వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

అనుకూలమైన వ్యాపార వాతావరణాన్ని సృష్టించి వ్యాపారాన్ని సులభతరం చేసే కార్యక్రమాలను సమన్వయం చేస్తున్న డిపిఐఐటీ

Posted On: 07 FEB 2024 4:58PM by PIB Hyderabad

పరిశ్రమల ప్రోత్సాహం మరియు అంతర్గత వాణిజ్య విభాగం (డిపిఐఐటీ) అనువైన వ్యాపార వాతావరణాన్ని సృష్టించే లక్ష్యంతో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద కార్యక్రమాలను సమన్వయం చేయడానికి నోడల్ విభాగంగా ఏర్పాటు చేయబడింది. వ్యాపారాన్ని సులభతరం చేయడంలో డిపిఐఐటీ తీసుకున్న కొన్ని చర్యలు క్రింది విధంగా ఉన్నాయి:

ప్రపంచ బ్యాంక్ దానిని నిలిపివేయడానికి ముందు అక్టోబర్, 2019లో ప్రచురించబడిన ప్రపంచ బ్యాంక్ డూయింగ్ బిజినెస్ రిపోర్ట్ (డిబిఆర్), 2020లో భారతదేశం 63వ స్థానంలో ఉంది. డిబిఆర్‌లో భారతదేశ ర్యాంక్ 2014లో 142వ స్థానంలో ఉండగా 2019 నాటికి 63వ ర్యాంకుకి మెరుగుపడింది. 5 సంవత్సరాల వ్యవధిలో 79 ర్యాంక్‌ల జంప్‌ను నమోదు చేసింది.

వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక (బిఆర్ఏపి)కు చెందిన డైనమిక్ సంస్కరణ కార్యక్రమానికి డిపిఐఐటీ నాయకత్వం వహిస్తోంది, ఇందులో దేశంలోని అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు  నియమించబడిన పారామితులపై అమలు చేసిన సంస్కరణల ఆధారంగా అంచనా వేయబడతాయి. సంస్కరణల దృష్టి ఇప్పటికే ఉన్న నిబంధనలు మరియు ప్రక్రియలను క్రమబద్ధీకరించడం మరియు అనవసరమైన అవసరాలు మరియు విధానాలను తొలగించడం వంటివి ఉన్నాయి. బిఆర్‌ఏపి ఇన్ఫర్మేషన్ విజార్డ్, సింగిల్ విండో సిస్టమ్స్, ఆన్‌లైన్ బిల్డింగ్ పర్మిషన్ సిస్టమ్, ఇన్‌స్పెక్షన్ రిఫార్మ్స్, లేబర్ రిఫార్మ్‌లు మొదలైన సంస్కరణ రంగాలను కవర్ చేస్తుంది. బిఆర్‌ఏపి కసరత్తు వారి వ్యాపార వాతావరణాన్ని మెరుగుపరచడంలో రాష్ట్రాలు/యూటీలలో పోటీని పెంచడంలో నాలెడ్జ్ బేస్ నిర్మించడంలో సహాయపడింది.

పౌరులు మరియు వ్యాపార కార్యకలాపాలపై భారాన్ని తగ్గించే కార్యక్రమాల కోసం డిపిఐఐటీ మంత్రిత్వ శాఖలు/డిపార్ట్‌మెంట్లు మరియు రాష్ట్రాలు/యూటీలతో కూడా సమన్వయం చేసుకుంటుంది. ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం మంత్రిత్వ శాఖలు/రాష్ట్రాలు/యూటీల అంతటా వ్యాపారాన్ని మరియు పౌరుల ఇంటర్‌ఫేస్‌లను సరళీకృతం చేయడం, హేతుబద్ధీకరించడం, డిజిటలైజ్ చేయడం మరియు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మరియు ఈజ్ ఆఫ్ లివింగ్‌ను మెరుగుపరచడం.

కార్యక్రమం యొక్క ప్రధానమైన అంశాలు:

(i) దరఖాస్తులు, పునరుద్ధరణలు, తనిఖీలు, రికార్డుల దాఖలు మొదలైన వాటికి సంబంధించిన విధానాలను సరళీకృతం చేయడం.

(ii) అనవసరమైన చట్టాలను రద్దు చేయడం, సవరించడం లేదా తొలగించడం ద్వారా చట్టపరమైన నిబంధనలను హేతుబద్ధీకరించడం,

(iii) ఆన్‌లైన్ ఇంటర్‌ఫేస్‌లను సృష్టించడం ద్వారా ప్రభుత్వ ప్రక్రియల డిజిటలైజేషన్, మరియు

(iv) మైనర్, టెక్నికల్ లేదా ప్రొసీడ్యూరల్ డిఫాల్ట్‌ల డీక్రిమినైజేషన్.

 జన్ విశ్వాస్ (నిబంధనల సవరణ) చట్టం, 2023.. 27 జూలై 2023న లోక్‌సభలో మరియు 2 ఆగస్టు 2023న రాజ్యసభలో ఆమోదించబడింది. 11 ఆగస్టు 2023న రాష్ట్రపతి ఆమోదం  పొందబడింది. ఈ చట్టం 42 కేంద్ర చట్టాలకు సంబంధించిన 183 నిబంధనలను 19 మంత్రిత్వ శాఖలు/విభాగాల ద్వారా నేరరహితం చేసింది.

నేర నిబంధనలను హేతుబద్ధీకరించడంలో మరియు పౌరులు, వ్యాపారాలు మరియు ప్రభుత్వ విభాగాలు మైనర్, సాంకేతిక లేదా విధానపరమైన డిఫాల్ట్‌లకు జైలు శిక్షకు భయపడకుండా పనిచేసేలా చేయడంలో చట్టం సహాయపడింది. చట్టాలను హేతుబద్ధీకరించడానికి, అడ్డంకులను తొలగించడానికి మరియు వ్యాపారాల వృద్ధిని పెంపొందించడానికి చట్టం మార్గం సుగమం చేసింది.

కేంద్ర వాణిజ్యం మరియు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ సోమ్ ప్రకాష్ ఈరోజు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.

 

***



(Release ID: 2003755) Visitor Counter : 85


Read this release in: English , Urdu , Hindi