అంతరిక్ష విభాగం
ప్రస్తుతం 61 దేశాలు, ఐదు బహుపాక్షిక సంస్థలతో అంతరిక్ష సహకార పత్రాలపై సంతకాలు చేసినట్టు తెలిపిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
ప్రధానంగా శాటిలైట్ రిమోట్ సెన్సింగ్, శాటిలైట్ నావిగేషన్, శాటిలైట్ కమ్యూనికేషన్, అంతరిక్ష శాస్త్రం, గ్రహాన్వేషణ, సామర్ధ్య నిర్మాణానికి సంబంధించి సహకారం ఉండనుంది
Posted On:
08 FEB 2024 1:57PM by PIB Hyderabad
మొత్తం 61 దేశాలతో, ఐదు బహుపాక్షిక సంస్థలతో అంతరిక్ష సహకార పత్రాలపై సంతకాలు చేసినట్టు ప్రభుత్వం గురువారం తెలిపింది.
రాజ్యసభలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ సహకారం ప్రధానంగా శాటిలైట్ రిమోట్ సెన్సింగ్, శాటిలైట్ నావిగేషన్, శాటిలైట్ కమ్యూనికేషన్, అంతరిక్ష శాస్త్రం, గ్రహాన్వేషణ, సామర్ధ్య నిర్మాణానికి సంబంధించినవని, కేంద్ర శాస్త్ర& సాంకేతిక శాఖ (ఇండిపెండెంట్ ఛార్జి) సహాయమంత్రి, పిఎంఒ, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్లు, అణు ఇంధనం, అంతరిక్ష శాఖల సహాయ మంత్రి డా. జితేంద్ర సింగ్ వివరించారు.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఇప్పటికే యుఎస్ఎ (నాసా) అంతరిక్ష సంస్థతో కలిసి సంయుక్త ఉపగ్రహ మిషన్‌ను అమలు చేయడం కోసం పని చేస్తోంది. దీనిని ఎన్ఐఎస్ఎఆర్ (నాసా, ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్) అన్నది వాస్తవరూపంలో తుది దశలో ఉన్నట్టు డా. జితేందర్ సింగ్ తెలిపారు. ప్రారంభ దశలో ఉన్న తృష్ణ (TRISHNA - థర్మల్ ఇన్ఫ్రారెడ్ ఇమేజింగ్ శాటిలైట్ ఫర్ హై రెజల్యూషన్ నాచురల్ రీసోర్స్ అసెస్‌మెంట్) పేరుతో ఉమ్మడి ఉపగ్రహ మిషన్‌ను అమలు చేయడం కోసం సిఎన్ఇఎస్ (ఫ్రెంచ్ నేషనల్ స్పేస్ ఏజెన్సీ)తో కలిసి ఇస్రో పని చేస్తోంది.
ఇస్రో, జెఎఎక్స్ఎ (జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లొరేషన్ ఏజెన్సీ) సంయుక్త చంద్ర ధ్రువ అన్వేషణ మిషన్‌ను అమలు చేయడానికి సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేశాయి.
అంతరిక్ష రంగంలో భారతీయ అంతరిక్ష విధానం - 2023ను విడుదల చేశారని ఎండ్ టు ఎండ్ కార్యకలాపాలను కొనసాగించడానికి ప్రైవేట్ రంగానికి ఆవిష్కరణల స్వేచ్ఛను అందిస్తుంది. అంతేకాక, ఇండియా నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (ఇన్- స్పేస్) అన్నది అంతరిక్ష రంగంలో ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించి, అధికారం ఇచ్చి, వృద్ధి చేసేందుకు ఏక గవాక్ష ఏజెన్సీగా పని చేస్తుంది.
కార్యక్రమ (ప్రోగ్రామాటిక్) ప్రాధాన్యతలను అభివృద్ధి చేయడం, అంతరిక్ష శాస్త్రం, భూమి పరిశీలన డేటా బేస్‌ను పెంపొందించడం, క్షేత్ర స్థాయి కేంద్ర నెట్‌వర్క్‌లను విస్తరించడం, ఉమ్మడి ప్రయోగాల ద్వారా ఉత్పత్తులు, సేవలను మెరుగుపరచడం, నైపుణ్య ప్రవాహానికి వేదికలను సృష్టించడం వంటి లక్ష్యాలతో ఇస్రో అంతర్జాతీయ సహకారాన్నికొనసాగిస్తుంది.
***
(Release ID: 2004291)
Visitor Counter : 268