నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద సంవత్సరానికి 4.12 లక్షల టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి మరియు 1,500 మెగావాట్ల ఎలక్ట్రోలైజర్ తయారీకి టెండర్లు ఇవ్వబడ్డాయి: కేంద్ర విద్యుత్ మరియు నూతన & పునరుత్పాదక ఇంధన మంత్రి ఆర్ కే సింగ్


దీనదయాళ్ పోర్ట్, పారాదీప్ పోర్ట్ మరియు V.O. చిదంబరనార్ (టుటికోరిన్) ఓడరేవును గ్రీన్ హైడ్రోజన్ హబ్‌లుగా అభివృద్ధి చేస్తాం: కేంద్ర విద్యుత్ మరియు నూతన & పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ఆర్ కే సింగ్

Posted On: 07 FEB 2024 5:01PM by PIB Hyderabad

నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి  కోసం వ్యూహాత్మక ఇంటర్వెన్షన్స్ స్కీమ్ కింద భారతదేశంలో గ్రీన్ హైడ్రోజన్ కోసం ఉత్పత్తి సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిదారుల ఎంపికకు టెండర్ కేటాయించినట్లు  కేంద్ర నూతన & పునరుత్పాదక ఇంధనం మరియు విద్యుత్ శాఖ మంత్రి ఆర్ కే సింగ్ తెలియజేశారు. (మోడ్-1-ట్రాంచ్-I), 9 జనవరి, 2024న సంవత్సరానికి 4,12,000 టన్నుల మొత్తం సామర్థ్యం కోసం 10 కంపెనీలకు టెండర్ ఇవ్వబడింది.

సైట్ స్కీమ్ (ట్రాంచ్-I) కింద భారతదేశంలో ఎలక్ట్రోలైజర్‌ల తయారీ సామర్థ్యాలను ఏర్పాటు చేయడానికి ఎలక్ట్రోలైజర్ తయారీదారుల (ఈఎం) ఎంపిక కోసం 2024, జనవరి 12న 8 కంపెనీలకు సంవత్సరానికి 1,500 మెగావాట్ల మొత్తం సామర్థ్యం కోసం  టెండర్ ఇవ్వబడింది.

సైట్ మోడ్ 2A (గ్రీన్ అమ్మోనియా కోసం అగ్రిగేషన్ మోడల్) మరియు మోడ్ 2B (గ్రీన్ హైడ్రోజన్ కోసం అగ్రిగేషన్ మోడల్) కోసం స్కీమ్ మార్గదర్శకాలు  2024, జనవరి 16న జారీ చేయబడ్డాయి.

షిప్పింగ్ సెక్టార్‌లో గ్రీన్ హైడ్రోజన్ వినియోగం కోసం పైలట్ ప్రాజెక్ట్‌ల అమలు కోసం స్కీమ్ మార్గదర్శకాలు 2024, ఫిబ్రవరి 1న  జారీ చేయబడ్డాయి.

ఈ స్కీమ్‌ల కింద ప్రాజెక్ట్‌లు..  ఒకసారి ఖరారు అయిన తర్వాత, దేశంలోని వివిధ రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో వచ్చే అవకాశం ఉంది.

నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌లో కీలకమైన అంశం ఏమిటంటే...  పెద్ద ఎత్తున ఉత్పత్తి  లేదా హైడ్రోజన్‌ను గ్రీన్ హైడ్రోజన్ హబ్‌లుగా ఉపయోగించుకునే సామర్థ్యం ఉన్న ప్రాంతాలను గుర్తించడం మరియు అభివృద్ధి చేయడం. మిషన్ ప్రారంభ దశలో రెండు గ్రీన్ హైడ్రోజన్ హబ్‌ల ఏర్పాటును అందిస్తుంది. ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ మూడు ప్రధాన ఓడరేవులను గుర్తించింది. దీనదయాళ్, పారాదీప్ మరియు వీ.ఓ. చిదంబరనార్ (టుటికోరిన్) పోర్టులను హైడ్రోజన్ హబ్‌లుగా అభివృద్ధి చేస్తారు.

నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ 2023,  జనవరిలో ప్రభుత్వం ప్రారంభించిన నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌ను రూ.19,744 కోట్లతో అమలు చేస్తోంది. గ్రీన్ హైడ్రోజన్ మరియు దాని ఉత్పన్నాల ఉత్పత్తి, వినియోగం మరియు ఎగుమతి కోసం భారతదేశాన్ని గ్లోబల్ హబ్‌గా మార్చడం ఈ మిషన్ యొక్క ప్రధాన లక్ష్యం.

గ్రీన్ హైడ్రోజన్ కోసం ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి వివిధ ప్రోత్సాహకాలను అందిస్తూ వివిధ రాష్ట్రాలు తమ సొంత గ్రీన్ హైడ్రోజన్ విధానాలను కూడా ప్రకటించాయి.

పెట్రోలియం మరియు సహజ వాయువు నియంత్రణ మండలి (పీఎన్జీఆర్బీ) గ్యాస్ ట్రేడింగ్ ఎక్స్ఛేంజ్ (ల) స్థాపన మరియు కార్యకలాపాలను నియంత్రించడానికి పెట్రోలియం మరియు సహజ వాయువు నియంత్రణ మండలి (గ్యాస్ ఎక్స్ఛేంజ్) 2020 నిబంధనలను నోటిఫై చేసింది. ఇది తగిన పంపిణీని మరియు సహజ వాయువును ఉత్పత్తి చేయడం ద్వారా లభ్యతను పెంచుతుందని భావిస్తున్నారు. దేశంలో గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు నాంది పలికేందుకు, దేశంలో సమర్థవంతమైన మరియు బలమైన గ్యాస్ మార్కెట్‌ను ప్రోత్సహించడానికి న్యాయమైన మరియు పారదర్శక పద్ధతిలో గ్యాస్ ట్రేడింగ్‌ను ప్రోత్సహించడానికి  గ్యాస్ ఎక్స్ఛేంజ్ ఒక ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్‌ను అందిస్తుంది. ఈ నిబంధనల ప్రకారం ఇండియన్ గ్యాస్ ఎక్స్ఛేంజ్ లిమిటెడ్ (ఐజీఎక్స్) 02.12.2020నపెట్రోలియం మరియు సహజ వాయువు నియంత్రణ మండలి ద్వారా మొదటి గ్యాస్ ఎక్స్ఛేంజ్‌గా అధికారం పొందింది.
ఐజీఎక్స్ బహుళ కొనుగోలుదారులు మరియు విక్రేతలను నియమించబడిన భౌతిక కేంద్రాలలో స్పాట్ మరియు ఫార్వార్డ్ గ్యాస్ కాంట్రాక్టులలో పాల్గొనడానికి అనుమతిస్తుంది.

ఎక్స్ఛేంజ్ ఆరు వేర్వేరు ఒప్పందాల ద్వారా డెలివరీ- ఆధారిత ట్రేడింగ్‌ను సులభతరం చేస్తుంది. వీటిలో డే-ఎహెడ్, డైలీ, వీక్‌ డే, వీక్లీ, ఫోర్ట్‌ నైట్లీ మరియు మంత్లీ, ట్రేడింగ్ విండో వరుసగా ఆరు నెలల వరకు ఉంటుంది. వివిధ డెలివరీ పాయింట్ల వద్ద లావాదేవీలు జరుగుతాయి, ఇవి  : పశ్చిమ, దక్షిణ, తూర్పు, మధ్య, ఉత్తర మరియు ఈశాన్య అనే ఆరు ప్రాంతీయ గ్యాస్ హబ్‌లను కలిగి ఉంటాయి

నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ (ఎన్జీహెచ్ఎం) 2030 నాటికి గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సంవత్సరానికి 5 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తిని అందుబాటులోకి తెస్తుంది.

ఫిబ్రవరి 6, 202న రాజ్యసభలో రెండు వేర్వేరు ప్రశ్నలకు కేంద్ర నూతన & పునరుత్పాదక ఇంధనం మరియు విద్యుత్ శాఖ మంత్రి శ్రీ ఆర్.కె.సింగ్ రాతపూర్వక సమాధానాలలో ఈ సమాచారాన్ని అందించారు.

***


(Release ID: 2005494) Visitor Counter : 136


Read this release in: English , Urdu , Hindi