత్రాత్మకమైనదిగా పేర్కొన్న డాక్టర్ జితేంద్ర సింగ్ జమ్ముకశ్మీర్ వేగవంతమైన అభివృద్ధి పట్ల ప్రధాని మోదీ ప్రత్యేక శ్రద్ధ చూపడం వల్లనే ఇది సాధ్యమైందని చెప్పారు.
ఉదంపూర్ రైల్వే స్టేషన్‌కు అమరవీరుడు కెప్టెన్ తుషార్ మహాజన్ రైల్వే స్టేషన్ ఉదంపూర్ అని పేరు పెట్టినందుకు ప్రధానికి డాక్టర్ జితేంద్ర సింగ్ కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో ఒక రైల్వే స్టేషన్‌కి అమరవీరుడి పేరు పెట్టడం ఇదే తొలిసారని చెప్పారు.
"రాబోయే 3-4 నెలల్లో కాశ్మీర్ లోయ దేశంలోని మిగిలిన ప్రాంతాలకు రైలు ద్వారా అనుసంధానించబడున్న నేపథ్యంలో ఉదంపూర్ భవిష్యత్తులో పెద్ద జంక్షన్‌గా మారుతుంది"
Posted On:
13 FEB 2024 4:43PM by PIB Hyderabad
ఉత్సాహం మరియు ఆనందోత్సాహాలతో నిండిన వేడుకలో కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు తన లోక్‌సభ నియోజకవర్గంలో భాగమైన రెండు స్టేషన్‌లలో వరుసగా ఉదంపూర్ మరియు కథువాలో స్టాప్‌లతో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు మొదటి రెగ్యులర్ రన్‌ను ప్రారంభించారు.

ఇది ప్రభుత్వ చారిత్రాత్మక నిర్ణయమని డాక్టర్ జితేంద్ర సింగ్ అభివర్ణిస్తూ జమ్మూ & కాశ్మీర్ ప్రాంతాన్ని వేగంగా అభివృద్ధి చేయాలన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రత్యేక శ్రద్ధ మరియు ప్రాధాన్యత కారణంగానే ఇది సాధ్యమైందని అన్నారు.
డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ ఉదయం ఉదంపూర్ స్టేషన్ నుండి రైలు మొదటి స్టాపేజ్‌ను ఫ్లాగ్ చేసి కథువా రైల్వే స్టేషన్ వరకూ అందులో ప్రయాణించారు. ఆ స్టేషన్‌లో రైలు మొదటి హాల్ట్ చేసింది.

ఈ సందర్భంగా డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ ఈ సదుపాయంతో కతువా స్టేషన్‌లో వందే భారత్ రైలును నిలపాలన్న స్థానిక ప్రజలు మరియు ప్రయాణికుల డిమాండ్‌ను ప్రధాని మోదీ నెరవేర్చారన్నారు. వందే భారత్ రైలు నిర్దేశిత ఎనిమిది గంటల ప్రయాణ సమయంతో సంబంధం లేకుండా కేవలం ఒకటిన్నర నెలల వ్యవధిలో టిక్కెట్లు మరియు హాల్టింగ్ ప్రక్రియ మొత్తం పూర్తయిందని ఈ విజయం చిన్న ఫీట్ కాదని ఆయన అన్నారు.
ఉదంపూర్ రైల్వేస్టేషన్ పేరును అమరవీరుడు కెప్టెన్ తుషార్ మహాజన్ రైల్వేస్టేషన్‌గా మార్చాలన్న తమ డిమాండ్‌కు అంగీకరించినందుకు స్థానిక ప్రజల తరపున డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఒక రైల్వే స్టేషన్‌కు అమర సైనికుడి పేరు పెట్టడం దేశంలో ఇదే తొలిసారి. మునుపటి నోటిఫికేషన్‌లో ఉదంపూర్ అనే పదం అనుకోకుండా తొలగించబడిందని, అయితే స్టేషన్‌కు అమరవీరుడు కెప్టెన్ తుషార్ మహాజన్ రైల్వే స్టేషన్ ఉదంపూర్ అని పేరు పెట్టడం జరిగిందని డాక్టర్ సింగ్ తెలియజేశారు.
రెండు వందేభారత్ రైళ్లను నిలిపే కొన్ని మార్గాలలో ఇది ఒకటి కాబట్టి జె&కె రైల్వే మార్గం ప్రత్యేకమైనదని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. అయితే 2015లో ప్రారంభమైన ఈ అత్యాధునిక రవాణా సౌకర్యాన్ని దేశంలోని అనేక ప్రదేశాలు ఇంకా అందుకోలేదని చెప్పారు. తయారు చేసిన రైళ్లను ప్రధాని మోదీ పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసికి అంకితం చేసిన తర్వాత జె&కె కోసం వందే భారత్ రైళ్ల జత మంజూరు చేయబడిందని ఆయన చెప్పారు.

