సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

ఒక దేశం ఒక పోర్టల్

Posted On: 07 FEB 2024 5:34PM by PIB Hyderabad

ప్రజా ఫిర్యాదుల పరిష్కారం కోసం "సెంట్రలైజ్డ్ పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్ అండ్ మానిటరింగ్ సిస్టమ్" (సీపీజీఆర్‌ఏఎంఎస్‌) పేరిట ఏకీకృత ఫిర్యాదుల పరిష్కార వేదికను కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. https://pgportal.gov.in లింక్‌ ద్వారా ఈ పోర్టల్‌ను ఉపయోగించుకోవచ్చు. ఏ పౌరుడైనా, సీపీజీఆర్‌ఏఎంఎస్‌లో కేంద్ర మంత్రిత్వ శాఖలు/విభాగాలు/రాష్ట్ర ప్రభుత్వాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన ఫిర్యాదులు చేయవచ్చు. భారత ప్రభుత్వంలోని ప్రతి మంత్రిత్వ శాఖ/ విభాగం/ రాష్ట్ర ప్రభుత్వం/యూటీకి ఈ వ్యవస్థలోకి అనుమతి ఉంటుంది. పౌరులు నమోదు చేసిన ఫిర్యాదులను సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖ/ విభాగం/ రాష్ట్రం/ కేంద్ర పాలిత ప్రాంతం పరిశీలించి పరిష్కరిస్తాయి. దాదాపు 1.3 లక్షల మంది కేంద్ర & రాష్ట్ర ప్రభుత్వాల ఫిర్యాదుల పరిష్కార అధికార్లు ఈ వ్యవస్థ కింద ఉన్నారు. సీపీజీఆర్‌ఏఎంఎస్‌తో 19 రాష్ట్రాలు/యూటీల గ్రీవెన్స్ పోర్టళ్లు కూడా ఏకీకృతం అయ్యాయి.

అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిపాలన స్థితిని అంచనా వేయడానికి, కేంద్ర ప్రభుత్వం 2019లో 'గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్'ను (జీజీఐ) ప్రారంభించింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల మధ్య అభివృద్ధి కోసం పోటీ స్ఫూర్తిని ఈ సూచిక పెంచుతుంది. గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ 2020-21 రెండో ఎడిషన్ 2021లో పది రంగాల కింద మొత్తం 58 సూచీలు ఉన్నాయి. అవి వ్యవసాయం & అనుబంధ రంగం, వాణిజ్యం & పరిశ్రమలు, మానవ వనరుల అభివృద్ధి, ప్రజా ఆరోగ్యం, ప్రజా మౌలిక సదుపాయాలు & యుటిలిటీస్, ఆర్థిక పరిపాలన, సామాజిక సంక్షేమం & అభివృద్ధి, న్యాయవ్యవస్థ & ప్రజా భద్రత, ప్రజా కేంద్రీకృత పరిపాలన.

***



(Release ID: 2003750) Visitor Counter : 68


Read this release in: English , Urdu , Hindi