నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ

క్లీన్ ఎనర్జీ ఇన్నోవేషన్ కోసం ఐఆర్ఈడీఏ, ఐఐటీ భువనేశ్వర్ అవగాహన ఒప్పందం

Posted On: 11 FEB 2024 7:35PM by PIB Hyderabad

ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఏజెన్సీ లిమిటెడ్ (ఐఆర్‌ఈడీఏ),  ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భువనేశ్వర్‌తో ఒ్ అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై సంతకం చేశాయి. పునరుత్పాదక ఇంధన రంగంలో ఆవిష్కరణలు మరియు పరిశోధనలను ప్రోత్సహించే దిశగా ఇదొక ముఖ్యమైన ముందడుగు.  ఈ రోజు (ఫిబ్రవరి 11, 2024న) ఐఐటీ భువనేశ్వర్‌లో జరిగిన 100 క్యూబ్ స్టార్ట్-అప్ కాన్క్లేవ్‌లో ఒప్పందం కుదిరింది. ఆవిష్కరణ మరియు పరిశోధన కార్యక్రమాలు, సాంకేతికత బదిలీ మరియు స్టార్ట్-అప్ పర్యావరణ వ్యవస్థను పెంపొందించడంలో సహకార ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకుంది. ఐఆర్‌ఈడీఏ మరియు ఐఐటీ భువనేశ్వర్ మధ్య సహకారం ఉమ్మడి పరిశోధన ప్రయత్నాలను సులభతరం చేయడానికి, సాంకేతికత బదిలీని సులభతరం చేయడానికి మరియు స్టార్ట్-అప్ పర్యావరణ వ్యవస్థకు సమగ్ర మద్దతును అందించడానికి సిద్ధంగా ఉంది. ఇది ఐఆర్‌ఈడీఏ అధికారుల నైపుణ్యాలను పెంపొందించడానికి.. శిక్షణ కార్యక్రమాలు, సెమినార్లు మరియు వర్క్‌షాప్‌ల వంటి సామర్థ్య-నిర్మాణ కార్యక్రమాలను కూడా కలిగి ఉంటుంది. ఈ అవగాహన ఒప్పందంపై ఐఆర్‌ఈడీఏ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ప్రదీప్ కుమార్ దాస్ మరియు ఐఐటీ భువనేశ్వర్ ఇండిపెండెంట్ డైరెక్టర్ డా. దేబీ ప్రసాద్ డోగ్రా సంతకం చేశారు. కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి & వ్యవస్థాపకత మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్,  ఐఐటీ భువనేశ్వర్ డైరెక్టర్ ప్రొ. శ్రీపాద్ కర్మల్కర సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. ఈ సందర్భంగా ఐఆర్‌ఈడీఏ సీఎండీ మాట్లాడుతూ: "ఐఐటి భువనేశ్వర్‌తో ఈ భాగస్వామ్యం పునరుత్పాదక ఇంధన డొమైన్‌లో ఆవిష్కరణలు మరియు స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించే దిశగా మా ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. రెండు సంస్థల నైపుణ్యం మరియు వనరులను ఉపయోగించుకోవడం ద్వారా, మేము ప్రభావవంతమైన పరిశోధన కార్యక్రమాలను నడపడానికి మరియు పునరుత్పాదక ఇంధన రంగం వృద్ధిని ముందుకు తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నాము." అని అన్నారు. 

 

***(Release ID: 2005488) Visitor Counter : 72


Read this release in: English , Urdu , Hindi