ఉత్తర భారతదేశంలో మిలిటరీకి ప్రధాన స్థావరం అయిన ఉదంపూర్ భవిష్యత్తులో పెద్ద జంక్షన్‌గా మారుతుందని, ముఖ్యంగా కాశ్మీర్ లోయ వచ్చే 3-4లో రైళ్ల ద్వారా దేశంలోని మిగిలిన ప్రాంతాలకు అనుసంధానించబడిందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. రాబోయే దశాబ్దంలో ఉదంపూర్ మరియు కథువా రైల్వే స్టేషన్లు రెండూ గొప్ప ప్రాముఖ్యతను సంతరించుకుంటాయని డాక్టర్ సింగ్ తెలిపారు.
ఉదంపూర్ మరియు కథువాలో స్టాపేజ్‌లుగా ఉన్న రెండు వందే భారత్ రైళ్ల సవరించిన సమయ షెడ్యూల్‌ను పంచుకుంటూ, ప్రయాణీకుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇది జరిగిందని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. కతువా మరియు ఉదంపూర్ నుండి వచ్చే ప్రయాణికులు ఇప్పుడు ఢిల్లీలో భోజనం చేయవచ్చు, అయితే ఢిల్లీ నుండి వచ్చే ప్రయాణికులు తదుపరి గమ్యస్థానంలో రాత్రి భోజనం చేయవచ్చు.

కత్రా నుండి రైలు నంబర్ 22478 ప్రస్తుతం బయలుదేరే సమయం ఉదయం 6 గంటల కాగా అది ఉదయం 5.50కి మార్చబడింది. ఈ రైలు ఉదయం 6.14 గంటలకు ఉదంపూర్ రైల్వే స్టేషన్ (అమరవీరుడు కెప్టెన్ తుషార్ మహాజన్ స్టేషన్) చేరుకుని 6.16 గంటలకు తదుపరి ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది.
సవరించిన సమయాల ప్రకారం రైలు ఉదయం 7.10 గంటలకు జమ్మూ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది మరియు రెండు నిమిషాలు ఆగిన తర్వాత ప్రారంభమవుతుంది. ఇది ఉదయం 8.03 గంటలకు కతువా చేరుకుని 8.05 గంటలకు బయలుదేరి తదుపరి ప్రయాణం కోసం న్యూఢిల్లీ వైపు వెళుతుంది.
అలాగే రైలు నంబర్ 22477 న్యూఢిల్లీ నుండి రాత్రి 8.45 గంటలకు కతువా చేరుకుని 8.47 గంటలకు బయలుదేరుతుంది. రాత్రి 9.45 గంటలకు జమ్మూ స్టేషన్‌కు చేరుకుని రెండు నిమిషాలు ఆగుతుంది. ఈ రైలు ఉదంపూర్‌కి రాత్రి 10.42 గంటలకు చేరుకుని రాత్రి 10.44 గంటలకు బయలుదేరి రాత్రి 11.15 గంటలకు కత్రా చేరుకుంటుంది.
****
(Release ID: 2005965)