పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
ద్రవీకృత సహజ వాయువు(ఎల్ఎన్జీ) ధరలను అందుబాటులో ఉంచడానికి స్వచ్ఛమైన శిలాజ ఇంధనాన్ని విస్తృతంగా స్వీకరించడంలో ప్రభుత్వ జోక్యం కీలకం: పెట్రోనెట్ ఎల్ఎన్జీ మేనేజింగ్ డైరెక్టర్&ప్రధాన కార్యనిర్వాహకులు (సీఈవో) అక్షయ్ కుమార్ సింగ్
సహజవాయువు ప్రచారం కోసం ఖర్చు, సరఫరా మరియు పన్నులలో సమలేఖనం తప్పనిసరిగా ఉండాలి:భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్) మార్కెటింగ్ డైరెక్టర్, డైరెక్టర్ల బోర్డు సభ్యుడు సుఖ్‌మల్ జైన్
Posted On:
07 FEB 2024 7:40PM by PIB Hyderabad
2030 నాటికి మొత్తం ఇంధన మిశ్రమంలో సహజవాయువు వాటాను 6% నుండి 15%కి పెంచే లక్ష్యంతో భారతదేశం సాధించిన లక్ష్యాన్ని ప్రస్తుతం సరసమైన ధర మరియు సరఫరా గొలుసులోని మౌలిక సదుపాయాల సమకాలీకరణపై ఆధారపడి ఉందనిపెట్రోనెట్ ఎల్ఎన్జీ మేనేజింగ్ డైరెక్టర్&ప్రధాన కార్యనిర్వాహకులు (సీఈవో) అక్షయ్ కుమార్ సింగ్ తెలిపారు. గోవాలోని ఇండియా ఎనర్జీ వీక్, 2024 రెండవ రోజున “అభివృద్ధి చెందుతున్న ఎల్‌ఎన్‌జి మార్కెట్లు మరియు మౌలిక సదుపాయాల”పై లీడర్‌షిప్ ప్యానెల్‌లో అక్షయ్ కుమార్ సింగ్ మాట్లాడారు.
స్వచ్ఛమైన శిలాజ ఇంధనానికి మారడానికి వినియోగదారులను ఒప్పించడంలో ధరలను ప్రధాన అడ్డంకిగాపెట్రోనెట్ ఎల్ఎన్జీ మేనేజింగ్ డైరెక్టర్&ప్రధాన కార్యనిర్వాహకులు (సీఈవో) అక్షయ్ కుమార్ సింగ్ గుర్తించారు.
"అందుబాటులో లేని ధరలు ఇతర ఇంధనాలకు మారడానికి వినియోగదారులను ఇబ్బందిపడేలా చేస్తాయి. అంతేకాక అధిక ధరలు డిమాండ్‌ను తగ్గించకుండా జాగ్రత్తగా క్రమాంకనం చేయడం అత్యవసరం" అని పెట్రోనెట్ ఎల్ఎన్జీ మేనేజింగ్ డైరెక్టర్&ప్రధాన కార్యనిర్వాహకులు (సీఈవో) అక్షయ్ కుమార్ సింగ్ అన్నారు.
ఇంధన ఉత్పత్తి కోసం ద్రవీకృత సహజ వాయువు(ఎల్ఎన్జీ) విస్తృతంగా స్వీకరించడం అవసరమని, స్వచ్ఛమైన ఇంధన వృద్ధికి ఆర్థిక వ్యవస్థలో అవకాశం ఇప్పటికే ఉందని అక్షయ్ కుమార్ సింగ్ అన్నారు. భారత దేశం దిగుమతి చేసుకుంటున్న 85 శాతం ముడి చమురులో ఎక్కువ భాగాన్ని ద్రవీకృత సహజ వాయువు(ఎల్ఎన్జీ) భర్తీ చేయగలదన్నారు. ఎల్‌ఎన్‌జితో భర్తీ చేయగలదని ఆయన అన్నారు. దేశంలో ఉపయోగించే ఎల్‌ఎన్‌జిలో దాదాపు 45% భారతదేశం దిగుమతి చేసుకుంటుందని చెప్పారు.
ఎల్‌ఎన్‌జి వినియోగాన్ని విస్తృతంగా ప్రోత్సహించడానికి ధర నిర్ణయించడం ఆందోళన కలిగించే అంశం. అయితే, ఇంధనం దేశంలోని ఏ ప్రాంతంలోనైనా విక్రయించవచ్చని అక్షయ్ కుమార్ సింగ్ నొక్కిచెప్పారు. అదనంగా, ద్రవీకృత సహజ వాయువు(ఎల్ఎన్జీ) రవాణాలో ఉపయోగించే 10----..-20% డీజిల్‌ను సులభంగా భర్తీ చేయగలదు. తద్వారా భారతదేశ ఇంధన మిశ్రమంలో స్వచ్ఛమైన ఇంధనం వాటా పెరుగుతుంది.
