సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
శ్రేష్ట పథకం
Posted On:
06 FEB 2024 2:38PM by PIB Hyderabad
విద్యాసేవారంగంలో లోపభూయిష్టంగా ఉన్న ఎస్సీ ప్రాంతాలలో గ్రాంట్-ఇన్-ఎయిడ్ సంస్థలు (ఎన్‌జిఓలచే నిర్వహించబడుతున్నవి) అధిక నాణ్యత గల విద్యను అందిస్తున్న రెసిడెన్షియల్ హైస్కూల్ పాఠశాలలు ప్రయత్నాల ద్వారా అభివృద్ధి జోక్యాన్ని మెరుగుపరచడం మరియు ప్రభుత్వం యొక్క జోక్యాన్ని మెరుగుపరచడం శ్రేష్ట యొక్క లక్ష్యం. 12వ తరగతి వరకు విద్యను పూర్తి చేయడానికి 9వ & 11వ తరగతిలో సి బీ ఎస్ సి/స్టేట్ బోర్డ్ అనుబంధంగా ఉన్న ఉత్తమ ప్రైవేట్ రెసిడెన్షియల్ పాఠశాలలకు ఆర్థిక సహాయం అందించడం ద్వారా షెడ్యూల్డ్ కులాల యొక్క సామాజిక-ఆర్థిక అభ్యున్నతి మరియు సమగ్ర అభివృద్ధికి సానుకూల ఆవరణాన్ని అందించడం ఈ పథకం లక్ష్యం. ఇంకా, ప్రభుత్వేతర సంస్థలు (ఎన్ జీ ఓ లు)/ వాలంటరీ ఆర్గనైజేషన్స్ (వి ఓ లు)కి కూడా ఆర్థిక సహాయం అందించబడుతుంది, రెసిడెన్షియల్, నాన్ రెసిడెన్షియల్ స్కూల్స్ మరియు హాస్టళ్లను నిర్వహించడం కోసం తగిన మౌలిక సదుపాయాలు మరియు ఎస్ సీ విద్యార్థులకు మంచి విద్యా నాణ్యతను కొనసాగించడం కోసం ఆర్ధిక సాయం అందించబడుతుంది.
అలా అడ్మిషన్ పొందిన ఎస్ సీ విద్యార్థులు మిగిలిన తరగతితో అందుకునేలా స్కీమ్‌లో బ్రిడ్జ్ కోర్సు యొక్క అవకాశం ఉంది. బ్రిడ్జ్ కోర్సులు పాఠశాల వాతావరణాన్ని సులభంగా ఇమిడిపోయే విద్యార్థి సామర్థ్యాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.
ఈ పథకాన్ని రెండు విధాలుగా అమలు చేస్తున్నారు. మోడ్-Iలో, ప్రతి సంవత్సరం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే శ్రేష్ట (నెట్స్) కోసం నేషనల్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా రాష్ట్రాలు/యూ టీ లలో 3000 మంది ప్రతిభావంతులైన ఎస్ సీ విద్యార్థులు ఎంపిక చేయబడతారు మరియు సీ బీ ఎస్ సీ/రాష్ట్ర బోర్డులకు అనుబంధంగా ఉన్న ప్రైవేట్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ప్రవేశం పొందుతారు. మోడ్-2 కింద, షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు విద్యా రంగానికి సంబంధించిన పాఠశాలలు/హాస్టల్ ప్రాజెక్ట్‌లను అమలు చేయడానికి ఎన్ జీ ఓ లకు ఆర్థిక సహాయం అందించబడుతుంది. ఎస్సీ విద్యార్థులకు ప్రతి సంవత్సరం 13500 స్లాట్లు కేటాయించబడ్డాయి.
పథకం యొక్క మోడ్ 1 కింద, విద్యార్థులను 9 మరియు 10 వ తరగతిలో చేర్చుకుంటారు,12 వ తరగతి వరకు విద్యను పూర్తి చేసే వరకు వారికి ఆర్థిక సహాయం అందించబడుతుంది. ఆ తర్వాత, విద్యార్థులు తమ భవిష్యత్ అవకాశాల కోసం వారి తదుపరి అధ్యయనాలను కొనసాగించడానికి పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ లేదా టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ స్కీమ్ కింద ప్రయోజనాలను పొందవచ్చు.
సామాజిక న్యాయం మరియు సాధికారత శాఖ సహాయ మంత్రి శ్రీ ఎ. నారాయణస్వామి ఈరోజు లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారం అందించారు.
****
(Release ID: 2003376)