అంతేకాకుండా, ఆర్థిక వ్యవస్థను గ్యాస్ ఆధారితంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రభుత్వ జోక్యంతో, ముఖ్యంగా ఇంధన రాయితీపై పన్ను విధించడం ద్వారా పెద్ద ఎత్తున ద్రవీకృత సహజ వాయువు(ఎల్ఎన్జీ) స్వీకరించడం కష్టమైన పని అని సింగ్ చెప్పారు.
అదే ప్యానెల్ సభ్యుడైన భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్) మార్కెటింగ్ డైరెక్టర్, డైరెక్టర్ల బోర్డు సభ్యుడు సుఖ్‌మల్ జైన్ మాట్లాడుతూ.. అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్ చేరాలంటే సహజవాయువును స్వీకరించడం తప్పనిసరి అన్నారు. చమురు డిమాండ్ వృద్ధి వార్షికంగా 2.5-5%గా అంచనా వేయబడినప్పటికీ, ద్రవీకృత సహజ వాయువు(ఎల్ఎన్జీ) డిమాండ్ వృద్ధి 4-5% వరకు ఉండవచ్చని ఆయన తెలిపారు.
"సహజ వాయువు ప్రమోషన్ కోసం ఖర్చు, సరఫరాలో సామర్థ్యం మరియు పన్నులు సమలేఖనం చేయబడాలి" అని జైన్ చెప్పారు.
ఐఈడబ్ల్యూ 2024లో ప్యానెల్‌లో భాగంగా, ఎక్సాన్‌మొబిల్ ఎల్ఎన్జీ మార్కెట్ డెవలప్‌మెంట్ ఛైర్మన్ మరియు గ్లోబల్ ఎల్ఎన్జీ మార్కెటింగ్, ఎక్సాన్ మొబలి ఆయిల్ & గ్యాస్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ఆండ్రూ బారీ, పునరుత్పాదక ఇంధనానికి ఎల్ఎన్జీ ఒక గొప్ప భాగస్వామి అని నొక్కిచెప్పారు. సౌర, పవన మరియు జల విద్యుత్ శక్తి కారణంగా అడపాదడపా సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు.
తోటి ప్యానెలిస్ట్‌లతో ఏకీభవిస్తూ, స్వచ్ఛమైన ఇంధనాన్ని స్వీకరించడంలో ప్రధాన సవాలుగా ఉన్న ద్రవీకృత సహజ వాయువు ఉత్పత్తి మరియు ప్రసార మౌలిక సదుపాయాల నిర్మాణ వ్యయాన్ని అండ్రూ బారీ గుర్తించారు.
ఇండియా ఎనర్జీ వీక్ నేపథ్యం
ఇండియా ఎనర్జీ వీక్ 2024 ఫిబ్రవరి 6 నుండి 9 వరకు గోవాలో నిర్వహించబడింది. ఇది భారతదేశం యొక్క అతిపెద్ద మరియు ఏకైక ఇంధన వనరుల ప్రదర్శన సమావేశం. ఇది మొత్తం శక్తి వనరుల భాగస్వాములను ఒకచోట చేర్చే ఉత్ప్రేరకంగా ఉపయోగపడుతుంది. భారతదేశ శక్తి పరివర్తన లక్ష్యాల కోసం. గ్లోబల్ ఆయిల్ & గ్యాస్ సీఈవోలులు మరియు నిపుణులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రౌండ్ టేబుల్ సమావేవం కూడా నిర్వహించారు.
స్టార్టప్‌లను ప్రోత్సహించడం మరియు ప్రోత్సహించడం మరియు వాటిని ఎనర్జీ వాల్యూ చైన్‌లో ఏకీకృతం చేయడం భారతదేశ ఎనర్జీ వీక్ 2024లో ఒక ముఖ్యమైన అంశం. వివిధ దేశాల నుండి దాదాపు 17 మంది ఇంధన మంత్రులు, 35,000పైగా ఇతర ప్రతినిధులు హాజరయ్యారు. అంతేకాకుండా 900 కంటే ఎక్కువ మంది ఎగ్జిబిటర్లు ఇందులో పాల్గొన్నారు. కెనడా, జర్మనీ, నెదర్లాండ్స్, రష్యా, యూకే మరియు యూఎస్ఏ తదితర ఆరు ప్రత్యేక కంట్రీ పెవిలియన్‌లను కలిగి ఉంటుంది. ఇంధన రంగంలో భారతీయ ఎంఎస్ఎంఈల ముందున్న వినూత్న పరిష్కారాలను ప్రదర్శించడానికి ప్రత్యేక మేక్ ఇన్ ఇండియా పెవిలియన్ కూడా ఏర్పాటుచేశారు.
***
(Release ID: 2005498)
Visitor Counter : 198